జీవితంలో విజయాన్ని సాధించాలని, అన్నింటిలోనూ సక్సెస్ అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. అంతదాకా ఎందుకు, మీరు సక్సెస్ కోరుకుంటున్నారా అని అడిగితే ప్రతి ఒక్కరూ అవుననే అంటారు. అయితే మనం అనుకున్నంత సులువేం కాదు విజయాన్ని సాధించడం. ఇందుకోసం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఎన్నో అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. జీవితంలో విజయం సాధించాలంటే కచ్చితంగా కొన్ని రకాల అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం... సక్సెస్‌ని చవిచూద్దాం...
విజయం సాధించిన ప్రతి ఒక్కరి వెనకాల ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉండే ఉంటాయి. అయితే ఆ కష్టాలను ఇష్టాలుగా... ఆ కన్నీటిని పన్నీటిగా స్వీకరిస్తేనే వారు విజయాన్ని సొంతం చేసుకుని ఉంటారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
సమయాన్ని సద్వినియోగం... అందరికీ రోజులో ఉండేది 24 గంటల మాత్రమే. అయితే ఎవరు ఎక్కువగా ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారన్న సూత్రమే సాఫల్యాన్ని సూచిస్తుంది. అందుకోసం చేసుకోవాల్సిన మొదటి అలవాటు ఉదయాన్నే త్వరగా నిద్ర మేల్కొనడం. కనీసం ఉదయం ఐదింటికల్లా నిద్రలేవడాన్ని అలవాటు చేసుకుంటే... రోజంతా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత సమయం మిగులుతుందో మనకే అనుభవంలోకి వస్తుంది.
బుక్ రీడింగ్..
విజయం సాధించే వారిలో ఉండే మరో మంచి లక్షణం పుస్తక పఠనం. జీవితంలో గొప్ప స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా స్ఫూర్తిదాయకమైన పుస్తకాలను, గొప్పవారి జీవిత కథలను, ఆత్మకథలను చదవడం వల్ల మనసు పొరలు తెరుచుకుంటాయి. కొత్త ఉత్సాహం వస్తుంది. ఒక్కసారి పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే సరి... ఆ తర్వాత పుస్తకాలు చదవకుండా ఉండలేరు.
ఆరోగ్యం... ఆకృతి!
జీవితంలో అనుకున్నది సాధించాలంటే ముందుగా మన ఆరోగ్యం బాగుండాలి. అందుకే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుంటారు. కచ్చితంగా ఉదయం వ్యాయామాలు చేస్తుంటారు. మంచి ఆహారం తీసుకుంటారు. రాత్రి సమయానికి నిద్ర΄ోతారు. ఆరోగ్యం బాగున్న వారే అహరహం శ్రమించగలిగే శక్తిని కలిగి ఉంటారనే విషయాన్ని మరచి ΄ోకూడదు.
సరైన స్నేహం..
మనం ఎప్పుడూ మంచి స్నేహితులనే ఎంచుకోవాలి. శల్య సారథ్యం చేసేవారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. శల్య సారథ్యం అంటే నువ్వు ఆ పని చెయ్యలేవు, నీ వల్ల అది సాధ్యం కాదు అంటూ వెనక్కి లాగడం. అందువల్ల మన పక్కన సానుకూల దృక్పథంతో ఉండేవారే ఉంటే మనకు చాలా మంచిది. అందువల్ల అలా పాజిటివ్‌గా ఉండే వారినే ఎంచుకోవడం, అలాంటి వారితోనే స్నేహం చేయడం చాలా మంచిది. కొందరు నిత్యం నెగిటివ్ ఆలోచనతో, నెగిటివ్ మాటలతో విసిగిస్తుంటారు. అలాంటి వారితో స్నేహం చేస్తే మీరు కూడా నెగిటివ్ దారిలోనే వెళ్తారు.
వాదనలకు దూరంగా ఉండటం..
జీవితంలో విజయం సాధించిన వారు ఎప్పుడైనా ఇతరులతో వాదనలకు దూరంగా ఉంటారు. వీలైనంత తక్కువ వాదిస్తుంటారు. ఎదుటి వ్యక్తితో వాదించే సందర్భంగా వచ్చినా మౌనంగా ఉంటారు తప్ప.. వాదనలకు దిగరు.
ఇవి చదవండి: మీ బ్రెయిన్ ఆక్టివ్ ఉండాలంటే.. ఇలా చేయండి!
Comments
Please login to add a commentAdd a comment