
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో తన ఫ్యామిలితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు హీరో విజయ్ దేవరకొండ. దాంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటాడు రౌడీ. నిన్న ఫాదర్స్ డే సందర్భంగా రౌడీ తన నాన్నతో కలిసి ఉన్న ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో తన తండ్రితో కలిసి విజయ్ ఫోన్‌లో ఏదో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. (అమృతా ప్రణయ్ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్.)
‘నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో, రిస్క్‌లో, ప్రతి సహసోపేతమైన పనిలో నేనున్నాను నీకు తోడుగా ఉన్నాను అని ఎప్పుడూ చెప్పే వ్యక్తి’ అని కాప్షన్ జోడించి విజయ్ ఆ ఫోటోను పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫోటోలో రౌడీ లుక్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. పొడవాటి జుట్టు, ఫ్రెంచ్ స్టైల్‌లో గడ్డం పెంచి కనిపించాడు. ఈ లుక్‌లో విజయ్‌ను చూసి కొంత మంది రాకేష్‌మాస్టర్ లా ఉన్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్’ సినిమాలో ప్రస్తుతం విజయ్ నటిస్తున్నాడు. సినిమా షూటింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. (విజయ్‌కు ‘మా’ తాత్కాలిక అధ్యక్షుడి మద్దతు)
Comments
Please login to add a commentAdd a comment