
Naga Chaitanya Look from Thank You Movie: అక్కినేని వారసుడు, టాలీవుడ్ గుడ్ బ్యాయ్ నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో ఏడాది గ్యాప్‌లోనే రెండు హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'థాంక్యూ' చిత్రంతో బిజీగా ఉన్నాడు. చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే తాజా షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చైతూ ఇంటెన్స్ లుక్‌లో కనిపించాడు.
(చదవండి: ఓటీటీలోకి నాగ చైతన్య.. టైమ్ ట్రావెల్ కథలో జర్నలిస్ట్‌గా !)
నాగ చైతన్య గడ్డంతో, స్పెక్ట్స్ పెట్టుకుని సరికొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఫొటోను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నాడు చైతూ. ఈ పిక్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తీయడం విశేషం. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా 'పీసీ సర్ #థాంక్యూదిమూవీ' అంటూ అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే చైతూ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'లో అలరించనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment