‘నా జీవితంలో ఆయనే నాకు స్పూర్తి’ | Fathers Day : Ram Charan, Allu Arjun Share Fond Memories | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 17 2018 7:42 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Fathers Day : Ram Charan, Allu Arjun Share Fond Memories - Sakshi

ఫాదర్స్‌డే రోజున తమ తండ్రులతో వారికి ఉన్న అనుభవాల్ని, జ్ఞాపకాలను టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు పంచుకున్నారు. అంతేకాక ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా తన తండ్రితో ఉన్న బంధాన్ని, ఆయనపై ఉన్న ప్రేమను గుర్తు చేసుకున్నారు. ‘నాన్న అంటే చాలా అభిమానం.. ఆయన అంటే భయం కూడా ఉంటుంది. నా జీవితంలో ఆయనే నాకు స్పూర్తి’ అని చిరంజీవి అన్నారు.

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవికు ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ‘మై గైడ్‌.. మై హీరో.. మై ఇన్సిప్రేషన్‌ అని మా నాన్న.. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్న’ అని ట్విటర్‌లో పోస్టు చేశారు.

హీరో అల్లు అర్జున్‌ తన ఫాదర్‌ అల్లు అరవింద్‌కు ట్విటర్‌ ద్వారా ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ‘నేను ఇప్పటి వరకు చూసిన, విన్న ఫాదర్స్‌ అందరికంటే నువ్వే చాలా గొప్ప. మీరు నాన్నగా లభించడం నా అదృష్టం. నాన్న ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు. ఈ రోజుని నేను ప్రతిరోజు సెలబ్రేట్‌ చేసుకుంటాన’ని తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement