నాన్నే నాకు స్ఫూర్తి : సీఎం వైఎస్‌ జగన్‌ | Father Is My Inspiration YS Jagan Tweet On Father's Day | Sakshi
Sakshi News home page

నాన్నే నాకు స్ఫూర్తి : సీఎం వైఎస్‌ జగన్‌

Published Sun, Jun 21 2020 1:23 PM | Last Updated on Sun, Jun 21 2020 9:11 PM

Father Is My Inspiration YS Jagan Tweet On Father's Day - Sakshi

సాక్షి, అమరావతి : ఫాదర్స్‌ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన తండ్రి దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ‘నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలోని ప్రతి కీలక ఘట్టంలో నాన్నే నాకు స్ఫూర్తి. ప్రతీ తండ్రి పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తాడు. పిల్లలకు ప్రేమను.. స్ఫూర్తిని పంచుతారు. కష్టకాలంలో అండగా ఉంటారు, ప్రేమిస్తారు. నాన్నే మనకు తొలి స్నేహితుడు, గురువు, మన హీరో. మన సంతోషాలన్నీ నాన్నతోనే పంచుకుంటాం, ప్రతీ తండ్రికి ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు’ అంటూ వైఎస్సార్‌ ఫోటోను జతచేశారు. (నా దగ్గర ఉండు నాన్నా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement