
సాక్షి, సిటీబ్యూరో: రానున్న ఫాదర్స్ డే సందర్భంగా తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని పెంచే వైవిధ్యభరితమైన ప్లాటినం ఆభరణాల్ని అందుబాటులోకి తెచ్చినట్టు ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కలెక్షన్‌లో బ్రాస్‌లెట్స్, రింగ్స్, చెయిన్స్ తదితర విభిన్న రకాల వెరైటీలలో నగరంలోని ప్రముఖ షోరూమ్స్‌లో కొలువుదీరినట్టు వివరించారు.
గెలాక్సీ బడ్స్..
సంగీత ప్రియులైన తండ్రులకు పిల్లలు అందించదగిన కానుకగా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ బ్రాండ్ శామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ పేరుతో ప్రత్యేకమైన ఉత్పత్తులను సిటీ మార్కెట్లోకి విడుదల చేసింది. వైవిధ్యభరితమైన ఫీచర్లతో ఈ కార్డ్ ఫ్రీ ఇయర్ బడ్స్ రూపొందాయని, అలాగే గెలాక్సీ వాచ్ వంటివి కూడా ప్రత్యేకంగా అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.