
సుంకాల ఎగవేత కట్టడికి ప్రభుత్వం చర్యలు
విలువైన లోహాలపై దిగుమతి సుంకం ఎగవేతను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 99 శాతం స్వచ్ఛత కలిగినవి మినహా ప్లాటినం అల్లాయ్ దిగుమతులు ఇక నుంచి నియంత్రిత కేటగిరీ కిందకు వస్తాయని ప్రకటించింది. దిగుమతి సుంకాలను తప్పించుకునేందుకు కొంతమంది దిగుమతిదారులు బంగారం ఉత్పత్తులను ప్లాటినం అల్లాయ్‌గా మారుస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉన్న భారత్ చాలా కాలంగా దిగుమతి సుంకాలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్లాటినం అల్లాయ్ దిగుమతులపై స్పష్టమైన వర్గీకరణ ఉండడం ద్వారా ప్రభుత్వం వాణిజ్య పద్ధతులపై నియంత్రణను కఠినతరం చేసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం ప్లాటినం మిశ్రమ దిగుమతులను ‘ఉచితం’గా వర్గీకరించారు. అంటే ఇది సాపేక్షంగా నియంత్రణ లేని వాణిజ్యానికి అనుమతిస్తుంది. అయితే, దీన్ని దుర్వినియోగం చేస్తున్నారనే వాదనలున్నాయి. దాంతోపాటు ఇటీవల కాలంలో బంగారం ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు అధికమవుతుండడంతో వాటిని ప్లాటినం అల్లాయ్‌లుగా మార్చి వాణిజ్యానికి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఈ చర్యలు బంగారు నగలు, విలువైన లోహాల పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. 99 శాతం స్వచ్ఛత కలిగినవి మినహా ప్లాటినం అల్లాయ్ దిగుమతులు ఇక నుంచి నియంత్రిత కేటగిరీ కిందకు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పన్ను ఎగవేతను అరికట్టే ప్రయత్నాలు చేపడుతోంది. పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలు మారాల్సిన అవసరాన్ని ఇది చర్చ నొక్కి చెబుతుంది. పరిశ్రమ వ్యూహాలను ఎప్పటికప్పుడు పునఃసమీక్షిస్తూ మందుకుసాగాలని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: వేతనం కాదు.. ఉద్యోగుల మనోభావాలివి..
ప్రభుత్వ చర్యల ప్రభావం ఇలా..
సుంకాల ఎగవేతను అరికట్టడం: అధిక దిగుమతి సుంకాలను దాటవేసేందుకు దిగుమతిదారులు బంగారం ఉత్పత్తులను ప్లాటినం అల్లాయ్‌గా మలచకుండా నిరోధించడమే ఈ విధానం లక్ష్యం. ఈ లొసుగును కట్టడి చేయడం ద్వారా ప్రభుత్వం ఆదాయ మార్గాలను పరిరక్షించవచ్చు. న్యాయమైన వాణిజ్య పద్ధతులను నిర్ధారించవచ్చు.
ఆభరణాల పరిశ్రమపై ప్రభావం: ప్లాటినం మిశ్రమాలపై ఆధారపడే నగల వ్యాపారులకు ఖర్చులు పెరగడానికి ఈ చర్యలు దారితీయవచ్చు. ఇది ప్లాటినం ఆభరణాల అధిక ధరలకు అవకాశం కల్పిస్తుంది. ఇది వినియోగదారుల డిమాండ్‌ను ప్రభావితం చేస్తుంది.
ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడం: ఈ చర్య ప్లాటినం మిశ్రమాల దేశీయ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహిస్తుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment