యూఏఈ నుంచి 210 శాతం వృద్ధి
కస్టమ్స్ డ్యూటీలో రాయితీల వల్లే
న్యూఢిల్లీ: యూఏఈ నుంచి బంగారం, వెండి దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం లో గణనీయంగా పెరిగాయి. 210 శాతం అధికంగా 10.7 బిలియన్ డాలర్లు (88,810 కోట్లు) విలువైన బంగారం, దిగుమతులు నమోదైనట్టు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీ యేటివ్ (జీటీఆర్‌ఐ) సంస్థ అధ్యయనంలో తెలిసింది. 2022–23లో బంగారం, వెండి దిగుమతుల విలువ 3.5 బిలియన్ డాలర్లుగానే ఉంది. భారత్–యూఏఈ సమగ్ర ఆరి్థక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కింద యూఏఈకి భారత్ కలి్పంచిన కస్టమ్స్ డ్యూటీ రాయితీలే ఈ పెరుగుదలకు కారణమని జీటీఆర్‌ఈ ఓ నివేదికలో వెల్లడించింది.
పెరిగిన దిగుమతులను నియంత్రించేందుకు కస్టమ్స్ డ్యూటీ రాయితీలను సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. యూఏఈ నుంచి వెండి దిగుమతులపై 7 శాతం టారిఫ్ రాయితీని భారత్ కల్పిస్తోంది. దిగుమతుల పరిమాణంపై ఎలాంటి పరిమితి విధించలేదు. అదే బంగారం అయితే ఒక ఆరి్థక సంవత్సరంలో 160 మెట్రిక్ టన్నుల వరకు ఒక శాతం డ్యూటీ రాయితీ కింద అనుమతించింది. 2022 మే నుంచి రెండు దేశాల మధ్య సీఈపీఏ అమల్లోకి వచ్చింది.
దీనికితోడు గిఫ్ట్ సిటీలోని ‘ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్సే్ఛంజ్’(ఐఐబీఎక్స్) ద్వారా యూఏఈ నుంచి ప్రైవేటు సంస్థలు బంగారం, వెండి దిగుమతులకు ప్రభుత్వం అనుమతించింది. బంగారం, వెండి మినహా యూఏఈ నుంచి ఇతర ఉత్పత్తుల దిగుమతులు గత ఆరి్థక సంవత్సరంలో క్షీణించాయి. 2022–23లో 48 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు యూఏఈ నుంచి భారత్‌కు రాగా, 2023–24లో 9.8 శాతం తక్కువగా 48 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
ఇదే ధోరణి ఉండకపోవచ్చు..
యూఈఏ నుంచి బంగారం, వెండి దిగుమతులు ఇక ముందూ ఇదే స్థాయిలో కొనసాగకపోవచ్చని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఎందుకంటే యూఏఈలో బంగారం లేదా వెండి తవ్వకాలు (మైనింగ్) లేవని, కనుక ఆ దేశానికి ఈ ఉత్పత్తుల ఎగుమతులతో ఒనగూడే అదనపు విలువ ఏమంత ఉండదన్నారు. ‘‘ప్రస్తుతం భారత్‌లో బంగారం, వెండి, ఆభరణాల దిగుమతులపై 15 శాతం సుంకం అమలవుతోంది. ఇదే అసలు మూలంలోని సమస్య. టారిఫ్‌లను 5 శాతానికి తగ్గించినట్టయితే అక్రమ రవాణా, దురి్వనియోగానికి అడ్డుకట్ట పడుతుంది’’అని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. యూఏఈ నుంచి దిగుమతులపై తక్కువ టారిఫ్ నేపథ్యంలో ఆర్బిట్రేజ్ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు రాయితీతో కూడి కస్టమ్స్ సుంకాలను సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. బంగారం మాదిరే వెండి దిగుమతులపై వార్షిక పరిమితిని అయినా విధించాలని సూచించారు. దీనివల్ల ఆదాయ నష్టాన్ని తగ్గించుకోవచ్చన్నారు. గిఫ్ట్ సిటీ ద్వారా బంగారం, వెండి దిగుమతుల విషయంలో నిబంధనలను కఠినతరం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment