పండుగముందు పసిడి జోష్‌: రూ.1100 పెరుగుదలతో కొత్త రికార్డ్‌ | Gold Price Hike Before Festival in India | Sakshi
Sakshi News home page

పండుగముందు పసిడి జోష్‌: రూ.1100 పెరుగుదలతో కొత్త రికార్డ్‌

Published Sat, Mar 29 2025 7:06 AM | Last Updated on Sat, Mar 29 2025 9:01 AM

Gold Price Hike Before Festival in India

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌ ప్రకటనలతో అంతర్జాతీయంగా మరోసారి బంగారానికి డిమాండ్‌ ఏర్పడింది. అనిశి్చతుల్లో సురక్షిత సాధనంగా భావించే బంగారం శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,100 ఎగిసి 10 గ్రాములకు (99.9 స్వచ్ఛత) రూ.92,150 వద్ద ముగిసింది. ఇది నూతన గరిష్ట స్థాయి కావడం గమనార్హం.

వెరసి 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద బంగారం 35 శాతం ర్యాలీ చేసింది. 2024 ఏప్రిల్‌ 1న బగారం ధర రూ.68,420 స్థాయిలో ఉంది. అక్కడి నుంచి రూ.23,730 లాభపడింది. ఒకవైపు ఈక్విటీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుంటే, మరోవైపు పసిడి ఇన్వెస్టర్లకు కాసులు కురిపించింది.

ఢిల్లీ మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.1,100 పెరిగి రూ.91,700 స్థాయికి చేరుకుంది. వెండి ఒకే రోజు రూ.1,300 పెరిగి.. కిలో ధర రూ.1,03,000కు చేరింది. మార్చి 19న గత రికార్డు రూ.1,03,500 సమీపానికి చేరుకుంది. ‘‘బంగారం మరో కొత్త రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం, ఆర్థిక వృద్ధిపై పడే ప్రభావం నేపథ్యంలో బంగారానికి డిమాండ్‌ ఏర్పడింది’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. 

ఇదీ చదవండి: ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది 15 రోజులే!.. ఎందుకంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement