
ఫాదర్స్ డే సందర్భంగా వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ఫాదర్స్ డే సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ట్వీటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ఫాదర్స్ డే సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ట్వీటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవితంలోని ప్రతి ప్రయాణంలో ఎల్లప్పుడూ మా నాన్నే నిజమైన గొంతుకగా నిలిచారు. ఆయన నాకు గొప్ప బహుమతిని ఇచ్చారు. ఆయన నమ్మకం నాలోనే ఉంది’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.
అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. ‘నాన్న మీ చేతి వేలిని పట్టుకుని నడిపిస్తాడు. ప్రపంచాన్ని చూపిస్తాడు. ఎప్పటికీ మీ వెన్నంటే ఉంటాడు’ అంటూ ట్వీట్ చేసింది.