#YSR; ఆయన మన మధ్యే ఉన్నారు! | YS Jagan Remembers YSR On Fathers Day Tweet | Sakshi
Sakshi News home page

#ఫాదర్స్‌డే; ఆయన మన మధ్యే ఉన్నారు!

Published Sun, Jun 17 2018 5:25 PM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

YS Jagan Remembers YSR On Fathers Day Tweet - Sakshi

సాక్షి, రావులపాలెం: దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్సార్‌ కలకాలం ప్రజల మధ్యే, వారి మనసుల్లో ఉండిపోతారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విశ్వసించారు. ఫాదర్స్‌ డే సందర్భంగా మహానేత స్మరణను ట్విటర్‌ ద్వారా ప్రజలతో పంచుకున్నారు.

‘‘జీవితంలో ఎంత ఎదిగినా, ఏ స్థాయికి చేరినా మనం స్మరించుకునేది నాన్ననే. నా తండ్రిని నాతోపాటూ రాష్ట్రమంతా స్మరించుకుంటుండటం అదృష్టంగా భావిస్తున్నా. అందరికీ ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు. ఆ మహానేత ఎన్నటికీ మన మధ్యే ఉంటారని, ఉండాలని విశ్వసిస్తున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 191వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం మండలంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement