సాక్షి, ఏలూరు: సరిగ్గా 14 ఏళ్ల కిందట.. ఇదే రోజు(మే 14న) ఆంధ్రప్రదేశ్ అంతటా సంబరాలు అంబరాన్నంటిన సందర్భం. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజది. అంతటి ప్రశస్థమైన రోజునే రాజన్న కుమారుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవడం మరో విశేషం. ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ సోమవారం వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు.
‘‘2004, మే14న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరూ ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దివంగతనేత ప్రమాణం చేసిన రోజునే ప్రజాసంకల్పయాత్ర 2 వేల కిలోమీటర్లకు చేరుకుంది. నాటి రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకొస్తానని, రాష్ట్ర ప్రజలందరి కళ్లల్లో సంతోషాలు నింపుతానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా’’ అని వైఎస్ జగన్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
On 14th May,2004,every citizen of AP was jubilant,as Rajanna took oath as AP’s CM. His vision & welfare policies ameliorated the lives of all. As I complete 2000kms of #PrajaSankalpaYatra,on the very same day,this year, I vow to bring back your smiles & restore Rajanna's Rajyam!
— YS Jagan Mohan Reddy (@ysjagan) 14 May 2018
Comments
Please login to add a commentAdd a comment