
నాన్న మంచి స్నేహితుడు అయితే.. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు’ అంటున్నారు లావణ్యా త్రిపాఠి. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా లావణ్య తండ్రితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది.
♦ మా నాన్నగారు వెరీ ఫ్రెండ్లీ. ఆయనకు సెన్సాఫ్ హ్యుమర్ ఎక్కువ. ఆయన్నుంచి నాకు కూడా అది వచ్చింది. నా లైఫ్‌లో నేను చూసిన మంచి వ్యక్తుల్లో ఆయన ఒకరు. నా చిన్నప్పట్నుంచీ ఆయన్ను చూసిన వ్యక్తిగా చెబుతున్నాను... మా డాడీ బెస్ట్. అందర్నీ సమానంగా చూస్తారు. మా ఇంట్లో పని చేసేవాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్లకు ఏదైనా కష్టం అంటే ఆదుకుంటారు. మనం మన కోపాన్ని ఎవరో ఒకరి మీద చూపించవచ్చని కొందరం అనుకుంటాం. కానీ మా డాడీ అలా కాదు. తన కోపాన్ని తనలోనే దాచుకుంటారు. ఆనందాన్ని మాత్రమే పంచుతారు.
లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ
♦ మా డాడీ తన శక్తికి మించిన మంచి పనులు చేయడం చూశాను. ఆ మంచి పనులే ఆయన పిల్లలకు మంచి ఆశీర్వాదాలు అయ్యాయన్నది నా నమ్మకం. యూపీలో చిన్న పల్లెటూరి నుంచి వచ్చినప్పటికీ డాడీ ఆలోచనలు చాలా ఫార్వార్డ్‌గా ఉంటాయి. కూతుళ్లుతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. డాడీలో మంచి ఫ్రెండ్ ఉండటం ఏ కూతురికైనా అదృష్టం.
♦మా డాడీది చిన్నపిల్లల మనస్తత్వం. చాలా కూల్ ఫాదర్. పిల్లల మీద ఏమాత్రం ప్రెజర్ పెట్టని తండ్రి. తన ఇద్దరి కూతుళ్లను, కొడుకుని సమానంగా చూస్తారు. మా ముగ్గుర్నీ ఒకేలా ప్రోత్సహిస్తారు. మా నాన్నగారి సహాయపడే గుణం, పాజిటివ్‌నెస్.. ఇవన్నీ చూస్తుంటే నాకు గర్వంగా ఉంటుంది. మా డాడీ చేసే మంచి పనులు నాకు చాలా స్ఫూర్తిగా ఉంటాయి.. ‘ఐ లవ్ హిమ్’. నాకు ఆయనంటే ప్రేమ మాత్రమే కాదు.. గౌరవం కూడా.
Comments
Please login to add a commentAdd a comment