ఒబామా ఆవేదన
వాషింగ్టన్: పిల్లలను కనడంతోనే తండ్రుల బాధ్యత ముగియదని, అంతకుమించిన కుటుంబ బాధ్యతలను తండ్రులు మోయాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఉద్యోగులైన తండ్రులకు చేయూతనిచ్చేలా, వారి కుటుంబాలకు మద్దతుగా నిలిచేందుకు కొత్త చట్టాలను తమ ప్రభుత్వం తీసుకువస్తుందని శనివారం ఆయన అన్నారు.
జూన్ 19 ‘పాదర్స్ డే’ నేపథ్యంలో ఆయన ఈవిధంగా స్పందించారు. చాలా మంది అమెరికన్లు తండ్రి సంరక్షణకు దూరంగానే జీవిస్తున్నారని, కొందరు బాధ్యత గల తండ్రులు మాత్రమే పిల్లల్ని గైడ్ చేస్తూ కుటుంబ భారం తీసుకుంటున్నారని ఒబామా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తల్లిదండ్రులుగా పిల్లల బాధ్యతలు మోస్తున్న వారికి సాయపడేందుకు నిశ్చయించుకున్నామని వెల్లడించారు.