నాన్న అంటే ప్రేమ.. ధైర్యం | Tollywood Stars Celabrates Fathers day 2020 | Sakshi

నాన్న అంటే ప్రేమ.. ధైర్యం

Jun 22 2020 12:19 AM | Updated on Jun 22 2020 9:10 AM

Tollywood Stars Celabrates Fathers day 2020 - Sakshi

చిరంజీవి, సుష్మిత; లక్ష్మి, మోహన్‌బాబు

జూన్‌ 21.. ఫాదర్స్‌ డేని పురస్కరించుకుని పలువురు సినీ సెలబ్రిటీలు ‘హ్యాపీ ఫాదర్స్‌ డే’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా తమ తండ్రికి శుభాకాంక్షలు చెప్పారు. ఓ కొడుకుగా తమ తండ్రితో ఉన్న బంధాన్ని.. ఓ తండ్రిగా తమ పిల్లలతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. హీరో చిరంజీవి తన తండ్రి వెంకట్రావు, తనయుడు రామ్‌చరణ్‌ తేజ్‌ కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్‌ చేసి, ‘చిరుత.. విత్‌ మై ఛార్మింగ్‌ డాడ్‌. మా నాన్న నవ్వు... నా బిడ్డ చిరునవ్వు... రెండూ నాకు చాలా ఇష్టం. హ్యాపీ ఫాదర్స్‌ డే’’ అంటూ ఓ సందేశం పోస్ట్‌ చేశారు.

తండ్రి చిరంజీవితో చిన్నప్పుడు, ఇప్పుడు కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేసిన రామ్‌చరణ్‌ ‘కొన్ని బంధాల్ని వర్ణించాల్సిన అవసరం లేదు.. హ్యాపీ ఫాదర్స్‌ డే’ అని రాసుకొచ్చారు. తన తండ్రి చిరంజీవికి స్వయంగా హెయిర్‌ కట్‌ చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేసి తండ్రి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు సుష్మిత. తమ తండ్రి మోహన్‌బాబుతో కలిసి ఉన్న ఫొటోల్ని లక్ష్మీ మంచు, విష్ణు, మనోజ్‌ షేర్‌ చేశారు. తండ్రి కృష్ణతో బాల్యంలో దిగిన ఫొటోను మహేశ్‌బాబు షేర్‌ చేసి, ‘నా తండ్రి గురించి నిర్వచించమని చెబితే నా బలం, ధైర్యం, ప్రేమ, స్ఫూర్తి నాన్నే. ఈరోజు నేనేంటో అవి ఆయన నుంచి వచ్చినదే. ఆయన నాతో ఎలా ఉండేవారో నేను నా పిల్లలతోనూ అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను.

నువ్వు నన్ను ముందుండి నడిపించే వ్యక్తివి. హ్యాపీ ఫాదర్స్‌ డే’ అని పేర్కొన్నారు. అలాగే తన పిల్లలు గౌతమ్, సితారలతో మహేశ్‌బాబు ఉన్న ఫొటోల్ని ఆయన శ్రీమతి నమ్రత షేర్‌ చేశారు. తన ఇద్దరు కొడుకులతో కలిసి ఉన్న ఫొటోల్ని గోపీచంద్‌ షేర్‌ చేసి, ‘ఓ తండ్రిగా ఉండటం మంచి అనుభూతి. నా పిల్లల్ని చూసిన ప్రతిసారీ నా జీవితం సంపూర్ణమైందని అనిపిస్తుంది. నా బలం వారే.. ఇందుకు వారికి థ్యాంక్స్‌’ అని పోస్ట్‌ చేశారు.  హీరోలు విజయ్‌ దేవరకొండ, నాగశౌర్య, సుశాంత్, అల్లు శిరీష్, హీరోయిన్లు రాశీ ఖన్నా, రకుల్, కాజల్, అనుపమా పరమేశ్వరన్, శ్రుతీహాసన్, శ్రద్ధా కపూర్, సోనమ్‌ కపూర్‌తో పాటు మరికొందరు నటీనటులు తమ తండ్రితో కలిసి ఉన్న ఫొటోల్ని షేర్‌ చేశారు.

వెంకట్రావు, రామ్‌చరణ్‌; మోహన్‌బాబు, విష్ణు


మహేశ్‌బాబు, కృష్ణ; కుమారులతో గోపీచంద్‌

గోవర్ధన్‌రావు, విజయ్‌ దేవరకొండ; నాగశౌర్య, శంకర్‌ ప్రసాద్‌

నిషా, వినయ్‌ అగర్వాల్, కాజల్‌; రాజేందర్‌ సింగ్, రకుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement