Film Celebrities
-
బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు!
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగిన రేవ్ పార్టీ లో బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నట్టు అందుతున్న సమాచారం కలకలం రేపుతోంది. పుట్టినరోజు వేడుకల పేరిట ఎల్రక్టానిక్ సిటీ సింగేనా అగ్రహారలో ఉన్న ఫార్మ్‌హౌస్‌లో ఈ రేవ్ పార్టీ జరిగింది. ఈ మేరకు అందిన పక్కా సమాచారంతో సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు డీసీపీ శ్రీనివాసగౌడ నేతృత్వంలో రేవ్ పార్టీపై దాడి చేశారు. మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 25 మందికి పైగా యువతులున్నట్టు అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్‌పార్టీ జరిగినట్లు బెంగళూరు పోలీసులు ధ్రువీకరించారు. అయితే పార్టీలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నదీ వెల్లడించలేదు. అదనపు పోలీస్ కమిషనర్ డాక్టర్ చంద్రగుప్తా సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన సైతం జారీ చేశారు. రేవ్ పార్టీ కి సంబందించి ఐదుగురిని అరెస్టు చేశామని, ఎల్రక్టానిక్ సిటీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామన్నారు. రేవ్‌పార్టీలో 100 మంది ఉన్నారని, డాగ్‌స్కా్వడ్‌ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని వివరించారు. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరిట రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జీఆర్ ఫార్మ్‌హౌస్‌లో పార్టీ హెబ్బగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో కాన్కార్డు యజమాని గోపాలరెడ్డి పేరిట ఉన్న జీఆర్ ఫార్మ్‌హౌస్‌లో ఈ పార్టీ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని నిర్వహించినట్లు తెలిసింది. ఈ పార్టీ కోసం విమానాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటీనటులు, మోడళ్లు, టెక్కీలు పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.50 లక్షల వరకు వ్యయం నగరం నడిబొడ్డున ఇంత పెద్దయెత్తున రేవ్ పార్టీ నిర్వహిస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు రావొచ్చని భావించి నగర శివార్లలో నిర్వహించినట్లు సమాచారం. ఈ ఒక్కరోజు పార్టీ కోసం సుమారు రూ.30 లక్షల నుంచి రూ. 50 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. దాడి చేసేందుకు వచి్చన పోలీసులను గమనించగానే నిర్వాహకులు తలుపులు మూసేశారు. అయితే వారు బలవంతంగా తలుపులు తెరిచి లోపలకు వెళ్లారు. అప్పటికే కొందరు డ్రగ్స్‌ను దాచి పెట్టారు. కొంతమంది తమ వద్ద ఉన్న మాదకద్రవ్యాలను టాయిలెట్ కమోడ్లలో వేసి ఫ్లష్ చేశారు. కాగా పోలీసులు ఫార్మ్‌హౌస్‌ను క్షుణ్ణంగా గాలించారు.ముగ్గురు డ్రగ్ పెడ్లర్లతో పాటు నిర్వాహకుడు వాసు, మరొకరు ఇలా.. మొత్తం ఐదు మందిని అరెస్టు చేశారు. వాసు పుట్టినరోజు పార్టీ నిర్వాహకులు అరుణ్, సిద్దిఖి, రణబీర్, నాగబాబులను అదుపులోకి తీసుకున్నారు. పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్లో ఈ పార్టీ కి అనుమతులు తీసుకున్నట్లు వాసు చెబుతున్నప్పటికీ అది అవాస్తవమని తెలుస్తోంది. పార్టీ కి వచి్చన వారు ఫార్మ్‌హౌస్ లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ పాస్వర్డ్ చెప్పేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. రేవ్ పార్టీలో తెలుగు నటులు హేమ, శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ కూడా పాల్గొన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.అయితే తాము ఆ పార్టీలో పాల్గొనలేదని వీడియో బైట్ల ద్వారా వారు వివరణ ఇచ్చారు. అయితే హేమ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఆమె విడుదల చేసిన వీడియో హైదరాబాద్‌లో తీసింది కాదని, ఆ ఫార్మ్‌హౌస్ లోపలే హేమ వీడియో బైట్ ఇచి్చనట్లు ఆమె ధరించిన దుస్తుల ఆధారంగా అనుమానిస్తున్నారు. నేను నా ఇంట్లోనే ఉన్నా: శ్రీకాంత్ బెంగళూరు రేవ్ పార్టీ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ చెప్పారు. ఈ మేరకు తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. ‘నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. నేను బెంగళూరు రేవ్ పార్టీ కి వెళ్లినట్లు, పోలీసులు అరెస్టు చేశారనే వార్తలతో కొందరు నాకు ఫోన్ చేశారు. నేను కూడా వీడియో క్లిప్స్ చూశా. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నారు. కొన్నింటిలో మాత్రం నేను వెళ్లాననే వార్తలు వచ్చాయి.అవి చూసి నేను, మా కుటుంబ సభ్యులందరం నవ్వుకున్నాం. అలా వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. నేనే షాకయ్యా. నేను రేవ్ పార్టీ లకు, పబ్స్‌కు వెళ్లే వ్యక్తిని కాను. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు..’ అని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. నేను హైదరాబాద్‌లోనే చిల్ అవుతున్నా..: సినీ నటి హేమ బెంగళూరులో నన్ను అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ నేను హైదరాబాద్‌లోనే ఉన్నా. ఓ ఫామ్‌హౌస్‌లో చిల్ అవుతున్నా. బెంగళూరులో ఎలాంటి పార్టీ కి వెళ్లలేదు నన్ను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారు. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. -
కళాతపస్వికి కన్నీటి వీడ్కోలు
ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్‌కు అశేష అభిమానగణం కన్నీటి వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో జరిగాయి. శుక్రవారం ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. అంతకుముందు ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. కళాతపస్విని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. బంజారాహిల్స్/సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ (92)కు అశేష అభిమానగణం కన్నీటి వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో సంప్రదాయబద్ధంగా జరిగాయి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విశ్వనాథ్ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి గురువారం రాత్రి ఒంటి గంటకు ఫిలింనగర్‌లోని స్వగృహానికి తరలించారు. రాత్రి నుంచే విశ్వనాథ్ భౌతికకాయాన్ని సందర్శించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అభిమానులు భారీగా విచ్చేయడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. శుక్రవారం ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది. కళాతపస్విని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం శ్మశాన వాటికలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. కన్నీరుమున్నీరైన చంద్రమోహన్ విశ్వనాథ్ భౌతికకాయాన్ని శుక్రవారం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ సంతోష్ కుమార్, సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, పవన్ కల్యాణ్, శరత్‌కుమార్, రాధిక, రాజశేఖర్, జీవిత, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, అల్లు అరవింద్, బోయపాటి శ్రీను, శేఖర్ కమ్ముల, ఆది శేషగిరిరావు, దగ్గుబాటి సురేష్‌బాబు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. విశ్వనాథ్ కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వనాథ్ దర్శకత్వంలో సిరిసిరిమువ్వ సినిమాలో హీరోగా నటించిన చంద్రమోహన్ కన్నీరుమున్నీరయ్యారు. విశ్వనాథ్ భౌతికకాయాన్ని చూడటంతోనే ఆయన విలపిస్తూ అక్కడే కుప్పకూలిపోయారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విశ్వనాథ్ మృతి బాధాకరం: మంత్రి తలసాని కళాతపస్వి విశ్వనాథ్ మృతి బాధాకరమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తలసాని ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, కళల విశిష్టతను చాటేలా అనేక చిత్రాలు నిర్మించిన గొప్ప దర్శకులంటూ కొనియాడారు. ఏపీ ప్రభుత్వం తరపున.. విశ్వనాథ్ అంత్యక్రియల్లో ఏపీ ప్రభుత్వం తరపున బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఆయన విశ్వనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, సంగీత సాహిత్యాలను సృజనాత్మక శైలిలో ప్రేక్షకులకు అందించిన కళాతపస్వి మరణించడం సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి విశ్వనాథ్: ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘సినీ ప్రపంచంలో కె.విశ్వనాథ్ ఒక దిగ్గజం. సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన అతని సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి’.. అని శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. అసమాన ప్రతిభావంతుడు: గవర్నర్ తమిళిసై కె.విశ్వనాథ్ మృతిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక దిగ్గజ దర్శకుడు, నటుడిని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయిందని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన తన అసమాన ప్రతిభతో సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అరుదైన దర్శక దిగ్గజం: కేసీఆర్ ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతికి సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. అతి సా మాన్యమైన కథను ఎంచుకొని.. తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యంగా మలిచిన అరుదైన దర్శ కుడు కె.విశ్వనాథ్ అని కొనియాడారు. గతంలో విశ్వనాథ్ ఆరోగ్యం బాగా లేనప్పుడు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో.. సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు: జగన్ సాక్షి, అమరావతి: సినీ దర్శక దిగ్గజం కె. విశ్వనాథ్ తెలుగు వారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన ట్విట్టర్ ఖాతాల్లో ట్వీట్ చేశా రు. ‘విశ్వనాథ్ గారి మరణం తీవ్ర విచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, బారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ గారు. ఆయన దర్శకత్వం రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి’ అని పేర్కొన్నారు. స్పీకర్, మంత్రుల సంతాపం కె.విశ్వనాథ్ మరణంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. సినిమా తీయాలనుకున్నా విశ్వనాథ్‌తో సినిమా తీయాలన్న తన ఆశ కలగానే మిగిలిపోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కె.విశ్వనాథ్ మృతికి టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర సంతాపం తెలిపారు. -
దేనికైనా ఐదో షోకు అనుమతిస్తాం: సీఎం జగన్
-
సినీ ప్రముఖులతో భేటీ.. సీఎం జగన్ ఏమన్నారంటే..?
సాక్షి, అమరావతి: తెలుగు సినిమా ప్రముఖులతో తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం భేటీ అయ్యారు. సినీనటుడు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్. నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, మహి రాఘవ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఐఎండ్ పీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఐఅండ్ పీఆర్ కమిషనర్, ఎఫ్డిసీ ఎండీ టి విజయ్‌కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: సమస్యలకు శుభం కార్డు.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: చిరంజీవి ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే... : ‘‘మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుంది. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ... దీనిపై ఒక కమిటీని కూడా నియమించాం. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా నాతో పంచుకున్నారు. ఇంకా విస్తృతంగా తెలుసుకునేందుకు మిమ్నల్ని కూడా రమ్మని చెప్పాం. సినిమా పరిశ్రమలో ఉన్న కొన్ని కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని.. ఇండస్ట్రీ నిలబడ్డానికి ఒక మంచి వ్యవస్ధను క్రియేట్ చేసుకునేందుకు తపన, తాపత్రయంతోనే అడుగులు పడ్డాయి. మీరన్నట్టుగా ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి. ప్రాథమికంగా ఒక ప్రాతిపదిక లేనంతవరకు... కొద్దిమందికి ఎక్కువ వసూలు చేయడం, కొద్దిమందికి తక్కువ వసూలు చేయడం అనేది ఉంటుంది. ఈ పాయింట్‌ను కూడా చర్చించాను. నేను, చిరంజీవి అన్న ఇద్దరం కలిసి కూర్చుని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించాం. మంచి ధరలు తీసుకురావడం జరిగింది. ఇవి ఎవరికైనా కూడా మంచి రేట్లే... అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. హీరో పారితోషకం, హీరోయిన్ పారితోషకం, దర్శకుడు పారితోషం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే నిర్మాణవ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడు. అటువంటి వాటిని ప్రత్యేకంగా చూడాలి. అలా ప్రత్యేకంగా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకురారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా, వీటిని పక్కన పెట్టి కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయిన భారీ బడ్జెట్ సినిమాలును ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి. అటువంటి వాటికి వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్ చేయాలని చెప్పాం. ఇక్కడ కూడా రాష్ట్రంలో షూటింగ్‌లు ప్రమోట్ చేయడం కోసం కొంత పర్సెంటేజ్ కేటాయించాం. ఏపీలో సినిమా షూటింగ్‌లు ప్రమోట్ చేయడం కోసం... ఇక్కడ షూటింగ్‌లు జరిపి ఉండాలి అన్న నిబంధనను తీసుకురాగలిగితే ఇక్కడ కూడా షూటింగ్‌లు పెరుగుతాయి. కనీసం ఎంత శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో చేయాలన్న దానిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని దర్శకులు, నిర్మాతలతో మాట్లాడారు. వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నాతో కనీసం 20 శాతం పెడతాము అని చెప్పారు. రేట్లకు సంబంధించినంత వరకు... అందరికీ ఒకటే రేట్లు. ఆన్లైన్ పద్ధతిలో టిక్కెట్లు విక్రయం ప్రభుత్వానికి మంచిది, సినిమా ప్రొడ్యూసర్లకు కూడా మంచిది అన్న కోణంలో చూశాం. ఓటీటీలతో పోటీపడాల్సిన పరిస్థితిలో సమతుల్యత కూడా ఉండాలని చర్చించాం. ఏడాదికి వేయిరూపాయలతో అమెజాన్ ఇస్తుంది. నెలకు సగటున రూ.80లు పడుతుంది. దీన్నికూడా దృష్టిలో ఉంచుకోవాలి. చిరంజీవిగారితో కూడా సుదీర్ఘంగా ఇదే విషయంపై చర్చించాం. ఆలాగే కనీస ఆదాయాలు రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుంది. దాన్ని కూడా సమతుల్యం చేసుకుని సినిమాలు తీసే పరిస్థితి ఎలా అన్న ఆలోచనతో రీజనబుల్‌రేట్లు దిశగా వెళ్లాం. సినిమా చూసే ప్రేక్షకులకు భారంకాకుండా, ఆ రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించేలా ఉండేలా రేట్లను మార్పు చేశాం. మరొక్క అంశం...మీరు ఐదో షోను కూడా తీసుకురావాలని అడిగారు. సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారం.. ఆ తర్వాత వారం ఆడగలిగితే సూపర్‌హిట్ అవుతుంది. ఆ పాయింట్ అర్ధం చేసుకున్నాం. అదే సమయంలో అది అందరికీ వర్తిస్తుంది. చిన్న సినిమాలకు అవే రేట్లు వర్తిస్తాయి. వారిక్కూడా మంచి ఆదాయాలు వస్తాయి. ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుంది. మల్టీప్లెక్స్‌లును కూడా మంచి ధరలతో ట్రీట్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పిన అన్ని విషయాలను మనసులో పెట్టుకున్నా. మీ అందరికీ సంతోషం కలిగించినందుకు ఆనందంగా ఉంది. నెమ్మదిగా సినీపరిశ్రమకూడా విశాఖపట్నం రావాలి. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా. నెమ్మదిగా ఇక్కడ కూడా దృష్టిపెట్టండి. తెలంగాణాతో పోలిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోంది. తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంది. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్ చేస్తోంది. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, ధియేటర్లు కూడా ఎక్కువ. ఆదాయపరంగా కూడా ఏపీ ఎక్కువ. వాతావరణం కూడా బాగుంటుంది. అందరికీ స్ధలాలు ఇస్తాం. స్టూడియోలు పెట్టేందుకు ఆశక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తాం. జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దాం. విశాఖ బిగ్గెస్ట్‌సిటీ. కాస్త పుష్‌చేయగలిగే అవకాశాలున్న సిటీ విశాఖపట్నం. చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీపడగలదు. మనం ఓన్ చేసుకోవాలి, మనందరం అక్కడకి వెళ్లాలి... అప్పుడే విశాఖపట్నం, ఇవాళ కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో.. మహానగరాలతో పోటీపడుతుంది. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలి. అందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందరికీ స్థలాలు ఇస్తా... ఇళ్లస్థలాలతోపాటు, స్టూడియో స్థలాలు కూడా ఇస్తానని నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలి. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలి. దీనికోసం కార్యాచరణ చేసుకోవాలని కోరుతున్నాను. సినిమా క్లిక్ కావాలంటే పండగ రోజు రిలీజ్ చేస్తే హిట్ అవుతుందని అందరికీ తెలుసు. ఇక్కడే చిన్నసినిమాను రక్షించుకోవడానికి కూడా కొంత సమతుల్యత అవసరం. పరిశ్రమనుంచే దీనికి తగిన కార్యాచరణ ఉండాలని కోరుతున్నాం. ఆ పండగ రోజు మాకు అవకాశాలు లేవని చిన్నసినిమా వాళ్లు అనుకోకుండా... కాస్త సమతుల్యత పాటించాలని విజ్ఞప్తి. ఈ విషయంలో కలిసి పనిచేద్దాం. వాళ్లు కూడా పరిశ్రమలో భాగమే. వాళ్లనూ భాగస్వామ్యులు చేయాలని’’ సీఎం జగన్ అన్నారు. -
అమ్మ చేతి తీపి రుచి
పిల్లల బాధ్యతలు తీరాక అమ్మలకు కొంత విశ్రాంతి లభిస్తుంది. అది బాగా డబ్బు ఉన్నవారికైనా, మధ్యతరగతి జీవితంతో నెట్టుకొస్తున్నవారికైనా. ఆ విశ్రాంత సమయాన్ని కొందరు మాత్రం ఉపయుక్తంగా, తమ కలలు నెరవేర్చుకోవడానికి కృషి చేస్తుంటారు. వారిలో నీలూ భండారి ఒకరు. 64 ఏళ్ల వయసులో ‘మదర్స్ మేడ్’ అనే పేరుతో ఆర్గానిక్ స్వీట్లు తయారుచేస్తూ దేశ విదేశాల నుంచి ఆర్డర్లు పొందుతూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం నీలూ భండారీ స్వీట్లు అంటే మక్కువ చూపుతుంటారు. ఐదేళ్లుగా ఆమె చేస్తున్న స్వీట్ జర్నీ గురించి అంతే స్వీట్‌గా చెప్పుకోవచ్చు. స్వీట్లు తయారుచేసే సమయంలో నీలూ భండారీని చూస్తే ఆమె మోముపై ఓ మెరుపు ఉంటుంది. ఆమె పెదవులు దైవ నామం జపిస్తూ ఉంటాయి. స్వీట్ల ద్వారా ఎంతో మందికి చేరవయ్యే అవకాశం ఆ భగవంతుడే తనకు కల్పించాడని, ఆ విధంగా తాను దైవానికి దగ్గరవుతున్నాను అని ఆమె నమ్ముతారు. కమ్మని వాసనల వంటకాలు ‘పిల్లలు బేకరీలలో లభించే జంక్ ఫుడ్‌ని ఇష్టపడుతుంటారు. కానీ, ఆ ఆహారం వల్ల వారి శరీరం బోలుగా తయారవుతుంది. ఊబకాయం వంటి సాధారణ సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల ఏ వ్యాధి అయినా వారిని సులభంగా చుట్టుముంటే అవకాశం ఉంది. పిల్లల ముందు పాలు, జున్ను, దేశీ ఆవు నెయ్యి.. గురించి మాట్లాడితే వారు ముఖముఖాలు చూసుకుంటారు. అలాంటి పదార్థాల గురించి ఈ తరం వారికి తెలియనే తెలియవు. అదే మన చిన్ననాటి రోజుల్లో చలికాలంలో దాదాపు ప్రతి ఇంట్లో అవిసె గింజలు, నువ్వులు, శనగపిండితో చేసిన కమ్మని వంటకాల వాసన వస్తుండేది’ అని చెప్పే నీలూ భండారి ఐదేళ్లుగా తన చేత్తో తయారు చేసిన స్వీట్ల వ్యాపారాన్ని ఆమె వృత్తిగా చేసుకున్నారు. ఆ స్వీట్లకు మన దేశంలోనే కాదు విదేశాలలోనూ మంచి డిమాండ్ ఉంది. చక్కెర, నెయ్యి లేకుండా స్వీట్లు! చక్కెర లేని, నెయ్యి లేని స్వీట్లను నీలూ స్నేహితులు రుచి చూసి తమ కోసమూ వాటిని అడిగి మరీ చేయించుకునేవారు. దీంతో ఆమె ఎక్కువ మొత్తంలో అలాంటి స్వీట్లు తయారుచేసి వారి కోసం ప్రదర్శన ఏర్పాటు చేసేది. స్నేహితులు, బంధువులు ఆ ప్రదర్శనలో పాల్గోవడమే కాదు, ఆర్గానిక్ స్వీట్ల కోసం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. బయట నుంచి కూడా ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. డిమాండ్ పెరగడంతో ఆమె ‘మదర్స్ మేడ్’ అనే పేరుతో స్వీట్ల తయారీని పెంచింది. సెలబ్రిటీలకు చేరువ ఆమె చేతితో తయారు చేసిన శుభ్రమైన స్వీట్లు బాలీవుడ్ గాయని ఆశా భోంస్లే, జస్పిందర్ నరులా, కర్మవీర్ వోహ్రా, సుప్రియా, అబూ సూఫీ.. తదితరులు ఇష్టపడి మరీ ఆర్డర్ల మీద తెప్పించుకుంటారు. మన దేశంలోనే కాకుండా వర్జీనియా, ఫ్లోరిడా, కెనడా, ఆస్ట్రేలియా, పారిస్, జర్మనీ నుండి కూడా నీలూ భండారీ స్వీట్లను ఆర్డర్ల మీద తెప్పించుకుంటున్నారు. -
నాన్న అంటే ప్రేమ.. ధైర్యం
జూన్ 21.. ఫాదర్స్ డేని పురస్కరించుకుని పలువురు సినీ సెలబ్రిటీలు ‘హ్యాపీ ఫాదర్స్ డే’ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ తండ్రికి శుభాకాంక్షలు చెప్పారు. ఓ కొడుకుగా తమ తండ్రితో ఉన్న బంధాన్ని.. ఓ తండ్రిగా తమ పిల్లలతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. హీరో చిరంజీవి తన తండ్రి వెంకట్రావు, తనయుడు రామ్‌చరణ్ తేజ్ కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేసి, ‘చిరుత.. విత్ మై ఛార్మింగ్ డాడ్. మా నాన్న నవ్వు... నా బిడ్డ చిరునవ్వు... రెండూ నాకు చాలా ఇష్టం. హ్యాపీ ఫాదర్స్ డే’’ అంటూ ఓ సందేశం పోస్ట్ చేశారు. తండ్రి చిరంజీవితో చిన్నప్పుడు, ఇప్పుడు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన రామ్‌చరణ్ ‘కొన్ని బంధాల్ని వర్ణించాల్సిన అవసరం లేదు.. హ్యాపీ ఫాదర్స్ డే’ అని రాసుకొచ్చారు. తన తండ్రి చిరంజీవికి స్వయంగా హెయిర్ కట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి తండ్రి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు సుష్మిత. తమ తండ్రి మోహన్‌బాబుతో కలిసి ఉన్న ఫొటోల్ని లక్ష్మీ మంచు, విష్ణు, మనోజ్ షేర్ చేశారు. తండ్రి కృష్ణతో బాల్యంలో దిగిన ఫొటోను మహేశ్‌బాబు షేర్ చేసి, ‘నా తండ్రి గురించి నిర్వచించమని చెబితే నా బలం, ధైర్యం, ప్రేమ, స్ఫూర్తి నాన్నే. ఈరోజు నేనేంటో అవి ఆయన నుంచి వచ్చినదే. ఆయన నాతో ఎలా ఉండేవారో నేను నా పిల్లలతోనూ అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు నన్ను ముందుండి నడిపించే వ్యక్తివి. హ్యాపీ ఫాదర్స్ డే’ అని పేర్కొన్నారు. అలాగే తన పిల్లలు గౌతమ్, సితారలతో మహేశ్‌బాబు ఉన్న ఫొటోల్ని ఆయన శ్రీమతి నమ్రత షేర్ చేశారు. తన ఇద్దరు కొడుకులతో కలిసి ఉన్న ఫొటోల్ని గోపీచంద్ షేర్ చేసి, ‘ఓ తండ్రిగా ఉండటం మంచి అనుభూతి. నా పిల్లల్ని చూసిన ప్రతిసారీ నా జీవితం సంపూర్ణమైందని అనిపిస్తుంది. నా బలం వారే.. ఇందుకు వారికి థ్యాంక్స్’ అని పోస్ట్ చేశారు. హీరోలు విజయ్ దేవరకొండ, నాగశౌర్య, సుశాంత్, అల్లు శిరీష్, హీరోయిన్లు రాశీ ఖన్నా, రకుల్, కాజల్, అనుపమా పరమేశ్వరన్, శ్రుతీహాసన్, శ్రద్ధా కపూర్, సోనమ్ కపూర్‌తో పాటు మరికొందరు నటీనటులు తమ తండ్రితో కలిసి ఉన్న ఫొటోల్ని షేర్ చేశారు. వెంకట్రావు, రామ్‌చరణ్; మోహన్‌బాబు, విష్ణు మహేశ్‌బాబు, కృష్ణ; కుమారులతో గోపీచంద్ గోవర్ధన్‌రావు, విజయ్ దేవరకొండ; నాగశౌర్య, శంకర్ ప్రసాద్ నిషా, వినయ్ అగర్వాల్, కాజల్; రాజేందర్ సింగ్, రకుల్ -
నన్ను ఒక్కడూ పిలవలేదు : బాలకృష్ణ
ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌లు ప్రారంభించాలి? థియేటర్లు మళ్లీ ఎలా ఓపెన్ చేయాలి? అనే విషయాల గురించి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పలువురు సినీ ప్రముఖులు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి గురువారం నటుడు బాలకృష్ణ వద్ద మీడియా ప్రస్తావించగా, ‘‘ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి అంట. వార్తల ద్వారా, పత్రికల ద్వారా విషయం తెలుస్తోంది. అంచలంచెలుగా షూటింగ్స్‌కి అనుమతి ఇస్తారని తెలిసింది’’ అన్నారు. అనంతరం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ‘‘చాలా మీటింగులు జరిగాయి. నన్ను ఎవ్వరూ పిలవలేదు. ఎవరు పిలిచారు నన్ను? వీళ్లందరూ ఏమైనా భూములు పంచుకుంటున్నారా... శ్రీనివాస్ యాదవ్‌తో కూర్చుని. నన్ను ఒక్కడూ పిలవలేదు’’ అన్నారు బాలకృష్ణ. నోరు అదుపులో పెట్టుకోండి : నాగబాబు ఈ విషయంపై నటుడు నాగబాబు తన యూట్యూబ్ చానల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నాగబాబు మాట్లాడుతూ – ‘‘షూటింగ్స్ ఎలా ప్రారంభించాలని తలసాని శ్రీనివాస యాదవ్‌తో కలసి చిరంజీవిగారింట్లో నాగార్జునగారు, రాజమౌళిగారు, అరవింద్‌గారు, సురేశ్‌బాబుగారు, ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన నటులు, నిర్మాతలందరూ చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. చాలా తక్కువ మందినే పిలిచారు. ఆ మీటింగ్ నేపథ్యం ఏంటో సరిగ్గా తెలియదు. ఇవాళ బాలకృష్ణగారి కామెంట్స్ చూశాను. ఆయన్ను మీటింగ్‌కి పిలవకపోవడం తప్పా? ఒప్పా నాకు తెలియదు. పిలిచారా పిలవలేదా? అని ఈ మీటింగ్స్‌ని నిర్వహించినవాళ్లను అడగాల్సిన బాధ్యత బాలకృష్ణ మీద ఉంది. పిలవలేదని కోప్పడ్డారు. సరే.. కోప్పడ్డానికి రీజన్ ఉంది. కానీ ‘భూములు పంచుకుంటున్నారు’ అని నోరు జారారు. మిమ్మల్ని పిలవకపోవడం కరెక్ట్ అని నేను అనను. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అయ్యుంటుంది. వేరే కారణం అయ్యుండొచ్చు. ఆ కారణం తెలుసుకొని అడిగినా తప్పు లేదు. కానీ భూములు పంచుకుంటున్నారన్న మాట నిర్మాతగా, నటుడిగా నాకు బాధ కలిగించింది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతానంటే కరెక్ట్ కాదు. మీకంటే పదిరెట్లు ఎక్కువ మాట్లాడటానికి చాలా మంది ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి బాలకృష్ణగారూ. ఇండస్ట్రీ బాగు కోసం పని చేస్తున్నారు తప్ప, భూములు పంచుకోవడానికి ఎవ్వరూ వెళ్లలేదు. మమ్మల్ని కూడా చాలామంది పిలవలేదు. ఆ మాటలేంటి? ఇండస్ట్రీ మీద మీకున్న గౌరవం ఇదా? మీరు కేవలం ఇండస్ట్రీనే కాదు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమానించారు. ఇండస్ట్రీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పడం మీ బాధ్యత. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో ఆంధ్రప్రదేశ్‌కి వెళ్తే మీకు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఆంధ్రప్రదేశ్‌ని ఎలా నాశనం చేశారో, సామాన్యుల జీవితాలు ఎలా నాశనం అయ్యాయో మీ తెలుగు దేశం పార్టీని నమ్మినవాళ్లను అడిగితే తెలుస్తుంది. ఇండస్ట్రీకి మీరు కింగ్ కాదు. ఒక హీరో మాత్రమే. కంట్రోల్‌గా మాట్లాడటం నేర్చుకోండి’’ అన్నారు. మాలో విభేదాలు లేవు – నిర్మాత సి. కల్యాణ్ నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘మీటింగ్స్ అన్నీ నిర్మాతల తరఫునుంచి, స్టూడియోల సైడ్ నుంచి జరుగుతున్నాయి తప్పితే ఆర్టిస్టుల నుంచి కాదు. ఆర్టిస్టుల ఇబ్బందులు చెప్పడానికి ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఉంది. దాని నుంచి నరేశ్‌గారు, జీవితగారు హాజరయ్యారు. ఎవరితో ఏది చర్చించాలంటే ఇండస్ట్రీ వాళ్లను పిలుస్తుంది. ఇండస్ట్రీలో ఉండే ఎవరైనా ఇండస్ట్రీని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం అని ముందుకు వస్తే వాళ్ల వెనక ఉండటానికి మేం సిద్ధంగా ఉన్నాం. మధ్యాహ్నమే (గురువారం) బాలకృష్ణగారికి అన్నీ వివరించాను. ఆయన సంతృప్తిగానే ఉన్నారు. ఈ విషయం మీద ఇక చర్చలు ఉండవనుకుంటున్నాను. ఇక మీటింగ్స్ ఉండకపోవచ్చు. బాలకృష్ణగారు మా హీరో. ఆయన మనిషిగా నేను ఇందులో పాల్గొంటున్నట్టే లెక్క. మాకు ఇద్దరు ముఖ్యమంత్రులూ ముఖ్యం. అందరం ఒకటే. ఇక్కడ గ్రూపులు లేవు. దాసరిగారు ఉన్నప్పుడు అన్నీ ఆయన భుజాన వేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవిగారిని మేమే అడిగాం. నాగార్జునగారూ వచ్చారు. బాలకృష్ణగారు కూడా రెడీగా ఉన్నారు. ఎక్కడ ఎవరు అవసరమైతే వాళ్లను పిలుచుకుని వెళ్లడానికి మేం రెడీ. పని జరగడం ముఖ్యం. మేం ఏ పార్టీలకు సంబంధించిన వాళ్లం కాదు. బాలయ్యగారు వస్తానంటే ఎవరైనా వద్దంటారా? మాలో విభేదాలు లేవు. బాలయ్యను సొంత బ్రదర్‌లా భావిస్తాను’’ అన్నారు. -
దివికేగిన సినీ దిగ్గజాలు
2019లో సైరా నరసింహారెడ్డి, మహర్షి, ఓ బేబీ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో కళకళలాడిన టాలీవుడ్ వెండితెర... పలువురు సినీ దిగ్గజాలు కన్నుమూయడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. వారిలో తెలుగు పరిశ్రమలో గ్రాఫిక్స్ ట్రెండ్ సృష్టించిన కోడి రామకృష్ణ, తన ప్రతిభతో గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నతెలుగు దర్శకురాలు విజయనిర్మల, హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వేణుమాధవ్...ఇలా ఎందరో ప్రముఖులు కన్నుమూశారు. సినీ పరిశ్రమలో 2019 నింపిన విషాదాలను ఓసారి గుర్తుచేసుకుందాం. -కోడి రామకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో గ్రాఫిక్స్‌తో కొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు కోడి రామకృష్ణ. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆయన ఫిభ్రవరి 22న తుదిశ్వాస విడిచారు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో దర్శకునిగా ప్రస్థానం మొదలుపెట్టి ఎన్నో వందల సినిమాలకు దర్శకత్వం వహించారు. ఓ వైపు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కిస్తూనే మరోవైపు ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘అరుంధతి’ లాంటి గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే చిత్రాలు తీసి కోడి రామకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా కెరీర్ ఆరంభంలో కొన్ని చిత్రాల్లో నటించారు. చివరిగా కన్నడలో ‘నాగరహవు’ అనే చిత్రాన్ని తీసారు. -రాళ్లపల్లి విలక్షణ నటన, హాస్యంతో సినిమా తెరపై నాలుగు దశాబ్దాలకుపైగా అలరించిన విలక్షణ నటుడు రాళ్లపల్లి నరసింహారావు. రైల్వేలో ఉద్యోగం వచ్చినా..నటనపై ఉన్న ఆసక్తి ఆయన్ని సినిమారంగం వైపు నడిపించింది. తెలుగులో 1973లో వచ్చిన ‘స్త్రీ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. హాస్యనటుడిగా, క్యారెక్టర్ నటుడిగా, ప్రతినాయకుడిగా 850కిగా పైగా సినిమాల్లో నటించి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలపై తనదైన ముద్ర వేశారు. దాదాపు 8 వేల నాటకాల్లో నటించిన రాళ్లపల్లి.. చాలా నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణికి గురువు రాళ్లపల్లి. రంగస్థలమైనా, వెండితెర అయినా, టెలివిజన్ రంగం అయినా తన నటనతో ఆ పాత్రలకి ప్రాణం పోస్తారు. హాస్యానికి కొత్త మెరుగులు, విలనిజానికి వ్యంగాన్ని జోడించడం, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకు కొత్త విరుపులు, విచిత్రమైన చమత్కారాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. తన నటనతో, డైలాగులతో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న రాళ్లపల్లి మే 17న కన్నుమూశారు. -గిరీశ్ కర్నాడ్ భాషతో సంబంధం లేకుండా బహుభాషా నటుడిగా చిత్రపరిశ్రమల ప్రజలకు గుర్తుండిపోయే నటుడు గిరీశ్ కర్నాడ్. అనారోగ్యంతో జూన్ 10న కన్నుమూశారు. చారిత్రక, జానపద ఇతిహాసాలను సమకాలీన సామాజిక రాజకీయ అంశాలతో మిళితంచేస్తూ వైవిధ్యభరిత నాటకాలు రచించిన అపూర్వమైన కలం కర్నాడ్‌ది. దాదాపు ఐదు దశాబ్దాలపాటు నటుడిగా, దర్శకుడిగా, సామాజిక వేత్తగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్రవేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. 1998లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ 1974లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్ అవార్డులు ఆయన్ని వరించాయి. ఇవి కాకుండా ఏడు ఫిలింఫేర్ అవార్డులు, 10 జాతీయ అవార్డులు అందుకున్నారు. -విజయనిర్మల వెండితెరపై ‘విజయ’కేతనం ఎగురవేసిన తెలుగింటి వనిత విజయనిర్మల. చిన్నతనం నుంచే వెండితెర ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె ప్రయాణం ఎంతో సుధీర్ఘమైనది, ఘనమైనది కూడా. అత్యధిక సినిమాలు చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు. ‘సాక్షి’ సినిమాతో మెదటిసారి కృష్ణతో జతకట్టి 47 సినిమాల్లో కలిసి నటించారు మెప్పించారు. అలా కృష్ణ- విజయనిర్మల జోడీ హిట్ పెయిర్‌గా నిలిచింది. అతి సాధారణ కుటుంబం, అంతంత మాత్రం చదువు కలిగిన ఆమె.. జీవితాన్ని ఎంతో సమర్థంగా, విజయవంతంగా నడిపించారు. సినిమారంగంలో ఎందరో నటీమణులకు ఆమె ధైర్యం, మార్గదర్శి. జూన్ 27న ఈ లోకాన్ని వదిలివెళ్లినా..ప్రజల గుండెల్లో ఆమె ఎప్పటికీ ధీర ‘విజయ’గానే గుర్తుంటుంది. - దేవదాసు కనకాల ఎంతో మందికి నటనలో శిక్షననిచ్చి తీర్చిదిద్దిన నట శిక్షకుడు దేవదాస్ కనకాల. వందకి పైగా చిత్రాల్లో సహ నటుడిగా, ప్రతినాయకుడిగా, హస్యనటుడిగా నటించారు. రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, సహాసిని లింటి అప్పటితరం నటులనే కాకుండా శివాజీరాజా, సూర్య, రామ్‌చరణ్, మంచుమనోజ్, అల్లరి నరేష్ లాంటి ఈతరం నటుల వరకు ఎంతోమంది దేవదాస్ దగ్గరే శిష్యరికం చేసినవాళ్లే. సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించడంతోపాటు.. దర్శకత్వం కూడా వహించారు. హైదరాబాద్‌లో యాక్టింగ్ స్కూల్ స్థాపించి ఎంతో మందికి నటనలో మెళకువలు నేర్పించి తీర్చిదిద్దిన దేవదాస్ కనకాల ఆగస్టు 2న కన్నుమూశారు. -వేణుమాధవ్ హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వేణుమాధవ్..అనారోగ్యంతో సెప్టెంబర్ 25న కన్నుమూశారు. ఏ పాత్ర చేసినా అందులో లీనమై తానో నవ్వుల వేణువై ఎన్నో కితకితలు పెట్టేవారు. కానీ 39 ఏళ్ల వయస్సులోనే ఆయన నవ్వుల ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయింది. మిమిక్రీ ఆర్టిస్టు నుంచి కథానాయకుడి మారి నవ్వుల రాజుగా అందరి మనసులు చూరగొన్నారు వేణుమాధవ్. ‘సంప్రదాయం’ సినిమాతో నటుడిగా మొదటిసారి వెండితెరకు పరిచయమై దాదాపు 600 సినిమాల్లో నటించారు. వేణుమాధవ్‌కి నటుడిగా అవకాశం ఇచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్వకత్వంలోనే ‘హంగామా’ సినిమాలో హీరోగా నటించారు. ఎన్నో చిత్రాల్లో పేరడీ సన్నివేశాలతో వినోదం పంచి..ఆయన మరణంతో అందర్నీ ఏడిపించారు. -గీతాంజలి ప్రముఖ నటి గీతాంజలి అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు. 14 ఏళ్ల ప్రాయంలోనే సీతారామ కళ్యాణం సినిమాతో తెరంగేట్రం చేసి వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యారు. ‘మణి’ పేరుతో పరిచయమైన ఆమె.. గీతాంజలిగా కథానాయుకగా, చెల్లిలిగా, డాన్స్ టీచర్‌గా ఇలా ఎన్నో పాత్రలు పోషించారు. వివాహం అనంతరం సినిమాలకి దూరం అయిన గీతాంజలి.. పెళ్లైన కొత్తలో సినిమాతో బామ్మగా రీ ఎంట్రీ ఇచ్చారు. 72 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో కన్నుమూశారు. -గొల్లపూడి మారుతీరావు నటుడు, రచయిత, సంపాదకుడు, వ్యాఖ్యాత, బహుముఖ ప్రఙ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు క్యాన్సర్‌తో బాధపడుతూ డిసెంబర్ 12న కన్నుమూశారు. మధ్యతరగతి తండ్రి పాత్రలతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు. తెలుగు తెరపై కొత్త తరహా విలనిజాన్ని ఆవిష్కరించిన ఘనత ఆయనది. 290 చిత్రాల్లో నటించిన ఆయన.. ఆరు నంది పురస్కారాలను అందుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే ‘ఆశాజీవి’ అనే కథను రాశారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు పలు వర్సిటీల్లో పాఠ్యాంశాలయ్యాయి. చేసింది చాలు అని ఏనాడు అనుకోకుండా చేయాల్సింది చాలా ఉంది అనే ఆయన తత్వం ఎందరికో ఆదర్శం. గొల్లపూడి మారుతీరావు అనే నూరు కెరటాల హోరు ఇక మీదట కనపడకపోవచ్చు, కానీ ఆయన వదిలి వెళ్లిన గుర్తులు ఎప్పటికీ చెరిగిపోవు, చెదిరిపోవు. -
ఇదేం గ‘మ్మత్తు’ విచారణ
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు... కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు, జాతీయ మీడియాలోనూ తీవ్ర చర్చకు తెరలేపిన అంశం ఇది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న సినీతారలు, ఇతర సెలబ్రిటీలు అందరికీ ఇపుడు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్చిట్ ఇచ్చిందన్న వార్త మరోసారి కలకలం రేపుతోంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఈ కేసు దర్యాప్తు గురించి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారికంగా అందజేసింది. ఈ వివరాల్లో పేర్కొన్న దాని ప్రకారం.. డ్రగ్స్ వ్యవహారంలో 12 కేసులు నమోదు చేసి విచారణ జరిపిన తర్వాత మొత్తం 4 చార్జిషీట్లను ఇప్పటివరకు దాఖలు చేశారు. అయితే, వారిచ్చిన వివరాల్లో ఎక్కడా తెలుగు సినీ రంగానికి చెందిన నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, ఇతర ప్రముఖుల పేర్లను ప్రస్తావించలేదు. దీంతో ఈ కేసులో వారందరికీ ఉపశమనం లభించినట్టేననే చర్చ జరుగుతోంది. అయితే, ఈ కేసు దర్యాప్తు తీరు సరిగా లేదని వివరాలు సేకరించిన పద్మనాభరెడ్డి తప్పుపడుతున్నారు. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని కేసు నుంచి ఎలా తప్పిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు విచారణను సిట్ నుంచి తప్పించి ఏసీబీ లేదా విజిలెన్స్ ద్వారా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. చార్జిషీట్లలో ఏముందంటే..? ఈ కేసులో పద్మనాభరెడ్డికి ఎక్సైజ్ శాఖ ఇచ్చిన చార్జిషీట్ (క్రైం నంబర్ 113/2017)లో మొదటిది 2017, జూలై 24న ఎక్సైజ్ అధికారులు శంషాబాద్ కోర్టుకు సమర్పించింది. ఇందులో మణికొండలోని పంచవటి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటూ తెలుగు ఇండస్ట్రీలో మేనేజర్‌గా పనిచేస్తున్న పుట్టకర్ రాన్సన్ జోసెఫ్ ప్లాట్‌పై దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో గంజాయి, హుక్కా తదితర నిషేధిత మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై సెక్షన్ 8(సి) ఎన్డీపీఎస్ యాక్ట్ 1985, 20 (బి)(2)(ఏ), ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం కేసులు నమోదు చేశారు. రెండో చార్జీషీటు (క్రై. నం.119/2017) 2017, ఆగస్టు ఒకటిన శంషాబాద్ కోర్టుకు సమర్పించింది. ఇందులో రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో అలెక్స్ విక్టర్ అనే దక్షిణాఫ్రికా దేశస్తుడి వద్ద 10 గ్రాముల కొకైన్ ప్యాకెట్లు లభించాయి. ఇతనిపై సెక్షన్ 8 (సి) ఎన్డీపీఎస్ యాక్ట్ 1985, 21 (బి), ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం కేసులు నమోదు చేశారు.ఇదిలా ఉండగా, దీనిపై స్పందించిన ఎౖMð్సజ్ అధికారులు మాత్రం ‘డ్రగ్స్’కేసును తామింకా క్లోజ్ చేయలేదని, దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. డ్రగ్స్ రాకెట్‌కు సినీ పరిశ్రమతో కలకలం.. నగరంలోని పలు కార్పొరేట్ స్కూళ్ల చిన్నారులకు డ్రగ్స్ (ఎల్ఎస్డీ) విక్రయాలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులను కూలంకషంగా దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు 62 మంది సినీరంగంతో సంబంధమున్న ప్రముఖులను విచారణకు పిలిచారు. ఇది మీడియాలో పెద్ద దుమారాన్నే లేపింది. పలువురు సెలబ్రిటీలు తాము ఎలాంటి తప్పు చేయలేదని విచారణకు వచ్చిన సమయంలో వివరణ ఇచ్చుకున్నారు. ఆ సందర్భంగా పలువురు నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల నుంచి వెంట్రుకలు, గోళ్ల నమూనాలు తీసుకున్నారు. వీరిలో పలువురిని అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరగడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. తరువాత ఎక్సైజ్ నుంచి అకున్ సబర్వాల్ బదిలీ కావడం, ఈ సిట్‌కు ఇపుడు వేరే అధికారులు నేతృత్వం వహించడంతో కేసు నీరుగారిపోయిందని, సిట్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని పద్మనాభరెడ్డి ఆరోపిస్తున్నారు. 62 మందికి నోటీసులు జారీ చేసి ఇపుడు వారి పేర్లను 4 చార్జిషీట్లలో ఎక్కడా ప్రస్తావించకపోవడాన్నే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. అంటే పరోక్షంగా ఎక్సైజ్‌శాఖ వారికి క్లీన్చిట్ ఇచ్చిందని విమర్శించారు. వెంటనే కేసును ఏసీబీ, లేదా విజిలెన్స్ లాంటి దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. -
తృణమూల్‌కు సినీ గ్లామర్
కోల్‌కతా: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఐదుగురు సినీ ప్రముఖులకు చోటు కల్పించారు. 2011లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ సినీ ఆర్టిస్టులకు ప్రాధాన్యమిస్తోంది. తాజాగా అదే ఒరవడి కొనసాగిస్తూ మంగళవారం విడుదల చేసిన జాబితాలో నటీమణులు నుస్రాత్ జహాన్(బసీరాత్), మిమి చక్రవర్తి(జాదవ్‌పూర్), శతాబ్ది రాయ్(బిర్భూమ్), మూన్‌మూన్ సేన్(అసాన్సోల్), నటుడు దేవ్(ఘటల్)లకు టికెట్లు ఇచ్చారు. మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం మమతా బెనర్జీ 10 మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్ ఇవ్వలేదు. 18 మంది కొత్త ముఖాలకు చోటు కల్పించారు. 17 మంది మహిళల(41 శాతం)కు సీట్లు కేటాయించారు. ముగ్గురు తృణమూల్ నాయకులు బీజేపీ గూటికి.. టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ అనుపమ్ హజ్రాతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో హజ్రా బోల్పూర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గతంలో బహిష్కరించారు. -
అభిమాన లోకం.. కన్నీటి శోకం
-
అభిమాన లోకం.. కన్నీటి శోకం
సినీలోకం మూగబోయింది. అభిమానం అశ్రుధారలైంది. గుండెగొంతులో గూడు కట్టుకున్న దుఃఖం కట్టలు తెగింది. ముంబై దారులన్నీ కన్నీటి వరదలయ్యాయి! లక్షలాది అభిమానులు వెంటరాగా దేవకన్య శ్రీదేవి దివికేగింది. బుధవారం సాయంత్రం ముంబై విలేపార్లేలోని శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీదేవి అంత్యక్రియలు పూర్తయ్యాయి. భర్త బోనీకపూర్ చితికి నిప్పంటించారు. సాక్షి, ముంబై: సినీలోకం మూగబోయింది. అభిమానం అశ్రుధారలైంది. గుండెగొంతులో గూడు కట్టుకున్న దుఃఖం కట్టలు తెగింది. ముంబై దారులన్నీ కన్నీటి వరదలయ్యాయి! లక్షలాది అభిమానులు వెంటరాగా దేవకన్య శ్రీదేవి దివికేగింది. బుధవారం సాయంత్రం ముంబై విలేపార్లేలోని శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీదేవి(54) అంత్యక్రియలు పూర్తయ్యాయి. భర్త బోనీకపూర్ చితికి నిప్పంటించారు. ఆ సమయంలో ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషిలు తండ్రి పక్కనే ఉన్నారు. అంతకుముందు సెలబ్రేషన్స్ క్లబ్ నుంచి తెల్లని పూలతో అలంకరించిన వాహనంపై శ్రీదేవి పార్థివదేహాన్ని శ్మశానానికి తీసుకొచ్చారు. ఆమెను కడసారి చూసేందుకు దారిపొడగునా అభిమానులు బారులుతీరారు. విలేపార్లే శ్మశానవాటికకు కుటుంబీకులు, సన్నిహితులు, పలువురు సినీతారలు మాత్రమే హాజరయ్యారు. అభిమానుల తాకిడి ఎక్కువకావటంతో షారుక్‌ఖాన్, సోనమ్ కపూర్ తదితరులు తమ వాహనాన్ని దూరంగా నిలిపేసి నడుస్తూ శ్మశాన వాటికకు చేరుకున్నారు. ఆ దారి.. అభిమాన సంద్రం అంతిమయాత్ర అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి ఈ యాత్ర మొదలైంది. త్రివర్ణ పతాకం కప్పిన శ్రీదేవి భౌతికకాయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వాహనం ముందు, వెనుక శ్రీదేవి ఫొటోలను ఉంచారు. భర్త బోనీకపూర్, ఇద్దరు పిల్లలు, ఇంకొందరు కపూర్ కుటుంబీకులు భౌతికకాయంతో వాహనంలో ఉండగా.. మిగిలిన వారంతా కార్లలో శ్మశానవాటికకు చేరుకున్నారు. శ్రీదేవిని చివరిసారి చూసేందుకు అభిమానులు రోడ్డుకు ఇరువైపులా పెద్దఎత్తున బారులు తీరడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రారంభమైన అంతిమ యాత్ర సాయం త్రం 4 గంటలకు శ్మశానవాటికకు చేరుకుంది. ఉదయమే క్లబ్ వద్ద అభిమాను లను అదుపు చేసేందుకు 200 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్విగ్న క్షణాలు.. సెలబ్రేషన్ క్లబ్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. హాల్ మధ్యలో పూలతో అలంకరించిన టేబుల్‌పై శ్రీదేవి పార్థివదేహాన్ని ఉంచారు. ఓవైపు వీఐపీల కోసం మరోవైపు అభిమానుల కోసం బారికేడ్లు కట్టారు. బాక్స్‌కు ముందు ఓ ఫొటో పెట్టి దాని ముందు దీపం ఉంచారు. గదిలో ఓ మూల నిలబడ్డ బోనీ కపూర్‌ను, జాహ్నవి, ఖుషిలను సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఓదార్చారు. బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా బోరున విలపించటంతో.. పక్కనే ఉన్న కరణ్ జోహార్ ఆయన్ను ఓదార్చారు. రాణీ ముఖర్జీ చాలాసేపు భౌతికకాయం వద్దే కూర్చున్నారు. రోదిస్తున్న సోనమ్ కపూర్‌ను ఓదార్చారు. సినీ ప్రముఖులంతా ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకుంటూ.. బోనీ, పిల్లలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ‘శ్రీదేవిని కడసారి చూసొచ్చాను. సినీ పరిశ్రమ అంతా మౌనంగా రోదిస్తోంది. అదే శ్రీదేవి గొప్పదనం. అందమైన ఎర్రని చీరలో ప్రశాంతంగా ఆమె పడుకుని ఉంది’అని హేమమాలిని ట్వీట్ చేశారు. అభిమానుల నిరాశ ఉదయం నుంచే క్లబ్ ముందు పెద్దసంఖ్యలో అభిమానులు వేచి ఉన్నా.. 10 గంటల సమయంలో వీరిని లోపలకు అనుమతించారు. అయితే భారీగా తరలిరావడంతో కొంద రికే ఆఖరిచూపు దక్కింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి అభిమానులు చివరి చూపు కోసం వచ్చారు. వీఐపీలు వచ్చినపుడల్లా అభిమానుల క్యూను ఆపేశారు. దీంతో చాలా మందికి లోపలకు వెళ్లే అవకాశం రాలేదు. శ్రీదేవి అంతిమయాత్ర వాహనాన్ని కూడా మూడువైపుల నుంచి మూసేశారు. ఆమెను చివరిసారిగా చూసేందుకు అభిమానులు చెట్లు ఎక్కారు. పక్కనున్న భవంతులపైకి చేరారు. ఫుట్‌ఓవర్‌పై నిలుచుని మరీ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బాక్సులో పెట్టడం, పువ్వులతో పెట్టను, వాహనాన్ని కప్పడంతో వారికి ఆమె ముఖం కనిపించలేదు. ఎక్కడ్నుంచో వచ్చినా చివరిచూపు దక్కలేదని వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. దిగివచ్చిన తారాలోకం.. శ్రీదేవికి చివరి వీడ్కోలు పలికేందుకు తారాలోకం దిగివచ్చింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ సినీరంగాలకు చెందిన ప్రముఖులు తరలి వచ్చారు. అమితాబ్ బచ్చన్, షారుక్‌ఖాన్, చిరంజీవి, రజనీకాంత్, కమల్‌హాసన్, నాగార్జున, వెంకటేశ్, సంజయ్ కపూర్, హేమామాలిని, రేఖ, జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్, నగ్మా, సారికా, దీపికా పదుకొనే, రాకేశ్ రోషన్, సంజయ్‌ఖాన్, సురేశ్ ఒబెరాయ్, వివేక్ ఒబెరాయ్, షబానా ఆజ్మీ, జావేద్ అఖ్తర్, అనుపమ్ ఖేర్, సుస్మితా సేన్, సోనంకపూర్, కాజోల్, అజయ్ దేవగన్, టబూ, జయప్రద, సంజయ్‌ఖాన్, అక్షయ్ ఖన్నాతో పాటు పలు పార్టీల ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లున్నారు భారత అధికారులు శ్రీదేవి పాస్‌పోర్టును రద్దుచేసి ఇతర దస్తావేజులను సిద్ధం చేస్తుండగానే.. పోలీస్ క్లియరెన్స్ కావాలంటూ జర్నలిస్టులు, అధికారులు, పలువురు స్థానిక భారతీయులు అశ్రఫ్‌కు ఫోన్ చేశారు. క్లియరెన్స్ తెచ్చిన తర్వాత దుబాయ్ సమీపంలోని ప్రభుత్వ మార్చురీకి చేరుకుని ఎంబామింగ్ ప్రక్రియ త్వరగా జరిగేలా చొరవ తీసుకున్నారు. అక్కడ అధికారులు శ్రీదేవితోపాటు మరో ముగ్గురి ఎంబామింగ్‌కు సంబంధించిన పత్రాలను అశ్రఫ్‌కు అందించారు. ఎంబామింగ్ సర్టిఫికెట్ అశ్రఫ్ పేరుతోనే జారీ కావడం గమనార్హం. అక్కడినుంచి మృతదేహాన్ని ఎయిర్‌పోర్టుకు తరలించి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకొచ్చారు. ఇదంతా పూర్తయ్యాక అశ్రఫ్ తన ఇంటికెళ్లాడు. ‘‘పెద్దల ఆశీర్వాదంతోనే ఈ పనిచేస్తున్నా. విదేశీయులు ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని తరలించేందుకు ఏమేం చేయాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారందరికీ నేను సాయం చేస్తా’ అని అశ్రఫ్ పేర్కొన్నారు. ‘‘శ్రీదేవి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లే ఉన్నారు. నిద్రపోతున్న అందాల రాణిలా..’’అని ఆయన తెలిపారు. సినిమాల్లో ఉన్నట్లుగానే ఆమె కనిపించారని.. ముఖంపై ఎలాంటి గాయాలూ లేవని వెల్లడించారు. ఎర్రని చీర.. నుదుట తిలకం.. మంగళ వారం రాత్రంతా శ్రీదేవి నివాసం గ్రీన్ఏకర్స్లోనే ఉన్న శ్రీదేవి భౌతికకాయాన్ని.. బుధవారం ఉదయం 9 గంటలకు సెలబ్రేషన్ క్లబ్‌కు తరలించారు. శ్రీదేవికి ఇష్టమైన ఎరుపురంగు కాంచీవరం చీరతో మృతదేహాన్ని చుట్టారు. సెల బ్రేషన్ క్లబ్లో బోనీ, జాహ్నవి, ఖుషి, అనిల్ కపూర్, సంజయ్‌కపూర్, మేన ల్లుడు హర్షవర్ధన్ కపూర్, కోడలు సోనమ్, రేఖ కపూర్లు భౌతికకాయం వద్ద ఉన్నారు. ఇక్కడ సినీరంగ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిం చిన తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవికి నివాళులర్పించారు. పార్థివ దేహంపై త్రివర్ణ పతాకం కప్పిన అనంతరం గన్ సెల్యూట్ చేశారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత అంతిమయాత్ర ప్రారంభమైంది. -
నేరం చేసినోళ్లే సిగ్గుపడాలి..!
‘‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. సినిమాల్లోనూ అంతేనట! నా సంగతికొస్తే... చిత్ర పరిశ్రమలో నాకు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉన్నారు. నేను చేయని తప్పుకు (శత్రువులకు) ఎప్పుడూ క్షమాపణలు చెప్పను. రాజీపడి పదేపదే క్షమాపణలు చెప్పే బదులు... అహంకారిగా ముద్ర వేయించుకోడమే నాకిష్టం’’ అన్నారు నటి భావన. గత ఫిబ్రవరిలో కారులో కొందరు ఆమెను లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సదురు ఘటన వెనుక ఏదో కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేశారు భావన. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘ఓ చోటు నుంచి మరో చోటుకి కారులో తీసుకువెళ్లే డ్రైవర్‌కి ఇలా చేసే దమ్ముంటుందా? ఎలా చేయగలడు? అసలు ఎవరు ఇదంతా చేయించారు? ఎందుకు చేయించారు? ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు.ఈ ఘటన వెనుక నా శత్రువుల హస్తం ఉందని చెప్పడం లేదు. కానీ, కేవలం డబ్బు కోసమే నన్ను వేధించారా? అనే కోణంలోంచి ఆలోచించినా లింక్స్ కనెక్ట్ కావడం లేదు. పలు ప్రశ్నలకు నాకు సమాధానాలు కావాలి. నేను గెలిచే వరకూ పోరాడతా’’ అన్నారు. ఈ అంశంలో పలువురు సినీ ప్రముఖులు భావనకు మద్దతుగా నిలిచారు. పోలీసుల దగ్గరకు ధైర్యంగా వెళ్లి, ఘటనపై భావన ఫిర్యాదు చేసిన తీరును అభినందించారు. దీనిపై భావన మాట్లాడుతూ – ‘‘నాకే కాదు... ఎవరికైనా ఇలా జరగొచ్చు. నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడితే... ఇతరులూ మాట్లాడతారు. ఇలాంటి ఇష్యూలను బయటపెట్టడానికి భయపడి తప్పు చేసినోళ్లకు తప్పించుకునే ఛాన్స్ ఎందుకివ్వాలి? నేరం చేసినోళ్లే సిగ్గు పడాలి. మహిళలు కాదు. నేను ఈ ఘటనపై మౌనం వహించి ఉంటే, నా అత్యంత సన్నిహితులు ఓ ఐదు లేదా పది మందికి తెలిసేది. కానీ, నలుగురిలో ఘటన గురించి మాట్లాడలేదనే అపరాధ భావంతో తల ఎత్తుకోలేక పోయేదాన్ని. తప్పు చేశాననే బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చేది. అందుకే, కంప్లయింట్ చేశా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను’’ అన్నారు. -
డైరెక్టర్ క్రిష్-రమ్యల పెళ్లిసందడి
-
‘పైరసీ’ సైట్లను బ్లాక్ చేస్తాం
♦ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల అంగీకారం ♦ ప్రభుత్వం ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి ♦ అవసరమైతే కేంద్రానికీ లేఖ: కేటీఆర్ ♦ సినీ ప్రముఖులు, నెట్ ప్రొవైడర్లతో సమీక్ష సమావేశం సాక్షి, హైదరాబాద్: పైరసీ బారి నుంచి సినిమా పరిశ్రమను కాపాడేందుకు తెలంగాణ ఐటీ శాఖ పలు చర్యలకు శ్రీకారం చుట్టింది. తెలుగు సినిమా పరిశ్రమ, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, ప్రభుత్వ శాఖల అధికారులతో బుధవారం సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పైరసీకి పాల్పడుతున్న వెయ్యి వెబ్సైట్లను బ్లాక్ చేయాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్లను సినీ ప్రముఖులు ఈ సందర్భంగా కోరారు. ప్రతి సినిమాకు కోర్టుల నుంచి ఆదేశాలు తీసుకుని, పైరసీ సైట్లను ఆపేయాలని కోరడం తమకు కష్టంగా మారిందన్నారు. సర్వీసు ప్రొవైడర్లు స్పందిస్తూ, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు తాము మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. పైరసీని అరికట్టేందుకు సహకరిస్తామని ముక్త కంఠంతో చెప్పారు. పైరసీకి పాల్పడుతున్న వెబ్సైట్లను బ్లాక్ చేసేందుకు అంగీకరించారు. అయితే అందుకు అనుగుణంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పైరసీని అడ్డుకునే చర్యల్లో భాగంగా అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తామని కేటీఆర్ తెలిపారు. ‘‘ఇది తెలుగుకే పరిమితం కాదు. సినీ పరిశ్రమంతా ఎదుర్కొంటున్న సమస్య. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న సినీ రంగానికి, దానిపై ఆధారపడ్డ వర్గాల భవిష్యత్తుకు పైరసీతో ఎంతో నష్టం. అందుకే దీనికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలూ చేపడతాం’’ అని ఆయన ప్రకటించారు. పైరసీకి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, సినిమాకు ముందు ప్రత్యేక ప్రకటన ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. దేశంలోనే రెండో అతి పెద్ద సినీ పరిశ్రమ తెలుగేనని, పైరసీతో వందల కోట్ల నష్టం జరుగుతోందని సినీ పరిశ్రమ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. యూరప్ దేశాల్లో అమలు చేస్తున్న యాంటీ పైరసీ విధానాలను ఆయన దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, పలువురు సినీ నిర్మాతలు, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
ఏడిద నాగేశ్వరావుకి ప్రముఖుల నివాళి
-
వారంతా చిరంజీవులే!
గత సంవత్సర కాలంగా సినీ ప్రముఖులు అనేక మంది ఎన్నడు లేని విధంగా వరుసగా అసువులు బాయడం బాధాకరమైన విషయం. చిత్రపరిశ్రమ దిగ్ధంతులు ఒక్కొక్కరు అర్ధాంతరంగా, సహజంగా, అసహజంగా తెరమరుగవుతున్నారు. దీంతో సినీ అభిమానులు తమ ఆప్తులను కోల్పోయినట్లు విచారంలో మునుగుతున్నారు. మహా నటీనటులు అంజలిదేవి, అక్కినేని నాగేశ్వరరావు, దర్శకులు, రచయిత వి.బి.రాజేంద్రప్రసాద్, బాపు, బాలచందర్, గణేశ్ పాత్రో, యువ కథానాయకుడు ఉదయ్‌కిరణ్, క్యారెక్టర్ యాక్టర్ పి.జె.శర్మ, శ్రీహరి, ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల, సంగీత దర్శకుడు, గాయకుడు చక్రి, ప్రేక్షకులను తమ హాస్య సంభాషణ, నటనలతో ఉర్రూతలూగించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎం.ఎస్.నారాయణ లాంటి తమకు తామే సాటైన హాస్యనటులు ఈ భూప్రపంచం నుండి, సినిమాలోకం నుండి జారిపోవడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో మన కళాకారులందరికీ ఒక విన్నపం. వారు ఆరోగ్యాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ జన్మలన్నీ అపురూపమైనవి. ఆ జిలుగుల ప్రపంచంలో ఈ విషయాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. ఇకనైనా నటీనటులు ఆరోగ్యం కోసం జాగ్రత్త పడాలి. భౌతికంగా కనిపించకపోయినా వారు తీసిన సినిమాలు, చూపిన ప్రతిభ, అందించిన సంగీతం, నేడు మనకు కనిపించకపోయినా ఆయా చిత్రాలలో లీనమై చేసిన పాత్రలు ఎన్నటికీ జీవించే ఉంటాయి. ఎన్ని తరాలు గడిచినా కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. ఆ రకంగా వారు ఎప్పుడూ చిరంజీవులే. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. - జి.వి. రత్నాకర్‌రావు వరంగల్