మా నాన్న సూపర్‌ హీరో! | Sudheer Babus next titled Maa Nanna Superhero | Sakshi
Sakshi News home page

మా నాన్న సూపర్‌ హీరో!

Published Mon, Jun 19 2023 6:32 AM | Last Updated on Mon, Jun 19 2023 6:32 AM

Sudheer Babus next titled Maa Nanna Superhero - Sakshi

‘మా నాన్న సూపర్‌హీరో’ అంటున్నారు సుధీర్‌ బాబు. ‘లూజర్‌’ వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రానికి ‘మా నాన్న సూపర్‌ హీరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీలో ఆర్నా హీరోయిన్‌. సీఏఎం ఎంటర్‌టైన్ మెంట్‌తో కలిసి వి సెల్యులాయిడ్స్‌ బ్యానర్‌పై సునీల్‌ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆదివారం (జూన్  18) ఫాదర్స్‌ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్‌. ‘‘తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసేలా ‘మా నాన్న సూపర్‌ హీరో’ ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రంలో రాజు సుందరం ఓ కీలక పాత్రలో నటిస్తూనే, కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయిచంద్, సాయాజీ షిండే, శశాంక్, ఆమని, హర్షిత్‌ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జై క్రిష్, కెమెరా: సమీర్‌ కల్యాణి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement