
ఇవ్వాళ ఫాదర్స్‌డే. నాన్నకు... ప్రేమతో మనమేం ఇవ్వగలం? అసలు నాన్నకు ఇవ్వడానికి మన దగ్గర ఏముంది? ఆయన మన నుంచి ఇష్టంగా కోరుకునేది ఏదైనా ఉంటుందా? ఆయనైతే మనకు ధైర్యాన్నిచ్చాడు. అండగా నిలబడ్డాడు. ఒక దారి చూపించాడు. అన్నింటికీ మించి ‘నాన్న’ అనే బంధం పిల్లలకిచ్చే అన్ని సౌకర్యాలను, ఆనందాలను ఇచ్చాడు. అలాంటి నాన్నను ప్రేమగా పలకరించడానికి ఒక్క రోజు చాలుతుందా? చాలదు కదూ! కానీ ఆయన మనకు చేసినవన్నీ ఇవ్వాళ గుర్తు చేసుకుంటే ? ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని నాన్న పాటలు.. ఆయనకు మనమీదున్న ప్రేమను ఇలా చూపిస్తున్నాయి.. పాడుకోండి!