బచ్చన్‌ ఫ్యామిలీ ఫోటోలకు అభిమానులు ఫిదా | Abhishek Bachchan And Aishwarya Rai Post Their Fathers Day Wishes | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 18 2018 2:59 PM | Last Updated on Mon, Jun 18 2018 3:25 PM

Abhishek Bachchan And Aishwarya Rai Post Their Fathers Day Wishes - Sakshi

కూతురు ఆరాధ్యతో అభిషేక్‌ - ఐశ్వర్య దంపతులు (పాతఫొటో)

నిన్న ప్రపంచమంతా ‘ఫాదర్స్‌ డే’ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రముఖ క్రీడాకారుల, బాలీవుడ్‌ హీరోలు తమ తండ్రితో వారికున్న అనుబంధాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. బాలీవుడ్‌ తొలి తరం సినీ కుటుంబానికి చెందిన అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య కూడా తమ తండ్రితో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్‌ చేసారు.

ఐశ్వర్య తన తల్లి బ్రిందా, కూతురు ఆరాధ్యతో పాటు తన తండ్రి క్రిష్ణరాజ్‌ చిత్రపటంతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేశారు. ఎందుకంటే ఐశ్వర్య తండ్రి క్రిష్ణరాజ్‌ గతేడాది మార్చిలో మరణించారు. ​అందుకే ఐశ్వర్య తన కుటుంబంతో పాటు తండ్రి చిత్ర పటాన్ని పట్టుకుని ఉన్న ఫోటోను షేర్‌ చేశారు. ఇవే కాక తన చెల్లెల్లు, కూతురు ఆరాధ్యతో కలిసి ఉన్న ఫ్యామిలి ఫోటోలను కూడా పెట్టారు.

💖

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

✨💖SISTERSUNDAY😘🌈

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ఇక అభిషేక్‌ తన చిన్నతనంలో తండ్రి అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి ఉన్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోను షేర్‌ చేసాడు. అంతేకాక ఫోటోతో పాటు ‘ఎలా జీవించాలి అనే విషయంలో నాకు ఉదాహరణగా ఉంటూ, నా చేయి పట్టుకుని నిరంతరం నన్ను నడిపిస్తూ...ప్రేమను పంచే నాన్నకు ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు’ అనే సందేశాన్ని కూడా జత చేశాడు. అలానే కూతురు ఆరాధ్యతో ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ ‘నన్ను తండ్రిని చేసిన నా ఏంజిల్‌కు ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు’ అనే సందేశాన్ని జత చేసాడు. ఈ ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అభిషేక్‌ అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో వస్తున్న ‘మన్‌మార్జియాన్‌’ చిత్రంలో నటిస్తుండగా ఐశ్వర్య ఓం ప్రకాశ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘ఫన్నే ఖాన్‌’ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement