నాన్నకు ప్రేమతో....  | Today world fathers day | Sakshi
Sakshi News home page

నాన్నకు ప్రేమతో.... 

Published Sun, Jun 17 2018 12:12 AM | Last Updated on Sun, Jun 17 2018 12:12 AM

Today world fathers day - Sakshi

ఇవ్వాళ ఫాదర్స్‌డే. నాన్నకు... ప్రేమతో మనమేం ఇవ్వగలం? అసలు నాన్నకు ఇవ్వడానికి మన దగ్గర ఏముంది? ఆయన మన నుంచి ఇష్టంగా కోరుకునేది ఏదైనా ఉంటుందా? ఆయనైతే మనకు ధైర్యాన్నిచ్చాడు. అండగా నిలబడ్డాడు. ఒక దారి చూపించాడు. అన్నింటికీ మించి ‘నాన్న’ అనే బంధం పిల్లలకిచ్చే అన్ని సౌకర్యాలను, ఆనందాలను ఇచ్చాడు. అలాంటి నాన్నను ప్రేమగా పలకరించడానికి ఒక్క రోజు చాలుతుందా? చాలదు కదూ!  కానీ ఆయన మనకు చేసినవన్నీ ఇవ్వాళ గుర్తు చేసుకుంటే ? 2000 –2018 మధ్య కాలంలో వచ్చిన కొన్ని నాన్న పాటలు.. ఆయనకు మనమీదున్న ప్రేమను ఇలా చూపిస్తున్నాయి.. పాడుకోండి! 

గుమ్మాడీ గుమ్మాడీ..
చిత్రం: డాడీ
సంగీతం: ఎస్‌.ఎ. రాజ్‌కుమార్‌
గానం: హరిహరన్‌
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గుమ్మాడీ గుమ్మాడీ ఆడిందంటే అమ్మాడీ / డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి / చిందాడీ చిందాడీ తుళ్లిందంటే చిన్నారి / మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి / వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి / ముదై్దనా తినదే పరిగెత్తే పైడిలేడి / చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి / పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి / గుమ్మాడీ గుమ్మాడీ ఆడిందంటే అమ్మాడీ / డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడిఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో (2) / నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో / నా తల్లివి నువ్వో.. నీ తండ్రిని నేనో ఎవరినెవరు లాలిస్తున్నారో / చిత్రంగా చూస్తుందే నీ కన్నతల్లి..పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి / గుమ్మాడీ గుమ్మాడీ ఆడిందంటే అమ్మాడీ / డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడివర్షంలో తడిసొచ్చీ హాయ్‌ రే హాయ్‌ అనుకుందామా (2) / రేపుదయం జలుబొచ్చి హచ్చిహచ్చి అందామా / ఓ వంకే నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ / హైపిచ్‌లో మ్యూజికల్లే తిడుతుంటుందే / మన తుమ్ములు డ్యుయెటల్లే వినపడుతుంటే గుమ్మాడీ గుమ్మాడీ ఆడిందంటే అమ్మాడీ / డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి / వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి / ముదై్దనా తినదే పరిగెత్తే పైడిలేడి / చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి / పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి

ఆటల పాటల
చిత్రం: ఆకాశమంత
సంగీతం: విద్యాసాగర్‌
గానం: మధు బాలకృష్ణన్‌
రచన: అనంత శ్రీరామ్‌
ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రా / మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా / వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా / ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రాఅడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే / మధురమౌ భావాలేవో ఊగే లోలోన / పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే / పదులై, వేలై పొంగే నాలోన / లాలిపాటే నేనై, లాలపోసేవాణ్నై / లాలనే నింపనా లేత హృదయాన / మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా / వెన్నెలై తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా / ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రాఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం / ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం / అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు / అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం / క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా / పాపవే పాపవే నాన్న నయనానమేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా / వెన్నెలై తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా / ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రా

నాన్నకు ప్రేమతో.. 
చిత్రం: నాన్నకు ప్రేమతో 
సంగీతం, రచన: దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం: దేవిశ్రీ ప్రసాద్, సాగర్‌  
ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించినా.. / ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం..నేనేదారిలో వెళ్లినా / ఏ అడ్డు నన్నాపినా / నీవెంట నేనున్నానని నను నడిపించిన / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం..ఏ తప్పు నే చేసినా / తప్పటడుగులే వేసినా / ఓ చిన్ని చిరునవ్వుతోనే.. నను మన్నించిన.. / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.. ఏ ఊసునే చెప్పినా.. ఏ పాటనే పాడినా.. / భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయిన.. / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం..ఈ అందమైన.. రంగుల లోకాన.. / ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమనందించిన.. / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.. / ఈ పాటతో.. ఈ పాటతో.. / నాన్నకు ప్రేమతో వందనం / ఈ పాటతో.. ఈ పాటతో.. ఈ పాటతో.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement