
ఓ మై.. గాడ్.. ఫాదర్స్ డే!!
తన సర్వస్వం రామ్ గోపాల్ వర్మని 'సబ్ కా బాప్'గా సంబోధిస్తూ పూరీ జగన్నాథ్ 'గాడ్' ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపాడు..
'ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బెల్లెట్ దిగిందా.. లేదా..'
'గుర్తు పెట్టుకో.. దిగిన చోటే రెండోసారీ బుల్లెట్ దిగిందంటే.. పేల్చింది విజ్జు అని'
ఈ రెండు డైలాగ్స్ రాసింది ఒక్కరే. ఆయన డైలాగ్స్ లో పేలే బుల్లెట్లు.. అబద్ధంగా చాలామంది గుండెల్లోకి దిగిపోతాయి.
వాళ్లకు అవసరమైనప్పుడు నిశ్వాసలా నోటి నుంచి బయటికొస్తాయి.
ఇప్పటివరకు ప్రేక్షకులు, అభిమానులకు అలాంటి చాలా బుల్లెట్లు తినిపించారు రచయిత, దర్శకుడు పూరి జగన్నాథ్.
ఇవ్వాళ ఫాదర్స్ డే ని పురస్కరించుకుని ట్విట్టర్ లో ఇంకో పెద్ద బుల్లెట్ పేల్చారు.
తన సర్వస్వం రామ్ గోపాల్ వర్మని 'సబ్ కా బాప్'గా సంబోధిస్తూ 'గాడ్' ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపాడు.
అమెరికన్ క్రైమ్ గ్రేట్ 'గాడ్ ఫాదర్'లో విటో కొర్లియానే ఫేమస్ స్టిల్ లో రామ్ గోపాల్ వర్మ ఫొటోను పోస్ట్ చేశారు.
గాడ్ ఫాదర్' స్పూర్తితో సినిమాల్లోకి వచ్చానని రామ్ గోపాల్ వర్మ చెప్పుకుంటే.. 'సబ్ కా బాప్' వర్మను చూసే రంగంలోకి వచ్చాననంటాడు పూరి.
వీళ్లిద్దరూ ఎలా, ఎందుకు, ఎప్పుడొచ్చారన్నది మ్యాటరేకాదు.. బుల్లెట్ దిగిందా.. లేదా..
God Father's Day .. SAB KA BAAP @RGVzoomin pic.twitter.com/PlSRvje7pK
— PURI JAGAN (@purijagan) 19 June 2016