
ఫాదర్స్ డే ఆఫర్ : ఐ ఫోన్ 6పై భారీ తగ్గింపు
ఆపిల్ ఐఫోన్ అభిమానులకు ఆన్‌లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్డ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆపిల్ ఐ ఫోన్ 6 ను భారీ డిస్కౌంట్ ధరలో అందుబాటులోకి తేనుంది.
ముంబై: ఆపిల్ ఐఫోన్ అభిమానులకు ఆన్‌లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్డ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆపిల్ ఐ ఫోన్ 6 ను భారీ డిస్కౌంట్ ధరలో అందుబాటులోకి తేనుంది. అతి తక్కువ ధరలో ప్రత్యేక ధరలో ఈస్మార్ట్‌ఫోన్‌ను జూన్ 8 నుంచి జూన్ 10 వరకు విక్రయించనుంది.
అయితే అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, దాదాపు 2,999 లకే అందించనుంది. దీనిపై ప్రకటన గురువారం వెల్లడించనుంది. వెబ్‌సైట్ అందించిన సమాచారం ప్రకారం వరల్డ్ బెస్ట్ డాడ్ పేరుతో ఈ డిస్కౌంట్‌ను ప్రకటించింది. జూన్ 8 గురువారం, జూన్ 10 శనివారం వరకు ఈ తగ్గింపు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది.
అయితే ప్రస్తుతం, ఆపిల్ ఐఫోన్ 6 (స్పేస్ గ్రే, 32 జీబి) ఫ్లిప్కార్ట్ 32 శాతం డిస్కౌంటుతో రూ.24,990 కు అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 6 (16 జిబి) సిల్వర్, గోల్డ్ వేరియంట్లు, వరుసగా రూ.36,990, రూ. 36,499 గాఉన్నాయి. అదనంగా రూ.15వేలదాకా ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది.
కాగా భారత్‌లోఫాదర్స్ డేను ఈ సంవత్సరం జూన్ 18 న (జూన్ నెలలోని మూడవ ఆదివారం) జరుపుకుంటున్నారు.