కోహ్లీ ఎంత క్యూట్గా ఉన్నాడో.. | Virat Kohli Shared a Cute Picture With his Dad on Father's Day | Sakshi

కోహ్లీ ఎంత క్యూట్గా ఉన్నాడో..

Published Mon, Jun 20 2016 10:22 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

కోహ్లీ ఎంత క్యూట్గా ఉన్నాడో..

కోహ్లీ ఎంత క్యూట్గా ఉన్నాడో..

ఫాదర్స్ డే సందర్భంగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ కొంత భావోద్వేగంతో నిండిన శుభాకాంక్షలు తెలిపారు. ఒక వ్యక్తిగా తన తండ్రిని ప్రస్తావిస్తూనే అందరి తండ్రులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ పంచుకున్నారు.

న్యూఢిల్లీ: ఫాదర్స్ డే సందర్భంగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ కొంత భావోద్వేగంతో నిండిన శుభాకాంక్షలు తెలిపారు. ఒక వ్యక్తిగా తన తండ్రిని ప్రస్తావిస్తూనే అందరి తండ్రులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ పంచుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రితో ఉన్న అత్యంత అరుదైన చిన్ననాటి ఫొటోను సామాజిక అనుసంధాన వేదికలో ఒకటైన ఇన్‌స్టాగ్రమ్లో పోస్ట్ చేశాడు.

తనకు తెలిసిన అత్యంత శక్తిమంతమైన వ్యక్తి తన తండ్రేనని పేర్కొంటూ అందరి తండ్రులకు పాదర్స్ డే శుభాకాంక్షలు అని తెలియజేశాడు. పద్దినిమేదేళ్ల వయసులో విరాట్ కోహ్లీ తన తండ్రిని కోల్పోయాడు. కర్ణాటకపై ఢిల్లీ టీంతో కలసి కోహ్లీ రంజీ ట్రోఫీ అడుతున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయారు. అయినప్పటికీ తన ఆటను కొనసాగించాడు కోహ్లీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ తన తండ్రి చనిపోయినప్పటికీ ఆ రోజు ఆటను కొనసాగించకుంటే పెద్ద తప్పు చేసినవాడిని అయ్యేవాడినని, అలా చేయడం వల్లే తనను ఓ వ్యక్తిగా నిలబెట్టిందని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement