Fathers Day 2021: Papa Mere Papa Stickers Pack In WhatsApp, Check How To Download - Sakshi
Sakshi News home page

 Father's Day: వాట్సాప్‌ న్యూ అప్‌డేట్‌.. ‘పాపా మేరే పాపా’

Published Sat, Jun 19 2021 1:47 PM | Last Updated on Sat, Jun 19 2021 7:43 PM

WhatsApp launches Papa mere papa sticker pack in India for - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఇన్‌స్టంట్  మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌  తన వినియోగదారులకు చక్కటి అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాదర్స్‌ డే సందర‍్భంగా
(జూన్ 20, 2021) యూజర్ల సౌలభ్యం కోసం  ‘పాపా మేరే పాపా’  పేరుతో  కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను  లాంచ్‌ చేసింది. బాలీవుడ్‌ మూవీ ‘ మై ఐసా హీ హూం’’ లోని  పాపులర్‌ సాంగ్‌ ‘పాపా మేరే పాపా’ ప్రేరణతోనే  దీన్ని తీసుకొచ్చింది. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు వాట్సాప్‌లో స్టిక్కర్ ప్యాక్ అందుబాటులో ఉంది. స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు వాట్సాప్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

మొదట భారత్‌, ఇండోనేషియాలో లాంచ్‌ చేసినా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్, వాబేటా ఇన్ఫో ఈ ప్యాక్ గురించి  నివేదించింది. "చెప్పడానికి కష్టంగా అనిపించే విషయాలు చెప్పడంలో సహాయం చేస్తూ లవింగ్‌ తండ్రీ కొడుకులను గుర్తుచేస్తుంది" అనే సందేశంతో దీ‍న్ని తీసుకొచ్చింది.  కాగా వాట్సాప్ సందర్భానికి తగినట్టు సిక్కర్ ప్యాక్‌లను విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లవ్ అండ్ ప్రైడ్ స్టిక్కర్ ప్యాక్‌ను, అదేవిధంగా మదర్స్ డే స్టిక్కర్లను కూడా  విడుదల చేసింది. 

స్టిక్కర్‌న ప్యాక్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
వ్యక్తిగత చాట్ విండో లేదా గ్రూప్ చాట్ విండోను ఓపెన్‌ చేయండి. కొత్త స్టిక్కర్ విభాగాన్ని బ్రౌజ్ చేసేందుకు స్టిక్కర్స్ మెనులో ప్లస్ చిహ్నంపై ప్రెస్‌ చేస్తే తాజా స్టిక్కర్ ప్యాక్ పైన కనిపిస్తుంది. దాంట్లోంచి ఇష్టమైన ఎమోజీని డౌన్‌ లోడ్‌ చేస్కోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement