వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. యూజర్ల భద్రత విషయంలో వాట్సాప్ అసలు రాజీ పడదు. కొన్నిరోజుల క్రితం యూజర్ల కోసం సరికొత్త ఫోటో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాట్సాప్ ఫోటోలను స్టిక్కర్స్‌గా మార్చే ఫీచర్‌ను యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో యూజర్లు ఎలాంటి థర్డ్‌పార్టీ యాప్స్‌ను వాడకుండా ఫోటోలను స్టిక్కర్లుగా మార్చవచ్చును.
చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..!
ప్రస్తుతం ఈ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌ను బీటావాట్సాప్ వర్షన్‌లో వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. డబ్ల్యూఏబెటాఇన్ఫో ప్రకారం..వాట్సాప్ చాట్ డైలాంగ్ బాక్స్‌లో ఈ ఫీచర్ కన్పించనుంది. యూజర్లు ఎంచుకున్న ఫోటోలను స్టిక్కర్ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆయా ఫోటోలను స్టిక్కర్లుగా మార్చవచ్చును.
తాజాగా వాట్సాప్ మల్టీ-డివైజ్ ఫీచర్‌ను కూడా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ ఆన్‌లైన్‌లో లేకున్నా ఏకకాలంలో నాలుగు డివైజ్‌లకు సపోర్ట్ చేస్తూ యాప్‌ను ఉపయోగించవచ్చును.
Comments
Please login to add a commentAdd a comment