LIC Launches WhatsApp Services, Here is How It Can Be Availed - Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ గుడ్‌ న్యూస్‌: వాట్సాప్‌లోనే వివరాలన్నీ..నెంబరు ఇదిగో!

Published Fri, Dec 2 2022 6:48 PM | Last Updated on Fri, Dec 2 2022 7:22 PM

Do you LIC WhatsApp number recently Launched Check details - Sakshi

LIC WhatsApp Service: దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) వినియోగదారులకు అద్భుతమైన వార్త అందింది. పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం,  బోనస్‌ ఇతర  సర్వీసులపై తన కస్టమర్లకు పూర్తి సమాచారం అందించేలా వాట్సాప్ సర్వీస్‌ను ఎల్‌ఐసీ ప్రారంభించింది. ఇకపై ప్రతీ చిన్న పనికి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏజెంట్‌ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఈ చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. ఎల్‌ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వాట్సాప్ సర్వీస్ ప్రారంభమైందంటూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. తమ పాలసీ వివరాలను ఎల్‌ఐసీ పోర్ట్‌లో రిజస్టర్‌ చేసుకున్న  రిజిస్టర్డ్‌ మెంబర్స్‌కు ఈ సేవలు అందుబాటులో ఉంటాయిని తెలిపారు. (లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్‌ పవర్‌ అంటున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌) 

వాట్సాప్‌ నంబర్ ద్వారా అనేక సేవలు
రిజిస్టర్డ్‌ వినియోగదారులు మొబైల్ ఫోన్ నుండి ‘8976862090’నంబర్‌కు 'హాయ్' అని మెసేజ్‌ పంపితే చాలు.. క్లయింట్లు ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు.  (మారుతి కార్‌ లవర్స్‌కి షాకింగ్‌ న్యూస్‌: ఆ కారణం చెప్పి..!)
ప్రీమియం బకాయి
బోనస్ సమాచారం
పాలసీ స్థితి
లోన్ అర్హత కొటేషన్
లోన్ రీపేమెంట్ కొటేషన్
చెల్లించవలసిన రుణ వడ్డీ
ప్రీమియం చెల్లింపు సర్టిఫికేట్
ULIP-యూనిట్‌ల స్టేట్‌మెంట్
LIC సర్వీస్ లింక్‌లు
సేవలను ప్రారంభించడం/నిలిపివేయడం

ఎలా నమోదు చేసుకోవాలి?
► పాలసీ నంబర్స్‌,  ఇన్‌స్టాల్‌మెంట్ ప్రీమియం, పాస్‌పోర్ట్ లేదా పాన్ కార్డ్ స్కాన్ చేసిన కాపీ (ఫైల్‌ సైజ్‌ 100kb)
ఎఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి  ‘కస్టమర్ పోర్టల్’  ఎంచుకోవాలి.
మీరు ఇంతకు ముందు నమోదు చేసుకోకుంటే, ‘న్యూ యూజర్‌’పై క్లిక్ చేయండి.
బేసిక్‌ సర్వీసెస్‌లో  వినియోగదారు ID, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి. పాలసీ వివరాలను  నమోదు చేసి  యాడ్‌ పాలసీని సెలెక్ట్‌ చేయాలి. దీంతో మీ పాలసీ వివరాలన్నీ స్వయంచాలకంగా రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో  రిజిస్టర్‌ అయి ఉంటాయి. 

కాగా ఎల్‌ఐసీ న్యూ జీవన్ అమర్, కొత్త టెక్-టర్మ్ అనే రెండు ప్లాన్‌లు ఇటీవలే  పునఃప్రారంభం చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం విడుదల చేసిన ఈ రెండు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను మళ్లీ లాంచ్‌ చేశామని ఎల్‌ఐసీ తెలిపింది. ఈ పాలసీలు ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.<

/p>

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement