Policy lapse
-
ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఇక ఆ అవసరమే ఉండదు
LIC WhatsApp Service: దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) వినియోగదారులకు అద్భుతమైన వార్త అందింది. పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్ ఇతర సర్వీసులపై తన కస్టమర్లకు పూర్తి సమాచారం అందించేలా వాట్సాప్ సర్వీస్‌ను ఎల్ఐసీ ప్రారంభించింది. ఇకపై ప్రతీ చిన్న పనికి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏజెంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఈ చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వాట్సాప్ సర్వీస్ ప్రారంభమైందంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. తమ పాలసీ వివరాలను ఎల్ఐసీ పోర్ట్‌లో రిజస్టర్ చేసుకున్న రిజిస్టర్డ్ మెంబర్స్‌కు ఈ సేవలు అందుబాటులో ఉంటాయిని తెలిపారు. (లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్) వాట్సాప్ నంబర్ ద్వారా అనేక సేవలు రిజిస్టర్డ్ వినియోగదారులు మొబైల్ ఫోన్ నుండి ‘8976862090’నంబర్‌కు 'హాయ్' అని మెసేజ్ పంపితే చాలు.. క్లయింట్లు ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు. (మారుతి కార్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..!) ►ప్రీమియం బకాయి ► బోనస్ సమాచారం ► పాలసీ స్థితి ►లోన్ అర్హత కొటేషన్ ►లోన్ రీపేమెంట్ కొటేషన్ ►చెల్లించవలసిన రుణ వడ్డీ ► ప్రీమియం చెల్లింపు సర్టిఫికేట్ ►ULIP-యూనిట్ల స్టేట్మెంట్ ►LIC సర్వీస్ లింక్‌లు ►సేవలను ప్రారంభించడం/నిలిపివేయడం ఎలా నమోదు చేసుకోవాలి? ► పాలసీ నంబర్స్, ఇన్స్టాల్మెంట్ ప్రీమియం, పాస్‌పోర్ట్ లేదా పాన్ కార్డ్ స్కాన్ చేసిన కాపీ (ఫైల్ సైజ్ 100kb) ►ఎఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ‘కస్టమర్ పోర్టల్’ ఎంచుకోవాలి. ►మీరు ఇంతకు ముందు నమోదు చేసుకోకుంటే, ‘న్యూ యూజర్’పై క్లిక్ చేయండి. ►బేసిక్ సర్వీసెస్‌లో వినియోగదారు ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. పాలసీ వివరాలను నమోదు చేసి యాడ్ పాలసీని సెలెక్ట్ చేయాలి. దీంతో మీ పాలసీ వివరాలన్నీ స్వయంచాలకంగా రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో రిజిస్టర్ అయి ఉంటాయి. కాగా ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్, కొత్త టెక్-టర్మ్ అనే రెండు ప్లాన్లు ఇటీవలే పునఃప్రారంభం చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం విడుదల చేసిన ఈ రెండు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను మళ్లీ లాంచ్ చేశామని ఎల్ఐసీ తెలిపింది. ఈ పాలసీలు ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. -
లాప్స్ అయితే ప్రీమియం పెరగొచ్చు
ఏదైనా ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే ముందుగా చేసే పని అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం. కాని ఇందులో చాలామంది అనవసర ఖర్చుల్లో బీమా ప్రీమియం చెల్లింపులను కూడా చేరుస్తున్నారు. కాని సకాలంలో ప్రీమియంలు చెల్లించకపోతే పాలసీ ప్రయోజనాలు ఆగిపోయి పాలసీ రద్దు అవుతుందన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏ కారణం చేతనైనా పాలసీ లాప్స్ అయితే అత్యవసర పరిస్థితుల్లో సైతం మీ కుటుంబానికి ఎలాంటి బీమా సౌకర్యం, ఆర్థిక రక్షణ లభించదు. ఇది చాలా కుటుంబాలకు పెను విషాదాన్ని మిగులుస్తోంది. ఇలాంటి కేసుల్లో అత్యధికమంది ప్రీమియంలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలపై సరైన అవగాహన లేకపోవడమే కారణం అన్నది తెలుస్తోంది. సాధారణంగా బీమా కంపెనీలు ప్రీమియం చెల్లించాల్సిన సమయం దాటిన తర్వాత కూడా 30 రోజుల గ్రేస్ పిరియడ్‌ను అందిస్తాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రీమియంలు కట్టలేక రద్దు అయిన పాలసీలను పునరుద్ధరించుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తాయి. పాలసీ నియమ నిబంధనలను అనుసరించి నిర్దేశిత కాలంలోగా పాలసీలను పునరుద్ధరించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మరింత ఆలస్యం అయితే ఇలా పునరుద్ధరించుకునే అవకాశాన్ని కూడా కోల్పోతారు. దీనివల్ల అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలపై భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. ముందే చూడాలి అందుకే పాలసీ తీసుకునే ముందే ప్రీమియం గ్రేస్ పిరియడ్, పాలసీ పునరుద్ధరణకు అవకాశాలు వంటి అంశాలను తప్పకుండా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పాలసీ పునరుద్ధరణ సమయంలో ప్రీమియంలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా దీర్ఘకాలం చెల్లించకుండా ఆగిపోయిన పాలసీలను పునరుద్ధరించుకునేటప్పుడు ప్రాసెస్ మొదటి నుంచి మొదలవుతుంది. ఆరోగ్య పరీక్షలు, మోర్టాలిటీ చార్జీలు, ఒకవేళ ఆరోగ్య విషయంలో ఏమైనా తేడాలొస్తే ప్రీమియం ధరలు పెరుగుతాయి. అంటే మొదటిసారి పాలసీ తీసుకున్న ప్రీమియం కంటే చాలా ఎక్కువ ప్రీమియం చెల్లిం చాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. సకాలంలో చెల్లించండి ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ప్రీమియంలు సకాలంలో చెల్లించాల్సి ఉంటుం ది. ఇప్పుడు బీమా కంపెనీలు నేరుగా ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ (ఈసీఎస్) ద్వారా ప్రీమియంలు చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ విధానాన్ని ఎంచుకుంటే ప్రీమియం చెల్లించే సమయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. దీనికి తగ్గట్టుగా ముందుగానే ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు కాబట్టి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా ప్రీమియం అనేది భారంగా పరిగణించే పరిస్థితి ఉండదు. పొదుపు తర్వాతనే ఖర్చు అనే సూత్రాన్ని అవలంబిస్తూ ప్రీమియానికి కావల్సిన మొత్తాన్ని ముందుగానే సమకూర్చుకోండి.