Policy premium
-
ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఇక ఆ అవసరమే ఉండదు
LIC WhatsApp Service: దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) వినియోగదారులకు అద్భుతమైన వార్త అందింది. పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్ ఇతర సర్వీసులపై తన కస్టమర్లకు పూర్తి సమాచారం అందించేలా వాట్సాప్ సర్వీస్‌ను ఎల్ఐసీ ప్రారంభించింది. ఇకపై ప్రతీ చిన్న పనికి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏజెంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఈ చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వాట్సాప్ సర్వీస్ ప్రారంభమైందంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. తమ పాలసీ వివరాలను ఎల్ఐసీ పోర్ట్‌లో రిజస్టర్ చేసుకున్న రిజిస్టర్డ్ మెంబర్స్‌కు ఈ సేవలు అందుబాటులో ఉంటాయిని తెలిపారు. (లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్) వాట్సాప్ నంబర్ ద్వారా అనేక సేవలు రిజిస్టర్డ్ వినియోగదారులు మొబైల్ ఫోన్ నుండి ‘8976862090’నంబర్‌కు 'హాయ్' అని మెసేజ్ పంపితే చాలు.. క్లయింట్లు ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు. (మారుతి కార్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..!) ►ప్రీమియం బకాయి ► బోనస్ సమాచారం ► పాలసీ స్థితి ►లోన్ అర్హత కొటేషన్ ►లోన్ రీపేమెంట్ కొటేషన్ ►చెల్లించవలసిన రుణ వడ్డీ ► ప్రీమియం చెల్లింపు సర్టిఫికేట్ ►ULIP-యూనిట్ల స్టేట్మెంట్ ►LIC సర్వీస్ లింక్‌లు ►సేవలను ప్రారంభించడం/నిలిపివేయడం ఎలా నమోదు చేసుకోవాలి? ► పాలసీ నంబర్స్, ఇన్స్టాల్మెంట్ ప్రీమియం, పాస్‌పోర్ట్ లేదా పాన్ కార్డ్ స్కాన్ చేసిన కాపీ (ఫైల్ సైజ్ 100kb) ►ఎఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ‘కస్టమర్ పోర్టల్’ ఎంచుకోవాలి. ►మీరు ఇంతకు ముందు నమోదు చేసుకోకుంటే, ‘న్యూ యూజర్’పై క్లిక్ చేయండి. ►బేసిక్ సర్వీసెస్‌లో వినియోగదారు ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. పాలసీ వివరాలను నమోదు చేసి యాడ్ పాలసీని సెలెక్ట్ చేయాలి. దీంతో మీ పాలసీ వివరాలన్నీ స్వయంచాలకంగా రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో రిజిస్టర్ అయి ఉంటాయి. కాగా ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్, కొత్త టెక్-టర్మ్ అనే రెండు ప్లాన్లు ఇటీవలే పునఃప్రారంభం చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం విడుదల చేసిన ఈ రెండు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను మళ్లీ లాంచ్ చేశామని ఎల్ఐసీ తెలిపింది. ఈ పాలసీలు ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. -
పది కోట్ల ప్రమాద బీమా! నివాబూపా కొత్త పాలసీ
న్యూఢిల్లీ: నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ (మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్) స్టాండలోన్ వ్యక్తిగత ప్రమాదబీమా పాలసీని విడుదల చేసింది. ప్రమాదం కారణంగా మరణం, పాక్షిక, తాత్కాలిక వైకల్యం, శాశ్వత వైకల్యం వంటి వాటివల్ల కుటుంబానికి రక్షణను ఈ ప్లాన్‌లో పొందొచ్చు. ప్రమాదాల విషయంలో ఎటువంటి ఆందోళన చెందకుండా జీవితాన్ని ప్రశాంతంగా సాగించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్లాన్‌ను రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. రూ. 10 కోట్లు వార్షిక ఆదాయానికి గరిష్టంగా 25 రెట్ల వరకు (రూ.10కోట్లు) ఈ ప్లాన్‌లో కవరేజీని పొందొచ్చు. ప్రమాదం వల్ల అంగవైకల్యానికి గురి అయితే పాలసీ నిబంధనలకు అనుగుణంగా బీమా కవరేజీలో 2 శాతానికి ప్రతీ వారం చొప్పున (గరిష్టంగా ఒక వారానికి రూ.లక్ష) కంపెనీ చెల్లిస్తుంది. ఇలాంటి ఎన్నో రకాల ఆప్షన్లతో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. పాలసీదారు ప్రమాదంలో మరణిస్తే.. చైల్డ్ సపోర్ట్ బెనిఫిట్ ఆప్షన్ కింద పిల్లల విద్య కోసం రూ.5లక్షల వరకు కంపెనీ చెల్లిస్తుంది. రుణానికి భద్రత కల్పించే ప్రయోజనం కూడా ఇందులో ఉంది. చదవండి : ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జెరోదా..! -
జీవిత బీమా కంపెనీలకు... కొత్త పాలసీల జోరు
జూలైలో రూ.13,854 కోట్ల నూతన ప్రీమియం.. రూ.10,737 కోట్లతో ఎల్ఐసీ అగ్ర వాటా న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలకు నూతన పాలసీ ప్రీమియంల ఆదాయం జూలైలో 4 శాతం పెరిగి రూ.13,854కోట్లు వసూలు అయింది. గతేడాది జూలైలో నూతన పాలసీల ప్రీమియం ఆదాయం రూ.13,319 కోట్లుగా ఉంది. కొత్త పాలసీల్లో అగ్ర వాటా ఎప్పటిలాగే ప్రభుత్వరంగ ఎల్ఐసీకే దక్కింది. ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం 3 శాతం పెరిగి రూ.10,737కోట్లకు చేరుకుంది. మిగిలిన 23 జీవిత బీమా కంపెనీల కొత్త వ్యాపార (నూతన పాలసీలు) ఆదాయం 7.5 శాతం వృద్ధి చెంది రూ.3,116 కోట్లకు చేరుకుంది. గతేడాది జూలైలో వీటి ఆదాయం రూ.2,898 కోట్లుగా ఉంది. ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం... {Oపెవేటు రంగ బీమా కంపెనీల్లో ఎస్బీఐ లైఫ్ అధిక వృద్ధి కనబరిచింది. నూతన పాలసీల ద్వారా రూ.676 కోట్ల ఆదాయాన్ని గడించింది. గతేడాది ఇదే నెలలో వచ్చిన రూ.497 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారం 17 శాతం వృద్ధి చెంది రూ.521 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే నెలలో ఆదాయం రూ.445 కోట్లు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నూతన పాలసీల వ్యాపారం సైతం 16.5 శాతం వృద్ధి చెంది రూ.565 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీల ఆదాయం తగ్గింది జూలై నెలలో నూతన పాలసీల ద్వారా ఆదాయం కోల్పోయిన వాటిల్లో కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ, అవివా లైఫ్, రెలియన్స్ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. రిలయన్స్ లైఫ్ ఆదాయం సగానికి పడిపోయి రూ.62 కోట్లకు పరిమితం అయింది. -
జీవిత బీమా.. ఎంపిక ఇలా..
ఎప్పుడేం జరుగుతుందో తెలియని ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో జీవిత బీమా పాలసీ తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరమైన నిర్ణయమే. కుటుంబం మొత్తానికి ఆర్థికపరమైన భరోసానిచ్చే పాలసీని తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలను పాటిస్తే మెరుగైన నిర్ణయం తీసుకునే వీలుంటుంది. వివిధ రకాల పాలసీలు, కవరేజీలు తదితర అంశాల గురించి తెలియజెప్పేందుకే ఈ కథనం. బీమా ఎందుకంటే.. ఇంటి పెద్దకు ఏదైనా అనుకోనిది జరిగినా కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితులు తల్లకిందులు కాకుండా భరోసా కల్పిస్తుంది జీవిత బీమా పాలసీ. సాధ్యమైనంత తక్కువ వయసులోనే పాలసీని తీసుకుంటే ప్రీమియం భారం తక్కువగా ఉంటుంది. పైగా యువ ప్రొఫెషనల్స్‌కి పన్ను ప్రయోజనాలిచ్చే సాధనంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే, పెళ్లి, పిల్లల చదువు, రిటైర్మెంట్ వంటి వివిధ లక్ష్యాల సాధనలోనూ భరోసాగా ఉంటుంది. సాధారణంగానైతే జీవిత బీమా పాలసీలు కేవలం లైఫ్ కవర్‌కి మాత్రమే పరిమితమయ్యేవి. కానీ ప్రస్తుతం అత్యవసర వైద్యం, ప్రమాదాల్లో అంగవైకల్యం, తీవ్ర అనారోగ్యం వంటి వాటికి కూడా కవరేజీ ఇచ్చే పాలసీలను కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి. కవరేజీ ఎంత ఉండాలి.. పాలసీదారు అనంతరం నామినీకి లభించే మొత్తాన్ని కవరేజీగా వ్యవహరిస్తారు. దీన్ని లెక్కించేందుకు సులభమైన సూత్రం ఒకటుంది. మీ వార్షిక జీతాన్ని 8తో గుణిస్తే ఎంత వస్తుందో అంత కవరేజీకి పాలసీని తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. మరింత వివరంగా కావాలంటే పాలసీదారు తదనంతరం కూడా కొనసాగే కుటుంబం నెలవారీ ఖర్చులన్నీ కొన్నాళ్ల దాకా పరిగణనలోకి తీసుకుంటే.. ఎంత మొత్తం అవసరమవుతుందనేది ఒక అంచనాకు రావచ్చు. దానికి తగ్గట్లు కాస్త అటూ ఇటుగా లెక్కవేసుకుని తక్కువ ప్రీమియంతో మెరుగైన కవరేజీ ఇచ్చే పాలసీని ఎంచుకోవచ్చు. ఏ పాలసీ తీసుకోవచ్చు .. వ్యక్తిగత పరిస్థితులను బట్టి జీవిత బీమా పాలసీని ఎంపిక చేసుకోవడం ఉంటుంది. సాధారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు.. టర్మ్ ప్లాన్, సంప్రదాయక ఎండోమెంట్ ప్లాను, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాను (యులిప్), రిటైర్మెంట్ లేదా పింఛను ప్లాన్ల తరహాల్లో ఉంటాయి. వీటన్నింటిలోకెల్లా టర్మ్ ప్లాన్ అనేది అచ్చంగా పాలసీదారు మరణానంతర కవరేజీకి మాత్రమే ఉద్దేశించినది. దీనికి కట్టిన ప్రీమియంలు పాలసీదారు జీవితకాలంలో తిరిగి రావు. మరణానంతరం కుటుంబానికి పెద్ద మొత్తం లభిస్తుంది. మిగతా పాలసీలతో పోలిస్తే దీని ప్రీమియంలు చాలా తక్కువగా ఉంటాయి. మరోవైపు, ఎండోమెంట్ పాలసీలను తీసుకుంటే ఇవి పొదుపు, బీమా రక్షణ కల్పించే సాధనాలుగా ఉంటాయి. పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత లేదా పాలసీదారు మరణానంతరం కవరేజీ మొత్తం లభిస్తుంది. ఇక, యులిప్లనేవి మార్కెట్ ఆధారిత దీర్ఘకాలిక సేవింగ్స్ కమ్ ప్రొటెక్షన్ పథకాల్లాంటివి. ఈ పథకాలు షేర్లు, డెట్ సాధనాల్లో నిర్దిష్ట నిష్పత్తి ప్రకారం ఇన్వెస్ట్ చేసి రాబడులు అందిస్తాయి. రిటైర్మెంట్ ప్లాన్లనేవి సంప్రదాయ పాలసీల రూపంలోనైనా ఉండొచ్చు లేదా యులిప్స్ రూపంలోనైనా ఉండొచ్చు. వీటిల్లో మెచ్యూరిటీ అనంతరం తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. పాలసీ ప్రీమియం.. మనం ఎంచుకునే కవరేజీ, వయసు తదితర అంశాలను బట్టి ప్రీమియం మారుతుంటుంది. సిగరెట్లు తాగేవారు, అధిక బరువున్న వారు, ప్రమాదకరమైన వృత్తుల్లోనివారు.. హాబీలు ఉన్నవారికి ప్రీమియం అధికంగా ఉంటుంది. కనుక జీవన విధానానికి అనువైన రైడర్లను ఎంచుకోవడం మంచిది. స్థూలంగా చెప్పాలంటే.. మన రిస్కు సామర్థ్యం, నిర్దిష్ట లక్ష్యాన్ని బట్టి పాలసీ తీసుకోవాలి. కావాలనుకుంటే అదనపు రిస్క్ కవరేజీ వంటివి కూడా ఎంచుకోవచ్చు. - పంకజ్ రజ్దాన్ సీఈవో, బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్