పది కోట్ల ప్రమాద బీమా! నివాబూపా కొత్త పాలసీ | Niva Bupa Insurance Company Offers Ten Crore Rupees Accident Policy | Sakshi
Sakshi News home page

పది కోట్ల ప్రమాద బీమా! నివాబూపా కొత్త పాలసీ

Published Mon, Aug 30 2021 8:48 AM | Last Updated on Mon, Aug 30 2021 9:24 AM

Niva Bupa Insurance Company Offers Ten Crore Rupees Accident Policy - Sakshi

న్యూఢిల్లీ: నివాబూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (మ్యాక్స్‌బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌) స్టాండలోన్‌ వ్యక్తిగత ప్రమాదబీమా పాలసీని విడుదల చేసింది. ప్రమాదం కారణంగా మరణం, పాక్షిక, తాత్కాలిక వైకల్యం, శాశ్వత వైకల్యం వంటి వాటివల్ల కుటుంబానికి రక్షణను ఈ ప్లాన్‌లో పొందొచ్చు. ప్రమాదాల విషయంలో ఎటువంటి ఆందోళన చెందకుండా జీవితాన్ని ప్రశాంతంగా సాగించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్లాన్‌ను రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది.

రూ. 10 కోట్లు
వార్షిక ఆదాయానికి గరిష్టంగా 25 రెట్ల వరకు (రూ.10కోట్లు) ఈ ప్లాన్‌లో కవరేజీని పొందొచ్చు. ప్రమాదం వల్ల అంగవైకల్యానికి గురి అయితే పాలసీ నిబంధనలకు అనుగుణంగా బీమా కవరేజీలో 2 శాతానికి ప్రతీ వారం చొప్పున (గరిష్టంగా ఒక వారానికి రూ.లక్ష) కంపెనీ చెల్లిస్తుంది. ఇలాంటి ఎన్నో రకాల ఆప్షన్లతో ఈ ప్లాన్‌ అందుబాటులో ఉంది. పాలసీదారు ప్రమాదంలో మరణిస్తే.. చైల్డ్‌ సపోర్ట్‌ బెనిఫిట్‌ ఆప్షన్‌ కింద పిల్లల విద్య కోసం రూ.5లక్షల వరకు కంపెనీ చెల్లిస్తుంది. రుణానికి భద్రత కల్పించే ప్రయోజనం కూడా ఇందులో ఉంది.   

చదవండి : ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్‌ఆఫర్‌ ప్రకటించిన జెరోదా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement