max bupa Health Insurance Company
-
పది కోట్ల ప్రమాద బీమా! నివాబూపా కొత్త పాలసీ
న్యూఢిల్లీ: నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ (మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్) స్టాండలోన్ వ్యక్తిగత ప్రమాదబీమా పాలసీని విడుదల చేసింది. ప్రమాదం కారణంగా మరణం, పాక్షిక, తాత్కాలిక వైకల్యం, శాశ్వత వైకల్యం వంటి వాటివల్ల కుటుంబానికి రక్షణను ఈ ప్లాన్‌లో పొందొచ్చు. ప్రమాదాల విషయంలో ఎటువంటి ఆందోళన చెందకుండా జీవితాన్ని ప్రశాంతంగా సాగించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్లాన్‌ను రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. రూ. 10 కోట్లు వార్షిక ఆదాయానికి గరిష్టంగా 25 రెట్ల వరకు (రూ.10కోట్లు) ఈ ప్లాన్‌లో కవరేజీని పొందొచ్చు. ప్రమాదం వల్ల అంగవైకల్యానికి గురి అయితే పాలసీ నిబంధనలకు అనుగుణంగా బీమా కవరేజీలో 2 శాతానికి ప్రతీ వారం చొప్పున (గరిష్టంగా ఒక వారానికి రూ.లక్ష) కంపెనీ చెల్లిస్తుంది. ఇలాంటి ఎన్నో రకాల ఆప్షన్లతో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. పాలసీదారు ప్రమాదంలో మరణిస్తే.. చైల్డ్ సపోర్ట్ బెనిఫిట్ ఆప్షన్ కింద పిల్లల విద్య కోసం రూ.5లక్షల వరకు కంపెనీ చెల్లిస్తుంది. రుణానికి భద్రత కల్పించే ప్రయోజనం కూడా ఇందులో ఉంది. చదవండి : ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జెరోదా..! -
మాక్స్‌బుపాలో వాటా విక్రయించిన మ్యాక్స్ ఇండియా
న్యూఢిల్లీ: మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్‌లో తనకున్న మొత్తం 51 శాతం వాటాను మ్యాక్స్ ఇండియా విక్రయించింది. ఈ వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, ట్రూ నార్త్ ఫండ్ ఫోర్ ఎల్ఎల్పీకి విక్రయించామని మ్యాక్స్ ఇండియా తెలిపింది. ఈ డీల్ విలువ రూ.510 కోట్లని పేర్కొంది. మొత్తం నగదులోనే ఈ లావాదేవీ జరిగింది. ఈ లావాదేవీ పరంగా చూస్తే, మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ విలువ రూ.1,001 కోట్లుగా ఉంది. రెండేళ్లలో కొత్త బ్రాండ్... ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత మాక్స్ బుపా డైరెక్టర్ల బోర్డ్‌కు డైరెక్టర్లను ట్రూ నార్త్ నామినేట్ చేయనున్నది. మరోవైపు మ్యాక్స్ ఇండియా నామినేట్ చేసిన డైరెక్టర్లు వైదొలుగుతారు. మ్యాక్స్ బ్రాండ్‌ను రెండేళ్ల పాటు కొనసాగిస్తారు. ఈ రెండేళ్లలో దశలవారీగా మరో కొత్త బ్రాండ్‌ను ఏర్పాటు చేస్తారు. బుపా బ్రాండ్ నేమ్ మాత్రం కొనసాగుతుంది. ఇక ఈ వాటా విక్రయం ద్వారా లభించిన రూ.511 కోట్లను ప్రస్తుత, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతామని మ్యాక్స్ గ్రూప్ చైర్మన్ అనల్జిత్ సింగ్ చెప్పారు. కాగా భారత్‌లో ఆరోగ్య బీమా రంగం వృద్ధి చెందుతోందని, ఆరోగ్య బీమా రంగంలో మాక్స్ బుపాను అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా రూపొందించడమే తమ లక్ష్యమని ట్రూ నార్త్ పార్ట్నర్ దివ్య సెహ్గల్ చెప్పారు. ఈ లావాదేవీ విషయంలో మ్యాక్స్ ఇండియాకు ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా కేపీఎమ్‌జీ కార్పొరేట్ ఫైనాన్స్ వ్యవహరిస్తోంది. ఆరు ప్రత్యేకమైన ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్... 1999 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రూ నార్త్(ఇండియా వేల్యూ ఫండ్ అడ్వైజర్స్–ఫోర్‌ఎఫ్‌ఏ)మధ్య తరహా లాభదాయక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి, వాటిని ప్రపంచ స్థాయి ఉన్నత సంస్థలుగా మార్చుతోంది. ట్రూ నార్త్ సంస్థ ఇప్పటికే ఆరు ప్రత్యేకమైన ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌ను ఆరంభించింది. వీటి మొత్తం నిధులు 280 కోట్ల డాలర్లను మించిపోయాయి. కాగా ఇంగ్లండ్‌కు చెందిన హెల్త్‌కేర్ సర్వీసుల దిగ్గజ సంస్థ, బుపా, మ్యాక్స్ ఇండియా కంపెనీలు కలసి మాక్స్ బుపా జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. కాగా ఈ వాటా విక్రయ వార్తల కారణంగా బీఎస్ఈలో మ్యాక్స్ ఇండియా షేర్ 2.6 శాతం లాభంతో రూ.82.50 వద్ద ముగిసింది. -
మ్యాక్స్ బూపా హెల్త్‌లో 49%కి ‘బూపా’ వాటా
బీమాలో ఎఫ్‌డీఐ వాటా పెంచాక తొలి డీల్ ఇదే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా రంగంలో విదేశీ కంపెనీల వాటాను పెంచుకోవడానికి ఆర్డినెన్స్ జారీ చేసిన తరవాత... ఆ అవకాశాన్ని వినియోగించుకున్న తొలి కంపెనీగా బ్రిటన్‌కు చెందిన బూపా రికార్డులకెక్కింది. మాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రస్తుతమున్న 26 శాతం వాటాను 49 శాతానికి బూపా పెంచుకుంది. దీనికి సంబంధించి నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేసుకుంది. ఇండియాకు చెందిన మాక్స్ గ్రూపుతో కలిసి బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాకలాపాలు కొనసాగిస్తుండటం తెలిసిందే. ఈ వాటా పెంపు భారతీయ మార్కెట్‌పై తమకున్న నమ్మకాన్ని తెలియచేస్తోందని బూపా మేనేజింగ్ డెరైక్టర్ (ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్) డేవిడ్ ఫ్లెచ్చర్ చెప్పారు. ఈ నిధులతో దేశీయ ఆరోగ్య బీమా సేవలు మరింతగా విస్తరించడంతో పాటు, బూపా వ్యాపార విస్తరణ సులభమవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ వచ్చిన ఆరు నెలల్లోనే బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపు వంటి కీలక సంస్కరణలను అమలు చేయడంపై మ్యాక్స్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ రాహుల్ ఖోస్లా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మ్యాక్స్ బూపాకు దేశవ్యాప్తంగా 16 పట్టణాల్లో 26 కార్యాలయాలున్నాయి. 3,500 ఆసుపత్రులతో ఒప్పందాలున్నాయి.