‘సెర్చ్’ మార్కెట్‌లో చాలా కారణంగా తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తున్న గూగుల్‌కి కొత్త శత్రవు వస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం ఓపెన్‌ఏఐ (OpenAI).. సెర్చ్‌జీపీటీ (SearchGPT) పేరుతో
ఇంటర్నెట్ నుంచి రియల్ టైమ్ సమాచారాన్ని అందించే ఏఐ మిళిత సెర్చ్ ఇంజిన్ సెలెక్టివ్ లాంచ్‌తో ఈ మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది.
ఈ మేరకు ఓపెన్ ఏఐ తాజాగా ప్రకటించింది. దీంతో ఈ ఏఐ దిగ్గజానికి అతిపెద్ద మద్దతుదారుగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన బింగ్ సెర్చ్‌తో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా మద్దతు ఉన్న పెర్‌ప్లెక్సిటీ వంటి అభివృద్ధి చెందుతున్న సెర్చ్ ఏఐ చాట్‌బాట్‌లకు పోటీగా నిలిచింది.
కొత్త సాధనం కోసం సైన్-అప్‌లను తెరిచినట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. ఇది ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉంది. కొంతమంది యూజర్లు, పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నారు. సెర్చ్ టూల్‌లోని అత్యుత్తమ ఫీచర్‌లను భవిష్యత్తులో చాట్‌జీపీటీలో ఇంటిగ్రేట్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఓపెన్‌ఏఐ ప్రకటన తర్వాత గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు గురువారం 3% తగ్గాయి.
వెబ్ అనలిటిక్స్ సంస్థ స్టాట్‌కౌంటర్ ప్రకారం.. జూన్ నాటికి గూగుల్ సెర్చ్ ఇంజన్ మార్కెట్‌లో 91.1% వాటాను కలిగి ఉంది. 2022 నవంబర్లో చాట్‌జీపీటీని ప్రారంభించినప్పటి నుంచి ప్రధాన సెర్చ్ ఇంజిన్‌లు ఏఐని సెర్చ్‌లో ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ తన బింగ్ సెర్చ్ ఇంజిన్ కోసం ఓపెన్‌ఏఐ సాంకేతికతను స్వీకరించింది. మరోవైపు గూగుల్ కూడా ఏఐ పరిష్కారాలను రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment