మనదేశంలో టిక్‌టాక్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే యురోపియన్ యూనియన్‌లో మాత్రం సంస్థ తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. సెప్టెంబరులో యూరప్‌లో 40లక్షల వీడియోలను తొలగించినట్లు కంపెనీ అక్టోబరు 25న తెలిపింది. చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్‌కు వ్యతిరేకంగా కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం.
యురోపియన్ యూనియన్‌లో తీసుకొచ్చిన కొత్త డిజిటల్ సేవల చట్టం(డీఎస్‌ఏ) ప్రకారం..ప్రధాన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి ఆరు నెలలకోసారి పారదర్శకత నివేదికను అందించాలి. అందులో భాగంగా టిక్‌టాక్ ఈ సమాచారాన్ని తెలియజేసింది.
ఆగస్టులో అమలులోకి వచ్చిన ఈచట్టం ద్వారా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, సెర్చ్ ఇంజిన్‌లకు భారీగా జరిమానా విధిస్తున్నారు. ఇప్పటికే అన్ని కంపెనీలకు కలిపి దాదాపు వాటి ప్రపంచ టర్నోవర్‌లో ఆరు శాతం వరకు జరిమానా వేసినట్లు తెలుస్తుంది. టిక్‌టాక్‌తోపాటు మరో 18 ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ సంస్థలు యూరప్‌లో వాటి నిర్వహణ బాధ్యతలు కొనసాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment