స్కూల్ రోజుల్లో కంప్యూటర్ సైన్స్ యూనిట్ టెస్ట్‌లో ఫెయిలైన ఏకైక విద్యార్థికి సాంకేతికతపై పట్టు సాధించాలనే పట్టుదల పెరిగితే ఎలా ఉంటుంది? అచ్చం... అభిక్ సాహ లా ఉంటుంది.
పశ్చిమబెంగాల్‌కు చెందిన అభిక్ సాహ పదిహేను సంవత్సరాల వయసులోనే దేశీ సెర్చ్ ఇంజిన్‌ను డెవలప్ చేసి భేష్ అనిపించుకున్నాడు. స్నేహితుడు హర్షిత్ జైన్‌తో కలిసి మొదలు పెట్టిన డీ సెంట్రలైజ్‌డ్ క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ‘వోన్లీ గేమ్’ విజయపథంలో దూసుకుపోతోంది.
కంప్యూటర్ సైన్స్ యూనిట్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన ఏకైన విద్యార్థి అభిక్ సాహ. అది తనపై బలమైన ప్రభావం చూపించింది. సాంకేతికతపై పట్టు సాధించాలనే పట్టుదలను పెంచింది. కంప్యూటర్ లాంగ్వేజ్‌లను నేర్చుకోవడాన్ని ఒకప్పుడు బోర్‌గా ఫీలైన సాహ ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. ఇంటర్నెట్‌ను విశ్వవిద్యాలయం చేసుకున్నాడు.
కంప్యూటర్ లాంగ్వేజ్‌లను నేర్చుకోవడాన్ని ఒకప్పుడు బోర్‌గా ఫీలైన సాహ ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. ఇంటర్నెట్‌ను విశ్వవిద్యాలయం
చేసుకున్నాడు.ఆన్‌లైన్ ట్యుటోరియల్ ద్వారా నేర్చుకోవడం మొదలు పెట్టాడు. ఆన్‌లైన్ ట్యుటోరియల్ ద్వారా నేర్చుకోవడం మొదలు పెట్టాడు. బేసిక్ సాఫ్ట్‌వేర్ నుంచి వెబ్‌సైట్ బ్లాకింగ్ వరకు ఎన్నో విషయాలపై పట్టు సాధించాడు. పదమూడవ పుట్టిన రోజు సందర్భంగా తండ్రి తనకు స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రపంచ సాంకేతికతపై అవగాహన పెంచుకోవడానికి, రకరకాల మొబైల్ అప్లికేషన్‌లను క్రియేట్ చేయడానికి ఈ స్మార్ట్‌ఫోన్ ఉపయోగపడింది.
పదిహేను సంవత్సరాల వయసులో వినూత్నమైన దేశీ సెర్చ్ ఇంజిన్ ‘ఒరిగాన్’ను డెవలప్ చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చి ‘భేష్’ అనిపించుకున్నాడు అభిక్ సాహ. పశ్చిమబెంగాల్‌లోని చల్స పట్టణానికి చెందిన సాహ హైస్కూల్ రోజుల్లోనే మొబైల్ అప్లికేషన్‌లు, వెబ్‌సైట్ బిల్డింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ డెవలపింగ్ లాంగ్వేజిలపై ఉచిత వీడియో ట్యుటోరియల్స్ నిర్వహించడంలో తలమునకలై ఉండేవాడు.
ఇండియన్ ఇ–స్పోర్ట్స్ వృద్ధిరేటు ఆశాజనకంగా, ఉత్సాహంగా ఉందని, 2027 కల్లా భారీ వృద్ధిరేటు కనిపిస్తుందని కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) రిపోర్ట్ తెలియజేస్తుంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రకరకాల టోర్నమెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వీక్షిస్తున్నారు. మన దేశంలో ఇ–గేమ్స్‌కు పెరుగుతున్న పాపులారిటీని గమనించి హర్షిత్ జైన్, అభిక్ సాహ డీసెంట్రలైజ్‌డ్ క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ‘వోన్లీ ప్లే’ ప్రారంభించారు. దీన్ని ‘నెక్ట్స్ బిగ్ వోటీటీ’ లక్ష్యంగా మొదలు పెట్టారు. గేమ్ ఆడాలనే ఉత్సాహం ఒక కోణం అయితే ఖర్చును దృష్టిలో పెట్టుకొని దూరంగా ఉండడం మరో కోణం.
పీసీ, కీబోర్డ్, హై–కంప్యూటింగ్ సీపీయూ సెటప్ వరకు ఎంతో ఖర్చు అవుతుంది. అయితే క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ‘వోన్లీ ప్లే’తో యూజర్‌లు మంత్లీ ప్లాన్ రూ.499 ద్వారా డిఫరెంట్ స్టోర్స్ నుంచి ఎన్నో టైటిల్స్‌తో యాక్సెస్ కావచ్చు. హై ప్రాసెసింగ్ సీపీయూలాంటి అడ్వాన్స్‌డ్ గేమింగ్ ఎక్విప్‌మెంట్ అవసరం లేదు. యూజర్స్ తమ దగ్గర ఉన్న ఏ డివైజ్ ద్వారా అయినా గేమ్స్‌తో యాక్సెస్ కావచ్చు.‘ఒక విధంగా చెప్పాలంటే ఇది సైబర్ కేఫ్‌లాంటిది అనుకోవచ్చు.
నిర్ణీతమైన టైమ్‌కు కొంత డబ్బు చెల్లించి ఇంటర్నెట్‌తో యాక్సెస్ కావడంలాంటిది’ అంటాడు కంపెనీ కో–ఫౌండర్, సీయివో హర్షిత్ జైన్. బేరింగ్ క్యాపిటల్, ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ ‘వోన్లీ ప్లే’కు సీడ్ ఫండింగ్ చేశాయి. కునాల్ షా, సూరజ్ నళిన్, అమృత్ శ్రీవాస్తవ, జితేంద్ర గుప్తా ఏంజెల్ ఇన్వెస్టర్‌లు. గత నెలలలో అధికారికంగా లాంచ్ అయిన ‘వన్ ప్లేయర్’కు 27,000 రిజిస్టర్డ్ యూజర్‌లు, 5,000 ప్లేయింగ్ సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.‘కేవలం గేమ్స్ ఆడడం మాత్రమే కాదు క్లౌడ్‌లో ప్రతీది చేయవచ్చు. ఉదాహరణకు 3డీ సాఫ్ట్‌వేర్‌ను రన్ చేయడంలాంటివి’ అంటున్నాడు కంపెనీ కో–ఫౌండర్, సీటీవో అభిక్ సాహ.
Comments
Please login to add a commentAdd a comment