గేమ్స్‌లో హారర్ గేమ్స్ మజాయే వేరయా... అంటారు. ‘మాడిసన్’ కూడా అలాంటిదే. ఈ ఫస్ట్ పర్సన్ సైకలాజికల్ హారర్ గేమ్‌లో ఎన్నో పజిల్స్ ఛేదిస్తూ ముందుకు సాగాలి. ప్రతి అడుగును పదివిధాలుగా ఆలోచించి వేయాలి. ఎవరి ఇంటి తలుపైనా తడితే...తలుపు తెరుచుకోవచ్చు. కానీ దెయ్యం కనిపించవచ్చు. డార్క్‌కార్నర్‌లో నీడలు వెంటాడవచ్చు.
ప్రతి గదిలో గోడలకు వేలాడుతున్న బ్లాక్ అండ్ వైట్‌ఫోటోలు, హిడెన్ మెసేజ్‌లు! ఈ గేమ్‌లో ప్రతి క్యారెక్టర్ ఒక డిస్టర్బింగ్ స్టోరీ. దుష్టశక్తి నుంచి రక్షించుకోవడానికి ‘ఇన్‌స్టంట్ కెమెరా’ను మాత్రమే ఆయుధంగా వాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన కండ్లు చూడలేని దృశ్యాలను కెమెరా కన్ను చూస్తుంది. ప్రధాన పాత్ర ‘లూకా’గా మారతారా? సవాలుకు సై అంటే పదండి మరీ!
ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 4, నిన్‌టెండో స్విచ్, ఎక్స్‌బాక్స్–1, మైక్రోసాఫ్ట్ విండోస్, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, సిరీస్ 5, ప్లే స్టేషన్ 5
Comments
Please login to add a commentAdd a comment