బ్రౌజర్లు ఎన్ని ఉన్నా.. ఎక్కువ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ‘డిఫాల్ట్’గా ఉంటుందని తెలిసిందే. ఇందుకోసం కొన్ని కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంటుంది గూగుల్. తాజాగా ఈ ఇంటర్నెట్ బ్రౌజింగ్ దిగ్గజం.. యాపిల్‌తో ఈ ఏడాది కోసం లక్షా పదివేల కోట్లతో ఒప్పందం చేసుకుంది.
2021లో తయారైన ఐఫోన్, ఐప్యాడ్, మాక్‌లలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ కోసం 15 బిలియన్ల డాలర్ల(లక్షా పదివేల కోట్లకు పైనే) ఒప్పందం చేసుకుంది గూగుల్. తద్వారా సఫారీ బ్రౌజర్‌లో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌గా పని చేయనుంది. మైక్రోసాఫ్ట్-బింగ్ పోటీని తట్టుకునేందుకు ప్రతీ ఏడాది ఇలా భారీ ఒప్పందాలు చేసుకుంటూ పోతోంది గూగుల్. కిందటి ఏడాది ఈ ఒప్పందం విలువ పది బిలియన్ల డాలర్లు ఉండగా.. 2019లో 8 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇక వచ్చే ఏడాది ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని(18-20 బిలియన్ డాలర్ల మధ్య) అంచనా వేస్తున్నారు టెక్ నిపుణులు.
ఇక ఐవోస్ డివైజ్‌లపై యాపిల్-గూగుల్ డీల్ గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. విస్తరణకు మిగతా బ్రౌజింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు అవకాశం ఇవ్వాలంటూ యూకే కాంపిటీషన్ అండ్ మార్కెట్ అథారిటీ అభిప్రాయపడింది.
హాట్ న్యూస్: అలర్ట్- ఫోన్ నుంచి ఈ యాప్స్ తీసేయండి
ఆఖరి రోజు:ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్..!
Comments
Please login to add a commentAdd a comment