ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్.. గూగుల్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు పోటీగా యాపిల్ సొంతంగా సెర్చ్ ఇంజిన్‌ను లాంచ్ చేయనుంది. అందుకు యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పలు రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి.
యాపిల్ సంస్థ ఐఫోన్‌తో స్మార్ట్ ఫోన్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతుంటే.. వరల్డ్ వైడ్‌గా ఎన్ని సెర్చ్ ఇంజిన్‌లు ఉన్నా..సెర్చ్ ఇంజిన్‌లో గూగుల్ నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో యాపిల్ సొంతంగా వెబ్ సెర్చ్ ఇంజిన్‌ను తయారు చేస్తుందని, త్వరలోనే విడుదల చేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
యాపిల్ సెర్చ్ ఇంజిన్ విడుదల ఎప్పుడంటే
యాపిల్ సెర్చ్ ఇంజిన్‌ను విడుదల చేస్తుందంటూ గతంలో అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పలుమార్లు ప్రముఖ టెక్ బ్లాగర్ రాబర్ట్ స్కోబుల్ వరుస ట్విట్‌లతో హోరెత్తించాడు. కొత్త సెర్చ్ ఇంజిన్ త్వరలో రాబోతుంది. యాపిల్ వర్చువల్ అసిస్టెంట్ 'సిరి' మరింత స్మార్ట్‌గా తయారవుతుందంటూ ట్విట్‌లలో హైలెట్ చేశాడు.
తాజాగా రాబర్ట్ యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ -2023లో ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజం తన సెర్చ్ ఇంజిన్‌ను విడుదల చేయనుందని ఊదరగొట్టేస్తున్నాడు. టెక్ రాడర్ సమాచారం ప్రకారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగబోయే డబ్ల్యూడబ్ల్యూడీసీ-2022 లో అత్యంత ఖరీదైన ప్రొడక్ట్ ఇదేనని అన్నాడు. లేదంటే వచ్చే ఏడాది జనవరి నెలలో యాపిల్ కొత్త సెర్చ ఇంజిన్ గురించి ప్రకటన విడుదల కావొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment