![KCR Paid Tribute on The Occasion of Dasarathi Birth Anniversary - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2020/07/21/kcr.jpg.webp?itok=yOV3vSPf)
సాక్షి, హైదరాబాద్: దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాహితీ యోధుడని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. దాశరథి కృష్ణమాచార్యుల 96వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. దాశరథి రగిలించిన చైతన్య స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించేందుకు కావాల్సిన సంకల్ప బలాన్ని ఇచ్చిందని కొనియాడారు. సాహిత్యరంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా అధికారికంగా ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ, అవార్డులను ప్రదానం చేస్తోందని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దాశరథి అందించిన ఉద్యమ చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment