అంబేద్కర్కి వైఎస్ జగన్ నివాళి | YS Jagan mohan reddy bows to Dr. Babasaheb Ambedkar on his birth anniversary | Sakshi
Sakshi News home page

అంబేద్కర్కి వైఎస్ జగన్ నివాళి

Published Tue, Apr 14 2015 10:50 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

అంబేద్కర్కి వైఎస్ జగన్ నివాళి - Sakshi

అంబేద్కర్కి వైఎస్ జగన్ నివాళి

నెల్లూరు: నెల్లూరు జిల్లా నాయుడు పేటలో మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అంబేద్కర్ విగ్రహానికి గజ మాల వేసి నివాళులు అర్పించారు.

వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మహహూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజెందర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

'కుల, మత, లింగ వివక్ష లేని నాడే అంబేద్కర్కి నిజమైన నివాళి, నేటి నుంచే ఆరోజుకోసం కృషి చేద్దాం' అని జగన్ మోహన్ రెడ్డి ట్విట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement