సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ప్రగతిభవన్ నుంచి గన్‌పార్క్‌కు చేరుకున్న ఆయన అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ప్రగతిభవన్‌లో కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. (కేసీఆరే స్టార్)
అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అసెంబ్లీలో ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తదితరులు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభ వద్ద పోచారం, శాసనమండలి వద్ద గుత్తా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుగా అమరవీరులకు నివాళి అర్పించి, అనంతరం పతాకావిష్కరణ చేశారు. (ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది)
తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నివాళి
Published Tue, Jun 2 2020 9:12 AM | Last Updated on Tue, Jun 2 2020 9:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment