Silk Smitha Birth Anniversary Special Story: సిల్క్ స్మిత అసలుపేరు విజయలక్ష్మీ. 1960 డిసెంబర్2న ఏలూరులో జన్మించిన ఆమె నాల్గవ తరగతి వరకు చదువుకుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసింది. పదిహేనేళ్లకే పెళ్లి చేసేశారు. అయితే భర్త, అత్తమామలు వేధింపులతో ఇల్లు వదిలి పారిపోయింది. నటనపై ఉన్న ఇష్టంతో మద్రాసుకి వెళ్లి తొలుత టచప్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ‘ఘరానా గంగులు’సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. చదవండి: Silk Smitha: సిల్క్‌స్మిత మరణం.. ఇప్పటికీ ఓ మిస్టరీనే!
ఎన్టీఆర్ ‘నా దేశం’ చిత్రంలో “నేనొక నెత్తురు దీపం…”సాంగ్‌లో నర్తించిన సిల్క్..ఆ తర్వాత ఐటెం గర్ల్‌గా గుర్తింపు పొందింది. అప్పటి నుంచి దాదాపు టాప్ హీరోలందరి సినిమాల్లో సిల్క్ స్మిత డ్యాన్స్ స్టెప్పులు ఉండాల్సిందే అనేంతలా క్రేజ్ దక్కించుకుంది. అప్పటికే జ్యోతిలక్ష్మీ, జయమాలిని ఐటెమ్ సాంగ్స్‌తో చెలరేగిపోతున్నా సిల్క్ స్మిత తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.
మత్తు కళ్లతో సిల్వర్ స్క్రీన్‌కి హాట్ ఇమేజ్ తీసుకువచ్చింది. ఆ సమయంలోనే ‘గూండా, ఛాలెంజ్’, బాలకృష్ణ ‘ఆదిత్య 369’వంటి చిత్రాలలోనూ కీలక పాత్రల్లోనూ నటించి సత్తా చాటింది. కానీ అర్థాంతరంగా 1996 సెప్టెంబరు 23న ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సిల్క్ జీవితం ఆధారంగానే ఏక్తాకపూర్ ‘ద డర్టీ పిక్చర్’అనే సినిమా సైతం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సిల్క్‌స్మిత చనిపోయి నేటికి 25ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ అభిమానులు ఆమెను గుర్తుచేసుకుంటున్నారు.
(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: Akhanda Movie: జై బాలయ్య నినాదాలతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ..
Comments
Please login to add a commentAdd a comment