ఆటైనా, అభినయం అయినా సిల్క్ స్మిత స్టైలే వేరు.. ఆమె సినిమాలో ఉంటే ఆ నిర్మాతలకు కాసుల పంటే, థియేటర్లు హౌస్ ఫుల్. ఈమె బయోపిక్ కూడా తెరపై మెరిసింది, నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఆమె పాత్రలో నటించిన విద్యాబాలన్‌కు జాతీయ అవార్డు వరించింది. అంత చరిత్ర కలిగిన సిల్క్ స్మిత ఇప్పుడు భౌతికంగా లేకపోయినా, ఆమె నటిగా చిరంజీవే. ఎందుకంటే అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సిల్క్ స్మిత 63వ జయంతి ఈ సందర్భంగా తమిళనాడులో ఓ అభిమాని 100 మందికి బిర్యానీ పంచిపెట్టి ఆమైపె తరగని అభిమానాన్ని చాటుకున్నాడు.
సిల్క్‌పై బయోపిక్స్..
కాగా సిల్క్ స్మిత జీవిత చరిత్రతో బాలీవుడ్‌లో డర్టీ పిక్చర్ పేరుతో చిత్రం రూపొంది సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అందులో నటి విద్యాబాలన్ నటించారు. అదే విధంగా మలయాళంలోనూ ఒక చిత్రం తెరకెక్కింది. అందులో నటి సనాఖాన్ నటించారు. తాజాగా సిల్క్ అన్ టోల్డ్ పేరుతో మరో చిత్రం తెరకెక్కుతోంది. ఇలా తరం మారుతున్నప్పుడల్లా దర్శక నిర్మాతలు పేరును, డబ్బును సంపాదించుకునేంత ఖ్యాతిని సిల్క్ స్మిత సంపాదించుకుని చాలా త్వరగా వెళ్లిపోయారు. ఈమెను దర్శక నిర్మాతలు ఎక్కువగా శృంగార తారగానే చూశారు గానీ సిల్క్ స్మితలో మంచి నటి ఉన్నారు.
శృంగార పాత్రల్లో నటించడం మానేసి..
అలైగళ్ ఓయ్ వదిల్లై చిత్రంలో ఆ విషయం నిరూపణ అయ్యింది. ఈ విషయాన్ని దివంగత ముఖ్యమంత్రి, నటుడు ఎంజీఆర్ పేర్కొన్నారు. ఇకపై సిల్క్ స్మిత శృంగార పాటల్లో నటించడం మానేసి మంచి క్యారెక్టర్‌లలో నటించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటి సిల్క్ స్మిత జయంతి సందర్భంగా లోకనాయకుడు కమల్ హాసన్ గతంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో కమల్ హాసన్ మాట్లాడుతూ ‘నేను కథానాయకుడిగా నటించిన మూండ్రామ్ పిరై చిత్రంలో ముందుగా నటి సిల్క్ స్మిత పాట లేదు. అయితే చిత్ర వ్యాపారం కోసం ఆమె పాటలు చేర్చారు. నేను ఆ పాటలో ఉండాల్సి వచ్చింది.
(సిల్క్ స్మిత ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సిల్క్‌కు డ్యాన్స్ చేయడం రాదు
అయితే చాలా తక్కువ ఖర్చుతో ఆ పాటను దర్శకుడు బాలు మహేంద్ర చిత్రీకరించారు. ఆ పాటకు ప్రభుదేవా తండ్రి సుందరం మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. సిల్క్ స్మిత చేయగలిగేంతగా ఆయన నృత్యాన్ని సమకూర్చారు. ఎందుకంటే సిల్క్ స్మితకు నిజంగానే డాన్స్ చేయడం రాదు. అయితే ఆమె ఇతరులను ఇమిటేట్ చేయడంలో ఖిలాడీ. అదే సమయంలో ఫ్యాషన్‌కు తగ్గట్టుగా దుస్తులను ధరించటం ఆమెకు ఇష్టం. ఆ విషయం గురించి నేను ఆమెకు చెప్పి అభినందించాను. చాలా కష్టాలు పడి ఎదిగిన నటి సిల్క్ స్మిత’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment