నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
తెలంగాణ ప్రాంతానికి దాస్య విముక్తి కల్పించిన నాయకుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని వాంకిడి అనే కుగ్రామంలో ఒక నిరు పేద చేనేత కుటుంబంలో 1915 సెప్టెంబర్ 27న బాపూజీ జన్మించారు. భూమికోసం, భుక్తికోసం, నిజాం సంస్థానంలో సుదీ ర్ఘకాలం కొనసాగిన సంగ్రామంలో జనానికి అండగా నిలిచారు. ఆయన ఇచ్చిన ‘జై తెలంగాణ‘ నినాదం ప్రజాబాహుళ్యాన్ని జాగృత పర్చింది.
1938లో తాను మెట్రిక్యులేషన్ చదువుతున్న ప్పుడే హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో చేరి పౌర హక్కుల ఉద్యమం, వందేమాతర ఉద్యమం, ఆంధ్ర మహా సభల్లో క్రియాశీలక పాత్ర పోషించి పలువురు జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ఆబిడ్స్ పోస్ట్ ఆఫీసుపై, కోఠిలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగురవేసి సంచలనం సృష్టించారు. నవాబుల పాలనలో నలిగి పోతున్న ప్రజానీకాన్ని రక్షించాలంటే మీర్–ఉస్మాన్ అలీఖాన్‌ను అంతమొందించడం ఒక్కటే మార్గమని భావించి షోలాపూర్, బొంబాయి, అహ్మదా బాద్‌లలో ‘పహాడీ’ (కొండ) పేరుతో ప్రచ్ఛన్న కార్యకలాపాలు నిర్వహించి నిజాం రాజుపై బాంబు దాడికి వ్యూహం రచించారు.
రెండు దఫాలు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. ముల్కీ ఉద్యమం నుండి మొన్నటి తెలంగాణ ఉద్యమం దాక ముందుండి నడిపించారు. కార్మికులను, చేతివృత్తుల వారిని సమీకరించి సహకార రంగం పరిధి లోకి తీసుకొచ్చారు. బీసీల స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కాకా కాలేల్కర్ కమిటీ, మండల కమిషన్‌లకు జనాభా దామాషా ప్రకారం రేజర్వేషన్లతో పాటు రాజ్యాధికారంలో బీసీలకు వాటా దక్కేలా చూడాలని నివేదించారు. ప్రభుత్వాలు సమగ్ర కుల గణన చేపట్టి ఆ దిశలో ముందడుగు వేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి. – డా. వంగర భూమయ్య, పాలమూరు విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులు
ఇవి చదవండి: భారత విప్లవ ప్రతీక!
Comments
Please login to add a commentAdd a comment