konda lakshman bapuji
-
Konda Laxman Bapuji: ఉద్యమాల కొండ..
తెలంగాణ ప్రాంతానికి దాస్య విముక్తి కల్పించిన నాయకుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని వాంకిడి అనే కుగ్రామంలో ఒక నిరు పేద చేనేత కుటుంబంలో 1915 సెప్టెంబర్ 27న బాపూజీ జన్మించారు. భూమికోసం, భుక్తికోసం, నిజాం సంస్థానంలో సుదీ ర్ఘకాలం కొనసాగిన సంగ్రామంలో జనానికి అండగా నిలిచారు. ఆయన ఇచ్చిన ‘జై తెలంగాణ‘ నినాదం ప్రజాబాహుళ్యాన్ని జాగృత పర్చింది.1938లో తాను మెట్రిక్యులేషన్ చదువుతున్న ప్పుడే హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో చేరి పౌర హక్కుల ఉద్యమం, వందేమాతర ఉద్యమం, ఆంధ్ర మహా సభల్లో క్రియాశీలక పాత్ర పోషించి పలువురు జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ఆబిడ్స్ పోస్ట్ ఆఫీసుపై, కోఠిలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగురవేసి సంచలనం సృష్టించారు. నవాబుల పాలనలో నలిగి పోతున్న ప్రజానీకాన్ని రక్షించాలంటే మీర్–ఉస్మాన్ అలీఖాన్‌ను అంతమొందించడం ఒక్కటే మార్గమని భావించి షోలాపూర్, బొంబాయి, అహ్మదా బాద్‌లలో ‘పహాడీ’ (కొండ) పేరుతో ప్రచ్ఛన్న కార్యకలాపాలు నిర్వహించి నిజాం రాజుపై బాంబు దాడికి వ్యూహం రచించారు.రెండు దఫాలు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. ముల్కీ ఉద్యమం నుండి మొన్నటి తెలంగాణ ఉద్యమం దాక ముందుండి నడిపించారు. కార్మికులను, చేతివృత్తుల వారిని సమీకరించి సహకార రంగం పరిధి లోకి తీసుకొచ్చారు. బీసీల స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కాకా కాలేల్కర్ కమిటీ, మండల కమిషన్లకు జనాభా దామాషా ప్రకారం రేజర్వేషన్లతో పాటు రాజ్యాధికారంలో బీసీలకు వాటా దక్కేలా చూడాలని నివేదించారు. ప్రభుత్వాలు సమగ్ర కుల గణన చేపట్టి ఆ దిశలో ముందడుగు వేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి. – డా. వంగర భూమయ్య, పాలమూరు విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులుఇవి చదవండి: భారత విప్లవ ప్రతీక! -
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల స్టేటస్ ఏమిటో 4 వారాల్లోగా చెప్పండి.. : రాష్ట్ర హైకోర్టు ఆదేశం
-
కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప సామాజిక వేత్త
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప సామాజిక వేత్త అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ 106వ జయంతి ఉత్సవాలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర ఉద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి బాపూజీ అని దత్తాత్రేయ కొనియాడారు. అలాంటి వ్యక్తితో కలసి పనిచేసే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బాపూజీ తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను, గొప్పదనాన్ని భవిష్యత్ తరాలకు తెలిపే రీతిలో అధికారికంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కార్య క్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం పాల్గొన్నారు. స్పీకర్ నివాళి స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి వేడుక శాసనసభ భవనంలోని ఆడిటోరియం హాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు పాల్గొన్నారు. -
కొండా లక్ష్మణ్ ఆదర్శప్రాయుడు
వచ్చే విద్యా సంవత్సరంలో నియోజకవర్గానికొక బీసీ గురుకులం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విద్యారణ్యపురి : తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశయాలను సాధించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి బాపూజీ అని ఆయన కొనియాడారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని లష్కర్‌బజార్‌లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోయడలో బాపూజీ పోషించిన పాత్ర కీలకమైందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీతో పాటు కొమురం భీమ్, దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు, ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ వంటి గొప్ప వ్యక్తులను అధికారికంగా గౌరవిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక భవన నిర్మాణం, శిలా విగ్రహం ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌కు విన్నవించనున్నట్లు తెలిపారు. తెలంగాణ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయానికి బాపూజీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి ఒక బీసీ గురుకులాన్ని మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది 119 బీసీ గురుకులాలను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారన్నారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్ వాకాటి కరుణ, వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, బానోతు శంకర్‌నాయక్, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, బీసీ సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నర్సింహస్వామి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జె.రంగారెడ్డి, బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్ ,తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.