Allu Ramalingaiah Statue: Allu Arjun And Allu Sirish Unveil Allu Ramalingaiah Statue - Sakshi
Sakshi News home page

Allu Arjun: అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్

Published Fri, Oct 1 2021 11:21 AM | Last Updated on Fri, Oct 1 2021 1:16 PM

Allu Arjun Unveils Allu Ramalingaiahs Statue On His 100th Birth Anniversary - Sakshi

Allu Ramalingaiah Statue: లెజెండరీ నటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లు బ్రదర్స్‌ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో అల్లు అర్జున్‌,బాబీ, శిరీష్‌లు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. అనంతరం  ఆయనకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ట్విట్‌ చేస్తూ.. మా తాత, పద్మశ్రీ అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఆయన మాకు ఎంతో గర్వ కారణం. అల్లు స్టూడియోస్‌ ప్రయాణంలో ఆయన ఎప్పుడూ ఉంటారు అంటూ ఫోటోలను షేర్‌ చేశారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ఫ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌. ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబర్‌25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చదవండి: కొండపొలం నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement