Allu Ramalingaiah
-
నాన్నగారి ప్యాషన్ మమ్మల్ని నిలబెట్టింది
‘‘మా నాన్నగారు (అల్లు రామలింగయ్య) సినిమా ఇండస్ట్రీలో పని చేయాలనే లక్ష్యంతో పెట్టె సర్దుకుని అమ్మని ఊళ్లోనే వదిలేసి చెన్నై వెళ్లారు. ఆ ప్యాషనే ఈరోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. దాన్ని ప్యాషన్ అనో, పిచ్చి అనో అనుకున్నా పర్లేదు. అలాంటి పిచ్చి ఉన్న రాజీవ్ అంటే నాకు తెలియని ప్రేమ, అభిమానం. ఆయన చిత్ర పరిశ్రమలోకి రావడం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. యానిమేషన్ రంగంలో గుర్తింపు సంపాదించుకున్న గ్రీన్ గోల్డ్ గ్రూప్ అధినేతలు రాజీవ్ చిలక, శ్రీనివాస్ చిలక ‘చిలకప్రోడక్షన్’ బ్యానర్ పేరుతో చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ బ్యానర్ లోగోను నిర్మాతలు అల్లు అరవింద్, శరత్ మరార్ విడుదల చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘రాజీవ్ చేసిన ‘చోటా భీమ్’ని నేను తెలుగులో రిలీజ్ చేశాను. రాజమౌళి దగ్గరున్న ప్యాషన్‌ని రాజీవ్లో చూశాను’’ అన్నారు. ‘‘సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న శ్రీనివాస్, రాజీవ్‌లకు అభినందనలు’’ అన్నారు శరత్ మరార్. రాజీవ్ చిలక మాట్లాడుతూ– ‘‘లయన్ కింగ్’ సినిమా చూసి ఇలాంటి సినిమాను ఇండియాలో ఎందుకు తీయకూడదు?అనిపించింది. అలాంటి యానిమేషన్ సినిమా చేయాలనే లక్ష్యంతోనే ‘గ్రీన్ గోల్డ్ సంస్థ’ని ప్రారంభించాం. మా చిలకప్రోడక్షన్లో ప్రస్తుతానికి రెండు తెలుగు సినిమాలు, హిందీలో ఓ చిన్న పిల్లల సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు. ‘ ‘2004లో కృష్ణ యానిమేషన్ సిరీస్‌ను ఆరంభించాం. 2008లో ఆరంభించిన ‘చోటా భీమ్’ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ ప్రయాణంలో భాగంగా సినిమాలు నిర్మించడానికి చిలకప్రోడక్షన్స్ని స్టార్ట్ చేశాం’’ అని శ్రీనివాస్ చిలక అన్నారు. -
Allu Business Park Launch Pics: అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ (ఫొటోలు)
-
అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ
తెలుగు సినిమా గర్వించే లెజెండరీ సీనియర్ నటులు, దివంగత పద్మశ్రీ డా.అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదివారం ఆయన 101వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు బిజినెస్ పార్క్‌లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని హీరో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య కుమారుడు, నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘వెయ్యి సినిమాలకుపైగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటులు నాన్నగారు. తనదైన నటనతో యాభై ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ, హీరో అల్లు శిరీష్‌తో పాటు అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..
మెగాస్టార్ చిరంజీవి.. అందరిలానే రాఖీ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. చెల్లెళ్లు ఇద్దరు వచ్చి ఈయనకు రాఖీ కట్టారు. ఆ వీడియోని తన ఇన్‌స్టా, ట్విట్టర్లో షేర్ చేయగా, అభిమానులు తెగ లైకులు కొట్టేస్తున్నారు. అంతా బాగానే ఉంది. అయితే ఆ వీడియో చూస్తే మీకు ఓ సీక్రెట్ తెలుస్తుంది. చిరు పూజగదిలో దేవుళ్ల చిత్రపటాలతో పాటు ఓ ఇద్దరి వ్యక్తుల ఫొటోలు స్పెషల్‌గా ఉన్నాయి. ఇంతకీ ఆ ఫొటోలు ఎవరివి? (ఇదీ చదవండి: సమంతను మోసం చేసిన మేనేజర్.. ఎంతో నమ్మితే, చివరకు ఇలా..) చాలామంది ఓ స్థాయికి వచ్చిన తర్వాత దానికి కారణమైన వాళ్లని మర్చిపోతుంటారు. కానీ చిరంజీవి అలా అస్సలు చేయలేదు. జన్మనిచ్చిన తండ్రి కొణిదెల వెంకట్రావుతో పాటు నటుడిగా తన ఎదుగుదలకు కారణమైన అల్లు రామలింగయ్యని అస్సలు మర్చిపోలేదు. అవును మీరు ఊహించింది కరెక్టే. వీళ్లిద్దరి ఫొటోలనే తన ఇంట్లో పూజగదిలో పెట్టుకున్నాడు. అంటే వాళ్లని దేవుళ్లతో సమానంగా పూజిస్తున్నారు. తాజాగా రాఖీ పండగ సందర్భంగా చిరు షేర్ చేసిన ఫొటోలు, వీడియోల వల్ల ఈ విషయం బయటపడింది. దీంతో చిరు.. తండ్రి-మామకు ఇస్తున్న గౌరవం చూసి ఫ్యాన్స్, నెటిజన్స్ మురిసిపోతున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యే 'భోళా శంకర్' సినిమాతో వచ్చిన చిరు.. ఘోరమైన డిజాస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం చిరు రెండు కొత్త మూవీస్ ఒప్పుకొన్నారు. ఇందులో ఒకటి కూతురు సుస్మిత నిర్మిస్తున్న ప్రాజెక్టుతో పాటు, యంగ్ డైరెక్టర్ వశిష్ట్ తీస్తున్న మరో చిత్రం ఉంది. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు) View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
బన్నీ విషయంలో లెక్క తప్పిన అల్లు రామలింగయ్య
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం అయిన తెలుగు ఇండియన్ ఐడల్- 2 గ్రాండ్ ఫినాలే కోసం ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు అయ్యారు. సంగీత ప్రియుల మనుసు దోచుకుంది ఈ షో. ముఖ్య అతిథిగా వచ్చిన బన్నీ.. తన చిన్ననాటి సంగతులను పంచుకున్నారు. (ఇదీ చదవండి: త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్) ''తాత (అల్లు రామలింగయ్య) గ్రాండ్ చిల్డ్రన్లలో నేను చాలా క్వయిట్గా ఉండేవాడిని... మిగిలిన వారితో పోలిస్తే వీడు మొద్దు, భవిష్యత్త్ ఎలా ఉంటుందో ఏమిటో అనుకున్నాడేమో..! ఆ రోజుల్లోనే నా పేరుతో ఒక ఇన్స్యూరెన్స్ చేయించాడు. నేను నామినీగా ఉంటడంతో రూ.10 లక్షలు నాచేతికి వచ్చాయి. పిల్లలు క్వయిట్గా ఉంటే వారి భవిష్యత్‌పై తల్లిదండ్రులకు కూడా సందేహాలు ఉంటాయి. కానీ వారిలో దాగి ఉన్న హిడెన్ టాలెంట్‌ను గుర్తించి బయటకు తీస్తే వారి భవిష్యత్‌కు ఎదురే ఉండదు. అల్లు రామలింగయ్య గారికి 8 మంది మనమలు, మనమరాళ్లు.. వారందరిలో మొదట సంపాదించింది నేనే'' అని అల్లు అర్జున్ తెలిపారు. (ఇదీ చదవండి: రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. ఫోటోలు వైరల్!) తాత బీమా గురించి చెబుతూనే.. తండ్రి (అల్లు అరవింద్) గురించి కూడా మరో ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాడు బన్నీ. ''మేం చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన రోజుల్లో ఒకేసారి మా లైఫ్ టర్న్ తీసుకుంది. హైదరాబాద్‌కు మాకన్నా ముందే నాన్న షిఫ్టయిపోయారు… తర్వాత మేం ఇక్కడికి చేరుకున్నాం. ఓ రోజు మేం ఇద్దరమే ఉన్నప్పుడు హఠాత్తుగా నన్ను హగ్ చేసుకుని, నువ్వు రాబోయే రోజుల్లో హీరోగా మంచి పేరు తెచ్చుకుంటావు అన్నాడు ప్రేమగా… తన గురించి చెబుతూ పోతే ఒక రాత్రి సరిపోదు… నాకు దేవుడు అంటే మా నాన్నే.. నేను ఏమీ అడగకుండానే అన్నీ నాన్నే ఇచ్చాడు'' అంటూ ఎమోషనల్‌గా చెబుతూ పోయాడు బన్నీ. తన మాటల్లో హిపోక్రసీ ఏమీ కనిపించలేదు, వినిపించలేదని… చాలా నేచురల్ ఫ్లోతో చెప్పారని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. -
ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించారు అల్లు
‘‘ఆరోగ్యకరమైన హాస్యాన్ని చేరువ చేయ డానికి అల్లు రామలింగయ్యగారు చేసిన కృషి మరువలేనిది’’ అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హాస్య నటుడు అల్లు రామలింగయ్య జీవన ఛాయ చిత్ర మాలిక పుస్తకాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ– ‘‘హావభావాల ద్వారా తన నటనలో హాస్యాన్ని పండించిన సిద్ధహస్తుడు రామలింగయ్యగారు. సమాజంలో వ్యక్తులను అధ్యయనం చేస్తూ ఆయన సాధించిన గొప్ప కళ హాస్యం పండించడమే. సమాజానికి దిశానిర్దేశం చేసే విధంగా కళాకారులు చొరవ చూపాలి. ప్రజలను ఆకర్షించడానికి హాస్య రసాన్ని ఉపయోగించుకుంటూనే ఆలోచింపజేసే విధంగా సమాజం పట్ల ఓ బాధ్యతను ప్రజల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. పుస్తక సంపాదకులు మన్నెం గోపీచంద్, విషయాలను కూర్పు చేసిన వెంకట సిద్ధారెడ్డి, పరిశోధన చేసిన శ్రీకాంత్ కుమార్‌కు అభినందనలు’’ అన్నారు. -
అల్లూరి రామలింగయ్య 100వ జయంతి వేడుకలు.. బుక్ లాంఛ్ కార్యక్రమం( ఫోటోలు)
-
Allu Studios Launch Photos: అల్లు స్టూడియోని ప్రారంభించిన చిరంజీవి (ఫొటోలు)
-
అల్లు స్టూడియోను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి
-
అల్లు స్టూడియోని ప్రారంభించిన చిరంజీవి
అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అల్లు స్టూడియోని ప్రారంభించారు. గండిపేటలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఈ స్టూడియోని నిర్మించారు. అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు ఫ్యామిలీ పాల్గొంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా వారికి నా నివాళి.. ఎంతో మంది నటులున్నా కొద్దిమందికి మాత్రమే ఘనత, అప్యాయత లభిస్తుంది. రామలింగయ్య గారి బాటలో అరవింద్, బన్నీ శిరీష్ ,బాబి విజయవంతంగా కొనసాగుతున్నారు. నాడు నటుడిగా ఎదగాలని రామలింగయ్య గారి ఆలోచనే నేడు ఓ వ్యవస్ద గా అల్లు కుటుంబం ఎదిగింది. అరవింద్ అగ్ర నిర్మాతగా , మనవలకు స్టార్డమ్ దక్కింది. అల్లు స్టూడియో లాభాలను తీసుకురావాలి. ఇది అల్లు వారికి కృతజ్ఞత , గుర్తింపు గా ఉండాలని నిర్మించినట్లుంది. అల్లు ఫ్యామిలీ లో భాగం అవ్వటం నాకు ఆనందంగా ఉంది’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘ మా నాన్నగారు చనిపోయి 18 ఏళ్లయింది. అనేక మధ్యమల్లో ఇప్పటికీ ఆయన కన్పిస్తున్నారు.స్టూడియో అనేది ఓ జ్ఞాపిక.. లాభాపేక్ష కోసం కట్టింది కాదు. గీతా ఆర్ట్స్ , అల్లు స్టూడియో , ఆహా ఓటిటి అన్నింటిని నా కుమారులకు అప్పగిస్తున్నాను’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘అల్లు స్టూడియోస్ ను ఆవిష్కరించిన చిరంజీవి గారికి ధన్యవాదాలు. మా తాతగారి శత జయంతి ఓ ప్రత్యేక మైన రోజు. స్టూడియో అనేది లాభాపేక్ష కోసం పెట్టలేదు. తాతగారి కోరిక, వారి జ్ఞాపకంగా స్టూడియో పెట్టాం. ఇక్కడ చిత్రీకరణలు జరిగితే తాతాగారికి ఆనందంగా ఉంటుంది. తాతగారు చనిపోయి18 ఏళ్లయినా, మా నాన్న గారికి వారిపై ప్రేమ పెరుగుతోంది. నాపై అభిమానాన్ని చూపిస్తున్న మెగాభిమానులకు, నా ఆర్మీ కి ధన్యవాదాలు’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Allu Ramalingaiah: హాస్య దళానికి కులపతి అల్లు రామలింగయ్య
తెలుగు సినిమా చరిత్రలో భావి తరాల వారిని ప్రభావితం చేయగలిగిన నటీనటులు వేళ్ళమీద లెక్క పెడితే అందులో తప్పనిసరిగా నిలిచే పేరు అల్లు రామలింగయ్య. హాస్యంలోంచి విలనీ, విలనీ లోంచి హాస్యం సాధించిన విశిష్ట నటుడు. 1953లో తొలిచిత్రం పుట్టిల్లులో పోషించిన శాస్త్రులు, వద్దంటే డబ్బులో టీచరు, దొంగరాముడులో హాస్టలు వార్డెను పాత్రల్ని పునాదులుగా చేసుకుని భాగ్యరేఖ, మాయాబజార్ చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 2004 నాటికి 1,000కి పైగా చిత్రాల్లో విలక్షణ భూమికల్ని పోషించారు. ‘పుట్టిల్లు’, ‘మాయాబజార్’లలోని శాస్త్రులు పాత్ర ఆకట్టు కుంది. అందుకే ఆ తర్వాత అనేక చిత్రాల్లో శాస్త్రి పాత్ర ఆయన్నే వరిచింది. ఒక్కో చిత్రంలో ‘శాస్త్రి’ పాత్ర ఒక్కోలా ఉండడమే అల్లు సాధించిన పరిపూర్ణత. ఆ పాత్రకు తాను నిజ జీవితంలో చూసిన సూరి భొట్ల నారాయణమూర్తి స్ఫూర్తి అనీ, అయితే ఆయా చిత్రాల్లో పాత్రౌచిత్యాన్ని బట్టి రసాల కూర్పు చేసుకునే వాడిననీ ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అలాగే హాస్య పాత్రలు పోషించాల్సి వచ్చినప్పుడల్లా మునిమాణిక్యం నర సింహరావు, భమిడిపాటి కామేశ్వరరావు వంటి వారి రచనలు చదివి స్ఫూర్తి చెందేవాడిననీ, ఆ ఇద్దరూ తన అభిమాన రచయితలనీ అల్లు పేర్కొన్నారు. ఎప్పుడో దొంగ రాముడు షూటింగ్ సమయంలో అల్లు అప్రయత్నంగా డైలాగ్ మరిచి పోవడం వలన వెలువడిన ’ఆమ్యామ్యా’ని, బుద్ధిమంతుడు, బాలరాజు కథ, అందాల రాముడు చిత్రాల్లో చెప్పగా చెప్పగా ‘ఆమ్యామ్యా’ కాస్తా తెలుగు నాట లంచానికి పర్యాయపదంగా స్థిరపడిపోయి, దినపత్రికల్లో పతాక శీర్షిక అయ్యింది. ముళ్ళపూడి వెంకట రమణని ఓ జర్నలిస్ట్ ‘ఆమ్యామ్యా’ సృష్టికర్త మీరే కదా?! అని ప్రశ్నస్తే ‘ఆమ్యామ్యా సృష్టికర్త అల్లు రామలింగయ్య గారు, ఆమ్యామ్యా మీద పేటెంట్ హక్కులన్నీ వారివే’ అని ధృవీకరించారు. మూగమనసులు సినిమా చేసేనాటికి వెయ్యి రూపాయలు పారితోషికం కాస్తా రెండువేల ఐదొందలు అయ్యింది. అల్లు 2003 నాటికి గానీ అత్యధిక పారితోషికం లక్ష రూపాయలు అందుకోలేదు. పాలకొల్లులో నాటకాలాడటం, స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని జైలు శిక్షలను అభవించడం, ప్రజా నాట్యమండలితో అనుబంధం వంటి అనేక దశలు రామలింగయ్య జీవితంలో ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. అల్లు జననీ జనకులు అల్లు వెంకయ్య, సత్తెమ్మ. మొత్తం ఏడుగురు సంతానం. క్షీరా రామలింగేశ్వరుడి పేరు ఆయనకు పెట్టారు. ఆ రోజుల్లో అధికారులు 40 ఏళ్ళని బర్త్ సర్టిఫికెట్ తీసుకువస్తే ప్రవేశ పరీక్ష రాయక్కర్లేదని ఆర్ఎంపీ సర్టిఫికెట్ ఇస్తామని చెబితే... ‘లేదు నాకు 39 ఏళ్ళే, నేను పరీక్ష రాస్తా’నని చెప్పి పరీక్ష రాసి ఉత్తీర్ణుడై హోమియోపతి డాక్టరుగా అల్లు సాధించిన కీర్తి ఇంతా అంతా కాదు. అల్లు నుండి వైద్యసేవలు అందుకున్నవారిలో నందమూరి బసవతారకంతో పాటు నూతన నటీనటుల వరకూ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. రాజ మండ్రిలో బోడా వెంకటరత్నం, చింతవారి జానకి రామయ్య తదితర ప్రముఖులతో స్థాపించబడిన హోమియో కళాశాల ఆర్థిక అస్థిర పరిస్థితుల్లో ఉంటే అల్లు రామలింగయ్య కృషితో ఆంధ్ర దేశంలో పేరెన్నిక గన్న కళాశాలగా ఎదిగింది. ప్రతి కార్యక్రమానికీ అర్ధాంగి అల్లు కనక రత్నం, పెద్ద కుమార్తె అల్లు నవ భారతీదేవి తప్పని సరిగా వచ్చేవారు, జాతీ యోద్యమంలో నూలు వడకడంలో జిల్లాలోనే మొదటి బహు మతి పొందిన కారణంగా కనకరత్నంని కోరి మరీ పెళ్ళా డారు రామలింగయ్య. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక కలిగిన సంతానం కావడంతో తమ కుమార్తెకు నవభారతి అని పేరు పెట్టుకున్నారంటే ఆయన దేశభక్తి ఏమిటో అర్థమవుతుంది. అల్లు అరవింద్ అగ్ర నిర్మాతగా అవతరించాక ‘నాన్నగారూ కొంచెం మీరు విశ్రాంతి తీసుకోవచ్చు కదా! ఇంకా నటించడం ఎందుకండి, సంవత్సరంలో మీరెంత సంపాదిస్తారో అంతా మీకు ఒక్కసారిగా నేనిచ్చేస్తాను’ అంటే... ‘నటించడంలోనే నా తృప్తి, సరదా, సంతోషం అన్నీ ఉన్నాయి, కాబట్టి ఓపిక నశించే వరకూ నటిస్తా. ఊపిరి ఉండే వరకూ నటిస్తా. మరణించాక కూడా నటిస్తా అన్నారు అల్లు రామలింగయ్య. ‘మరణించాక నటిస్తారా? అదెలాగ నాన్నగారూ?’ అన్నారు అరవింద్. ‘నేను పోయాక నన్ను పాడెమీద పడుకో బెట్టాక నువ్వా దృశ్యాలన్నిటినీ కెమెరాతో షూట్ చేయిస్తావని నాకు తెలుసు, అంటే నేను పోయాక కూడా నటిస్తున్నాననే కదా!’ అన్నారు రామలింగయ్య. ఇంత చెప్పీ అల్లు రామలింగయ్య బాల్యం నుండే అస్పృశ్యత, అంటరానితనంపై పోరాడారని చెప్పకపోతే తప్పే అవుతుంది. ‘కుక్కను జూచి గురుతర భక్తితో భైరవుండని ప్రేమ బరగుచుండి/ పాముని జూచి సుబ్బారాయుడని మ్రొక్కి పాలు పోసి పెంతురు భక్తి గల్గి/గద్దను జూచి విష్ణు వాహనం బనుచు కడు ముదముతో వినుతి జేసి/కోతి హనుమంతుడనుచు కూర్మి మీర తాకెదరు గాదె మమ్మేల తాకరయ్యా?! జంతువుల కన్నా అధముడా సాటి నరుడు’ అనే పద్యంతో ధ్వజమెత్తిన అల్లు రామలింగయ్య జీవిత పర్యంతమూ ఈ సిద్ధాంతానికే కట్టుబడిన మహర్షి! – చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్, రచయిత -
కలెక్టర్ సంబంధం కాదని చిరంజీవినే పెళ్లాడిన సురేఖ!
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. అన్న మాటను మెగాస్టార్ చిరంజీవి తు.చ. తప్పకుండా పాటించాడు. కష్టపడి నటుడైతే సరిపోదు, స్టార్ హీరోగా ఎదిగి ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకోవాలి అనుకున్నాడు. స్టార్ హీరో ఏంటి? ఏకంగా మెగాస్టార్‌గా ఎదిగాడు. ఇండస్ట్రీ పెద్దను కాదంటూనే చిత్రపరిశ్రమలోని బరువులను, బాధ్యతలను తన భుజాన వేసుకుని మోస్తుంటాడీ గ్యాంగ్ లీడర్. లెక్కలేనన్ని సాయాలు చేసి మనసున్న మారాజుగానూ పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజు చిరు పుట్టినరోజు కావడంతో మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్లో సంబరాలు మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే చిరంజీవి పెళ్లి స్టోరీ కోసం ఆరా తీస్తున్నారు అభిమానులు. మరి వారిది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన వివాహమా? చదివేద్దాం.. చిరంజీవి ఓసారి తన స్నేహితుడు బి.సత్యనారాయణను అతడి పెదనాన్నగారింట్లో దింపేశాడు. వాళ్ల పెదనాన్న ఎవరో కాదు అల్లు రామలింగయ్యగారు. అప్పటికే చిరు ఆయనతో కలిసి మూడు సినిమాల్లో నటించడంతో ఇంట్లోకి వెళ్లాడు. కానీ, అప్పుడు రామలింగయ్యగారు లేరు, అయితే తన స్నేహితుడు కాఫీ తాగి వెళ్దువు అన్నాడు. లోపల కాఫీ పెట్టింది సురేఖ. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదప్పుడు. కానీ చిరంజీవి వెళ్లాక ఆ అబ్బాయి ఎవరు? అని సురేఖ ఆరా తీయగా మనవూరి పాండవులులో నటించాడని చెప్పాడు బి.నారాయణ. తర్వాత అల్లు అరవింద్ తన గురించి డిస్కషన్ మొదలుపెట్టారు. అయితే అల్లు రామలింగయ్యగారికేమో వాళ్లమ్మాయిని కలెక్టర్కిచ్చి పెళ్లి చెయ్యాలనుండేదట. దాంతో కలెక్టర్‌కు ఇవ్వాలా? లేదా చిరంజీవికి ఇచ్చి పెళ్లి జరిపించాలా? అని అల్లు ఫ్యామిలీ ఆలోచనలో పడింది. సురేఖ ఎవరిని ఓకే అంటే వారితోనే పెళ్లి జరిపేద్దామని డిసైడయ్యారట. కానీ చిరంజీవి ఆంజయనేయభక్తుడు, చెడు అలవాట్లు లేవు, బాగా చదువుకున్నాడు, చాలా కష్టపడతాడు అని చాలామంది మంచి సర్టిఫికెట్ ఇవ్వడం, దీనికి తోడు మేకప్‌మెన్ జయకృష్ణ అల్లు రామలింగయ్యగారిని దగ్గరుండి కన్విన్స్ చేయడంతో తన పెళ్లికి మొదటి అడుగు పడిందని చిరంజీవి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సుమారు పది మంది నిర్మాతల దగ్గర చిరంజీవి గురించి తెలుసుకున్నాకే అతడికి సురేఖను ఇచ్చి చేయడానికి ఓకే అన్నాడట. కానీ అప్పుడే పెళ్లేంటని చిరంజీవి తటపటాయించినా ఆయన తండ్రి మాత్రం బలవంతంగా అతడిని పెళ్లిచూపులకు తీసుకెళ్లారు. మరోవైపు ‘మన వూరి పాండవులు’ చూసి ‘ఈ కళ్లబ్బాయి ఎవరో బావున్నాడు’. కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి కదా. మా అమ్మ యాక్టర్‌ను చేసుకుంది. నేనూ యాక్టర్‌ను చేసుకుంటే బాగుంటుంది అనుకుందట సురేఖ. అలా తొలిసారి కలిసినప్పుడు చూసుకోకపోయినా ఇద్దరికీ ముడిపడింది. ఫిబ్రవరిలో బ్రహ్మాండమైన ముహూర్తాలుండటంతో లగ్నపత్రిక రాసేశారు. అలా చిరంజీవి- సురేఖల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. ఈ ఆదర్శ దంపతులకు రామ్‌చరణ్‌తో పాటు శ్రీజ, సుష్మిత అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చదవండి: వన్ అండ్ ఓన్లీ 'మెగాస్టార్' చిరంజీవి ‘మెగాస్టార్’ అంటే ఓ బ్రాండ్.. మరి ఈ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? -
చిరిగిన బట్టలతో తాళి కట్టిన చిరంజీవి.. ఎందుకంటే
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. స్వయంకృషితో ఒక్కో మెట్టూ ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు.1978లో పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి తనదైన నటన, డ్యాన్సు స్టెప్పులతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. కెరీర్లో ఎదుగుతున్న సమయంలో ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం జరిగింది. అయితే అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న చిరుకి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం ఏంటని అల్లు రామలింగయ్య వద్ద చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారట. అయినా ఇవేం పట్టించుకోని ఆయన చిరంజీవి కష్టపడే తత్వాన్ని గుర్తించి ఎప్పటికైనా అతడు స్టార్ హీరో అవుతాడని నమ్మకంతో చెప్పేవారట. ఆ దిశగా చిరును ఎంతగానో ప్రోత్సహించేవారట. ఇక ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి నాటి సంగతులను గుర్తుచేసుకున్న చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'పెళ్లి సమయానికి తాతయ్య ప్రేమ లీలలు అనే సినిమా చేస్తున్నా. అందులో నూతన్ ప్రసాద్‌కు నాకూ కొన్ని కీలక సీన్లు ఉన్నాయి. అప్పటికి ఆయన ఫుల్ బిజీ ఆర్టిస్టు కావడంతో ఆయన డేట్స్ కోసం పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తుందేమోనని అనుకున్నాం. కానీ నిర్మాత షూటింగ్‌ని వాయిదా వేసి మా పెళ్లికి గ్యాప్ ఇచ్చారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చొనేటప్పటికి నా చొక్కా చిరిగిపోయింది. అది చూసి సురేఖ వెళ్లి బట్టలు మార్చుకోవచ్చుగా అని అడిగింది. ఏం బట్టలు చిరిగితే తాళి కట్టలేనా అని చెప్పి అలాగే కట్టేశాను' అంటూ ఆనాటి ఙ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. -
రాజమండ్రిలో పర్యటించిన చిరంజీవి
-
రాజమండ్రిలో మెగా స్టార్ చిరంజీవి
-
అల్లు రామలింగయ్య నాకు కూడా వైద్యం చేశారు: చిరంజీవి
Chiranjeevi At Allu Ramalingaiah Statue Unveiling : అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రాజమండ్రిలో పర్యటించారు. అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రాజమండ్రితో తనకు అనుబంధం ఉందని, అసలు మేకప్ వేసుకుందే రాజమండ్రిలో అని పేర్కొన్నారు. 'అల్లు రామలింగయ్యకు, నాకు గురు శిష్యుల అనుబంధం ఉంది. అల్లు రామలింగయ్య బహుముఖ ప్రఙ్ఞాశాలి. నటుడిగా కొనసాగుతూనే ఆయన హోమియోపతిపై పట్టు సాధించారు. నిత్య విద్యార్థిలానే అల్లు రామలింగయ్య ఎంతో కష్టపడ్డారు. ఎంతో మంది సేవ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్ వంటి సినీ ప్రముఖులు సహా ఎంతోమందికి ఆయన చికిత్స అందించారు. ఓసారి నేను కడుపునొప్పితో బాధపడుతుంటే ఆయన హోమియోపతి చికిత్సతో దాన్ని పూర్తిగా నయం చేశారు. ఇంతవరకు నాకు మళ్లీ ఆ సమస్య ఎదురుకాలేదు.ఇప్పటికీ నాతో పాటు నా పిల్లలు, వాళ్ల పిల్లలు కూడా హోమియోపతిని ఫాలో అవుతున్నాం' అని చిరంజీవి పేర్కొన్నారు. చదవండి: అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్ -
అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్
Allu Ramalingaiah Statue: లెజెండరీ నటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లు బ్రదర్స్ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో అల్లు అర్జున్,బాబీ, శిరీష్‌లు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. అనంతరం ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్ చేస్తూ.. మా తాత, పద్మశ్రీ అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఆయన మాకు ఎంతో గర్వ కారణం. అల్లు స్టూడియోస్ ప్రయాణంలో ఆయన ఎప్పుడూ ఉంటారు అంటూ ఫోటోలను షేర్ చేశారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్సుకుమార్ దర్శకత్వంలో పుష్ఫ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ డిసెంబర్25న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: కొండపొలం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల Unveiled the statue of my grandfather Padmashri #AlluRamalingaiah garu in ALLU Studios on his birth anniversary today along with #AlluBobby & @AlluSirish . He was our pride and will continue to be a part of our journey at Allu studios . pic.twitter.com/UHMZYvgiC3 — Allu Arjun (@alluarjun) October 1, 2021 -
అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి
సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): హీరో చిరంజీవి శుక్రవారం రాజమండ్రిలో పర్యటించారు. అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా స్థానిక అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాలలో నూతన భవనం కోసం చిరంజీవి రూ.2 కోట్లు నిధులను కేటాయించారు. చిరంజీవితో పాటు అల్లు అరవింద్ కుటుంబసభ్యులు, మాజీ ఎంపి మురళీమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: (చెన్నై నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వచ్చేవాణ్ణి) -
అల్లు రామలింగయ్య జయంతి; చిరు భావోద్వేగం
తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుత స్థాయిలో కామెడి పండించిన హాస్యపు రారాజు అల్లు రామలింగయ్య. వెండితెరపై ఆయన పూయించిన నవ్వుల జల్లు ఎల్లకాలం గుర్తిండిపోతుంది. హాస్యానికి చిరునామా అయిన అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్యకు తమ కుటుంబసభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన జయంతిని పురస్కరించుకుని అల్లు అరవింద్ కుటుంబం అల్లు రామలింగయ్య పేరు మీదుగా అల్లు స్టూడియోస్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని గండిపేట్ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో అల్లు స్టూడియోస్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అల్లు అరవింద్ తోపాటు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ పేర్కొన్నారు.. చదవండి: 'అల్లు' స్టూడియోస్ ప్రారంభం అదే విధంగా అల్లు రామలింగయ్య జయంతి రోజును పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ఆయన్ను మరోసారి స్మరించుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడిదయాలో భావోద్వేగ పోస్టు చేశారు. రామలింగయ్య కేవలం తనకు మామయ్య మాత్రమే కారని గొప్ప వ్యక్తి, డాక్టర్, స్వాతంత్ర్య సమరయోధుడు అని గుర్తు చేసుకున్నారు. ‘ఆయన పేరు గుర్తుకు రాగానే అందరి పెదాలపైన చిరునవ్వు మెదులుతుంది. మామయ్య గారు కేవలం అందరిని మెప్పించిన నటుడే కాదు. తియ్యని గుళికలతో వైద్యం చేసే హోమియోపతి డాక్టర్ కూడా. తత్వవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, నాకు మార్గదర్శి, గురువు, అన్నింటికి మించి మనసున్న మనిషి. ఈ 99వ పుట్టినరోజు నాడు ఆయన శత జయంతి వేడుక ఆయన జీవితాన్ని, జీవన విధానాన్ని ఆవిష్కరిస్తుందని ఆశిస్తున్నాను.’ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. (భావోద్వేగానికి లోనయిన అల్లు అర్జున్) Fondly remembering Shri.Allu Ramalingayya garu.. pic.twitter.com/xbQgHFImEj — Chiranjeevi Konidela (@KChiruTweets) October 1, 2020 -
'అల్లు' స్టూడియోస్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నట దిగ్గజంగా పేరొందిన అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులు గురువారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆయన కుటుంబసభ్యులు అల్లు స్టూడియోస్ ప్రారంభించారు. సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ స్టూడియో భారీస్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది. ఈ అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ పాల్గొన్నారు. తన ముగ్గురు తనయులతో కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. స్టూడియో ప్రారంభించడంపై అల్లు అరవింద్ త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. -
భావోద్వేగానికి లోనయిన అల్లు అర్జున్
తెలుగు చిత్ర పరిశ్రమలో నవ్వుల పూలు పూయించిన వ్యక్తి అల్లు రామలింగయ్య. తెలుగు వారి జివితాల్లో అల్లుకున్న అల్లు రామలింగయ్య వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన వారసుడు అల్లు అర్జున్ తాతయ్యను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘తాత మమ్మల్ని విడిచిపెట్టిన ఈ రోజు నాకు గుర్తుంది. ఆయన గురించి నాకు బాగా తెలుసు. జీవితంలో చాలా విషయాలు నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన కృషి, పట్టుదల, పోరాటాలకు నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఓ పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమాపై ఉన్న మక్కువ కారణంగానే మేమంతా ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాం’. అంటూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో స్నేహా రెడ్డి) I remember this day when he left us . I know more about him now than on that day. The more I experience many things in life the more I connect to his efforts , struggles and journey. We all are here today in this position because of this poor farmers passion for cinema 🙏🏼 pic.twitter.com/eoREJPY3Xr — Allu Arjun (@alluarjun) July 31, 2020 కాగా అల్లు రామలింగయ్య 1922 అక్టోబరు 1న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. తండ్రి వెంకయ్యకి ఏడుగురు సంతానం. వారిలో రామలింగయ్య నాలుగవ సంతానం. రామలింగయ్యకు సోదరి సత్యవతి. స్వతహాగా నాటక కళాకారుడైన అల్లు రామలింగయ్య ఊర్లు తిరుగుతూ నాటకాలు ప్రదర్శింస్తుండేవారు. ‘పుట్టిల్లు’ సినిమాతో తొలిసారి వెండితెరకు పరిచయమైన రామలింగయ్య వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. (బన్నీని ఒక్క ఛాన్స్ అడిగిన బాలీవుడ్ డైరెక్టర్) తన అద్భుత నటనతో హాస్యపు జల్లునే కాదు కామెడీ విలనిజాన్ని కూడా రక్తి కట్టించి తెలుగు వారి మనసుల్లో సుస్తిర స్థానాన్ని నిలుపుకున్నారు. దాదాపు 50 ఏళ్ల పాటు తన నటనతో కితకితలు పెట్టించి నవ్వించిన రామలింగయ్య 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. తెలుగు సినిమా వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఓ తపాలా బిళ్లను విడుదల చేశారు. అల్లు నటించిన చివరి సినిమా జై. 2004 జూలై 31న అల్లు రామలింగయ్య కన్నుమూశారు. -
అల్లు రామలింగయ్య 93వ జయంతి
-
బెజవాడలో చిరంజీవి 150వ సినిమా!
విజయవాడ : మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకు బెజవాడ వేదిక కానుంది. ఈ విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి, చిరంజీవే స్వయంగా వెల్లడించారు. అవకాశం వస్తే తన 150వ చిత్రానికి విజయవాడలోనే శ్రీకారం చూడతానని ఆయన ప్రకటించారు. ప్రముఖ హాస్యనటుడు దివంగత డాక్టర్ పద్మశ్రీ అల్లు రామలింగయ్య 93వ జయంతిని పురస్కరించుకుని జాతీయ పురస్కార ప్రదానోత్సవం నిన్న బెజవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా కళాక్షేత్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో మొట్టమొదటిసారిగా అల్లు విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందన్నారు. సినిమా రంగానికి విజయవాడ ఎప్పుడో రాజధాని అయ్యిందన్నారు. అల్లు రామలింగయ్య పేరుమీద ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారాన్ని ప్రముఖ సినీ రచయితలు పరుచూరి సోదరులు వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణలకు ప్రదానం చేశారు. -
బెజవాడలో అల్లు విగ్రహావిష్కరణ
విజయవాడ: హాస్యనటుడు అల్లు రామలింగయ్య వ్యక్తిత్వం అజరామరమని సినీ నటుడు, ఎంపీ చిరంజీవి చెప్పారు. రామలింగయ్య 93వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళా క్షేత్రం ప్రాంగణంలో ఆదివారం చిరంజీవి అల్లు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అల్లు కుమారుడు అరవింద్, హాస్య నటుడు బ్రహ్మానందం, వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, ్ల తదితరులు పాల్గొన్నారు. అల్లు జాతీయ పురస్కారాన్ని పరుచూరి బ్రదర్స్‌కు అందజేశారు. -
అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ
విజయవాడ: దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లు రామలింగయ్య అల్లుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు.