అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ | Allu Ramalingaiah bronze statue unveiled on his 101st birthday anniversary | Sakshi
Sakshi News home page

అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ

Published Mon, Oct 2 2023 4:16 AM | Last Updated on Mon, Oct 2 2023 4:16 AM

Allu Ramalingaiah bronze statue unveiled on his 101st birthday anniversary - Sakshi

విగ్రహావిష్కరణలో అల్లు రామలింగయ్య కుటుంబ సభ్యులు

తెలుగు సినిమా గర్వించే లెజెండరీ సీనియర్‌ నటులు, దివంగత పద్మశ్రీ డా.అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదివారం ఆయన 101వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు బిజినెస్‌ పార్క్‌లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని హీరో అల్లు అర్జున్‌ కుమారుడు అల్లు అయాన్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య కుమారుడు, నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ–‘‘వెయ్యి సినిమాలకుపైగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటులు నాన్నగారు. తనదైన నటనతో యాభై ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ, హీరో అల్లు శిరీష్‌తో పాటు అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement