birth anniversery
-
అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ
తెలుగు సినిమా గర్వించే లెజెండరీ సీనియర్ నటులు, దివంగత పద్మశ్రీ డా.అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదివారం ఆయన 101వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు బిజినెస్ పార్క్‌లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని హీరో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య కుమారుడు, నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘వెయ్యి సినిమాలకుపైగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటులు నాన్నగారు. తనదైన నటనతో యాభై ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ, హీరో అల్లు శిరీష్‌తో పాటు అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి వేడుకలు
పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి 124 జయంతి కార్యక్రమాన్ని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ - శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వర్చువల్‌గా నిర్వహించారు. ఏడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్, అమెరికా, భారతదేశాలకు చెందిన వక్తలు గాయనీమణులు పాల్గొన్నారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వసంత ప్రచురణగా 17 దేశాలకు చెందిన 250 మంది కవయిత్రులు రచించిన కవితా మేఘమాల అనే కవితా సంకలనాన్ని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఆవిష్కరించారు. దేవులపల్లి రచించిన సినిమా పాటలను ఆలనాటి నటి అలనాటి నటీమణి జమునా తలచుకుని ప్రసంగించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ.. సింగపూర్ నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలగడం తమ అదృష్టమన్నారు. వంశీ అధ్యక్షులు రామరాజు మాట్లాడుతూ.. దేవులపల్లి ఫౌండేషన్ అధ్యక్షురాలు లలిత రామ్ అందించిన ఆర్ధిక సహకారంతో, కవితా మేఘమాల సంకలనాన్ని ప్రచురించామన్నారు ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆవుల మంజులత, రాధిక మంగిపూడి, కలపటపు లక్ష్మీ ప్రసాద్‌లతో పాటు దేవులపల్లి కుటుంబ సభ్యులు లలితారామ్, రత్నపాప, సీతా రత్నాకర్, శారద తదితరులు పాల్గొన్నారు. -
బహుజనుల దార్శనికుడు బాపూజీ
కొండా లక్ష్మణ్ బాపూజీ అణగారిన వర్గాలకు భీష్మ పితామహుడు. బలహీన వర్గాలకు ఆయన ఇల్లే ఆశ్రయం.. ఖచ్చితత్వం, నిర్మొహమాటం ఆయన తత్వం. నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించి హైదరాబాద్ సంస్థానపు పోరాట ఉధృత స్వభావాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన ఉద్యమ కెరటం కొండా లక్ష్మణ్ బాపూజీ.. 1915 సెప్టెంబర్ 27వ తేదీన నేటి ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లాలోని వాంకిడి గ్రామంలో జన్మిం చారు. తల్లి అమ్మక్క, తండ్రి పోశెట్టి బాపూజీ. తన మూడవ ఏటనే 1918లో తల్లిని కోల్పోయి బాల్యం లోనే తీవ్ర కష్టాలను ఎదురీదాడు. 1931లో మహారాష్ట్రలోని నాగపూర్‌కి దగ్గరలోని చాందా ప్రాంతంలో అప్పటికే నిజాం ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి రహస్యంగా గాంధీజీ సమావేశానికి హాజ రయ్యారు. తద్వారా భారత స్వతంత్ర పోరాటంపట్ల ఆకర్షితులయ్యారు. భారత జాతీయోద్యమంలో భాగంగా ప్రప్రథమంగా 1938లో అరెస్టయ్యారు. అటుపిమ్మట 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1947 డిసెంబర్ 4న నిజాంపై జరిగిన బాంబు దాడిలో ప్రధాన సూత్రధారిగా నాయకత్వం వహిం చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. చాకలి ఐలమ్మ భర్త నరసింహ, ఆరుట్ల కమలాదేవి, నల్లా నరసింహులు లాంటి వారి కేసును వాదించి వారిని నిజాం చెర నుండి విడిపించాడు. చిట్యాల (చాకలి)ఐలమ్మ తాను పండించిన పంటకు శిస్తు ఎందుకు చెల్లించాలని కడవెండి (ఇప్పటి జనగామ జిల్లా ప్రాంతం) జమీందార్ విసునూరు రామచంద్రారెడ్డితో విభేదించి ఆంద్ర మహాసభ, కమ్యూనిస్ట్ నాయకులతో కలసి ఎదురుతిరగగా సూటిగా ఏమీ చేయలేక దొర తన మూకలతో కలిసి ఐలమ్మ భర్త నరసింహపై మోసపూరిత కుట్ర అనే అభియోగాన్ని నెరపి జైలుపాలు చేశాడు. దీనితో సైకిల్‌పై ప్రయాణిస్తూ బాపూజీ భువనగిరి కోర్టులో ఉచితంగా వాదించి ఐలమ్మ భర్తను విడిపించాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి, షేక్ బందగి లాంటి తెలంగాణ సాయుధ పోరాటవీరులను కాపాడి కమ్యూనిస్టుల మన్ననలు పొందారు. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సాగిన రహస్య కార్యకలాపాలు మొదలుకొని ఆంధ్రమహాసభ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలు, 1969లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమం వెనుకబడిన తరగతుల చేనేత సహకారోద్యమం, మలిదశ తెలం గాణ ఉద్యమం ఇలా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి బాపూజీ చరిత్ర పుటలకెక్కారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వివాహం జూన్ 27, 1948లో డాక్టర్ శకుంతలాదేవితో జరిగింది. వారికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. సురేష్, ఉమేష్, పవిత్ర వాణి. 1962 చైనా యుద్ధ సమయంలో ప్రధాని నెహ్రూ దేశ ప్రజల సహకారం కోరగా డాక్టర్ శకుంతలాదేవి తన బంగారు గాజు లను జాతీయ రక్షణ నిధికి ఇవ్వడంతో పాటు చైనా సరిహద్దు ప్రాంతంలో భారత సైన్యానికి వైద్య సేవలందించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమయిన తరువాత తెలం గాణ ప్రాంతంలో1952 లో జరిగిన మొదటి శాసనసభ ఎన్నికలలో బాపూజీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1956లో బాషా ప్రాతిపదికన ఏర్పాటు అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికలలో గెలుపొంది 1957లో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 1960లో మూడవ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి డిప్యూటీ స్పీకర్‌గా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. గాంధీజీ మొదలుపెట్టిన హరిజనోద్ధరణ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాలు పంచుకొన్న కొండా బాపూజీ నాటి ఆంధ్ర మహాసభ నాయకులు రావి నారాయణరెడ్డి అధ్యక్షులుగా ఉన్న హరి జన సేవాసంఘం హైదరాబాద్ కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. కేవలం పద్మశాలీలకే కాకుండా గౌడ, కురుమ, క్షత్రియ, గంగపుత్ర, విశ్వకర్మ హాస్టళ్ల స్థాపనకు అండగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాపూజీ లఘు, మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పరిశ్రమలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఏర్పాటుచేయాలనీ పట్టుపట్టి సాధించారు. హైదరాబాద్ లోని బాలానగర్‌లో పారిశ్రామిక వాడల అభివృద్ధికి 750 ఎకరాల భూమిని సేకరించారు. దీంతో హైదరాబాదులో బాలానగర్, జీడిమెట్ల, మియాపూర్ లాంటి పారిశ్రామిక ప్రాంతాలు ఆవిర్భవించాయి. నేడు దేశంలోనే అత్యున్నత పారిశ్రామిక ప్రాంతాలుగా విలసిల్లుతున్న హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు బాపూజీ దూరదృష్టికి, దార్శనికతకు నిలువెత్తు నిదర్శనాలు.. నాటి కాంగ్రెస్ జాతీయ నాయకులను కూడా ఒప్పించి అనేక కేంద్ర పరిశ్రమలు తెలంగాణలో నెలకొనడానికి కూడా అనితర కృషి సల్పారు. (నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి) వ్యాసకర్త: దాసు సురేష్. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొబైల్ : 91773 58286 -
మానవత్వం పరిమళించిన కవి తిలక్
సందర్భం ఆధునిక కవిత్వంలో మానవతా కేతనాన్ని నిలిపిన మహాకవి తిలక్. అనుభూతి వాద కవిగా ప్రకటించుకొన్న తిలక్ చేపట్టిన ప్రతి వస్తువునీ కవితామయం చేసి కవిత్వంలో వెలుగులు విరజిమ్మిన రవి. శైలీ రమ్యత సాధించిన నవకవి. జీవిత విశేషాలు : తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆయన 1921 ఆగస్టు 1న పశ్చిమగోదావరిజిల్లా తణుకు మండపాక గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి సత్య నారాయణకు లోకమాన్య బాలగంగాధర తిలక్‌పై ఉన్న అభిమానంతో ఆ పేరు పెట్టారు. రచనా వ్యాసంగం : ఆధునిక సాహితీ ఉద్య మాల్లో అప్పట్లో ప్రముఖంగా ఉన్న భావకవితా ఉద్యమ ప్రభావంతో 1937లో ప్రభాతము–సంధ్య అనే పద్యకవితా సంకలాన్ని వెలువరించాడు. బొంబాయిలో 1942లో జరిగిన అఖిల భారత అభ్యుదయ సంఘం ప్రతినిధిగా పాల్గొన్నారు. అనారోగ్యం వల్ల 1945 నుండి 1955 వరకు సాహిత్య కృషి అంతగా సాగలేదు. 1961 నుండి కవిత్వంలో కొత్త పోకడలు చూపించాడు. కవిత్వంతో పాటు కథలు, నాటకాలు, నాటికలు, వ్యాసాలు, లేఖా సాహిత్యం, మొదలైన ప్రక్రియలన్నింటినీ సుసంపన్నం చేశాడు. మరణానంతరం 1968లో ఆయన వచన కవితలను విశాలాంధ్ర పబ్లికేషన్వారు ‘అమృతం కురిసిన రాత్రి’ పేరిట ప్రచురించారు. ఈ సంకలానికి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. కవితా తత్త్వ వివేచన : తన కవితా లక్ష్యాన్ని వివరిస్తూ ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, ప్రజాశక్తుల విజయ ఐరావతాలు/ వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు’ అందమైన ఆర్ధ్రమైన భావాలను అందమైన శైలిలో చెప్పడమే తన కవితా లక్ష్యమన్నాడు. ఆధునిక కవిత్వ తత్త్వాల్లో తన కవిత్వం దేనికీ చెందదని స్పష్టీకరించాడు. తిలక్ కవితా విమర్శకుడిగా ‘నవత–కవిత’ ఖండికల్లో ‘కవిత్వం ఒక అల్కెమి. దాని రహస్యం కవికే తెలుసు. కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకు తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు. అని కవితా కళను రసవాదవిద్యతో పోల్చాడు. కవితా పర మావధిని వివరిస్తూ ‘కవిత్వం అంతరాంతర జ్యోతి స్సీమల్ని బహిర్గతం చేయాలి, విస్తరించాలి. చైతన్య పరిధి. అగ్ని చల్లినా/అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి కావాలని వివేచించాడు. తిలక్ హైదరాబాద్ నగరాన్ని స్త్రీతో పోల్చి నగరం మీద ప్రేమగీతం ఖండిక రాశాడు. ట్యాంక్‌బండ్‌ను స్త్రీ నడుముతో, అబిడ్స్ని కళ్లతో పోల్చాడు. నౌబత్పహాడ్ని నాగరంగా భావించి వర్ణించాడు. తపాలాశాఖ వార్షికోత్సవ సందర్భంగా తిలక్ మిత్రుడు డాక్టర్ తంగిరాల వెంకటసుబ్బారావు అభ్యర్థన మేరకు తపాలా బంట్రోతు ఖండిక రాశాడు. అప్పటి కవుల దృక్పథాన్ని అన్యాపదేశంగా అధిక్షేపిస్తూ ‘ఈ నీ ప్రార్థన కడుంగడు అసహ్యం సుబ్బారావు/ ఉత్త పోస్టుమన్ మీద ఊహలు రానే రావు’ అంటూ ప్రారంభించి తపాలా బంట్రోతు స్థితిని ‘ఎండలో వానలో ఎండిన చివికిన చిన్న సైజు జీతగాడు’ అంటూ వర్ణించాడు. ఆర్తగీతం ఆరంభంలో ‘నాదేశాన్ని గూర్చి పాడలేను, నీ ఆదేశాన్ని మన్నించ లేను. ఈ విపంచికలో శృతి కలుపలేను’ అని నిర్మోహ మాటంగా ప్రకటించాడు. తిలక్ కవితా ఖండికల్లో అధిక్షేపాత్మకాలెన్నో ఉన్నాయి. ప్రత్యేకించి ‘న్యూ సిలబస్’ ఖండికలో భారతదేశంలో అధిక జనాభాను, ఆర్థిక పరిస్థితిని అధిక్షేపిస్తూ ‘అమెరికాలో డాలర్లు పండును/ఇండియాలో సంతానం పండును’ అంటారు. స్త్రీలపై జరిగే అత్యాచారాలను, వేధింపులను అధిక్షేపిస్తూ ‘గజానికొక గంధారీ కొడుకు, గాంధీగారి దేశంలో... అంటాడు. ఆధునికాంధ్ర కవిత్వంలో అద్భుతమైన శైలీ విన్యాసంతో మానవతావాదానికి మకుటాయమానమైన ఖండికలతో అభ్యుదయానురక్తితో అమృతం కురిసిన రాత్రి సంకలాన్ని సృష్టించిన తిలక్ చిరస్మరణీయుడు. ఆధునిక కవులకు అనుసరణీయుడు. (ఆగస్టు 1న మహాకవి తిలక్ శతజయంతి) వ్యాసకర్త సాహితీ విమర్శకులు ‘ 98491 77594 డా. పీవీ సుబ్బారావు -
మోదీ మన్ కీ బాత్
-
పీవీ నిరంతర సంస్కరణ శీలి: కేసీఆర్
-
చనిపోయేముందు చివరిసారిగా ట్వీట్..
నుదుటిన నిండైన బొట్టు... సాంప్రదాయక చీరకట్టు... చట్టసభల్లో తనదైన శైలిలో ప్రసంగించే తీరుతో కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు సుష్మా స్వరాజ్. తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించి వారి చేత చిన్నమ్మగా.. సమస్యల్లో చిక్కుకున్న ఎంతోమందిని రక్షించిన విదేశాంగ మంత్రిగా యావత్ భరతావని చేత ‘సూపర్ మామ్’ అనిపించుకున్న సుష్మస్వరాజ్ జయంతి సందర్భంగా సాక్షి.కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. -
సుష్మా స్వరాజ్ భర్త భావోద్వేగ ట్వీట్!
ఒక్క ట్వీట్‌తో ఎంతో మంది సమస్యలను తీర్చి.. భారత ప్రజల చేత ‘‘సూపర్ మామ్’’ అనిపించుకున్న సుష్మా స్వరాజ్ మొదటి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ పలువురు నెటిజన్లు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్ ట్విటర్ అకౌంట్లో వారి కుమార్తె బన్సూరీ స్వరాజ్ షేర్ చేసిన ఫొటో.. అభిమానులకు సుష్మ నిండైన రూపాన్ని ఙ్ఞప్తికి తెస్తోంది. ‘‘హ్యాపీ బర్త్‌డే! మా జీవితాల్లోని సంతోషం సుష్మాస్వరాజ్’’ అంటూ కుటుంబ సభ్యులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేకు కట్ చేసేందుకు చేతిలో నైఫ్ పట్టుకుని చిరునవ్వు చిందిస్తున్న‘చిన్నమ్మ’ రూపం చూసి.. ‘‘ సూపర్ మామ్.. మీరెప్పుడూ మా హృదయాల్లో సజీవంగానే ఉంటారు’’ అంటూ నెటిజన్లు భావోద్వేగపూరిత ట్వీట్లు చేస్తున్నారు. కాగా సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ ప్రముఖ న్యాయవాది అన్న విషయం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. సనాతన హరియాణ కుటుంబానికి చెందిన సుష్మా స్వరాజ్ ఎన్నో అడ్డంకులను అధిగమించి.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి స్వరాజ్ కౌశల్‌ని వివాహం చేసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన తొలినాళ్లలోనే 1975 జూలై 13న వీరి వివాహం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో జైలుపాలైన సోషలిస్టు నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదిస్తున్నప్పుడే సుష్మ, స్వరాజ్ కౌశల్ దగ్గరయ్యారు. 44 ఏళ్ల వివాహ బంధంలో స్వరాజ్ కౌశల్, ప్రతి విషయంలో సుష్మకు వెన్నుదన్నుగా ఉన్నారు. కాగా ప్రేమికుల దినోత్సం రోజున జన్మించిన సుష్మా స్వరాజ్.. మొదటి జయంతి సందర్భంగా ఆమె భర్త కౌశల్ తన భార్యకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరినీ ఉద్వేగానికి గురిచేస్తోంది. ఇక గతేడాది ఆగస్టు 6న.. భారత విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ చివరిసారిగా ట్వీట్ చేశారు. -
మహాత్మా గాంధీకి ప్రధాని నివాళులు
-
మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో ఆయన సమాధి వద్ద భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం 7.16 గంటలకు మొదటగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, 7.33 గంటలకు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, 7.36 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ, 8.19 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. మహాత్ముడి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛతహ హీ సేవ మిషన్‌లో భాగంగా పరిశుభ్రత, పునరుద్పాక శక్తికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. రాహుల్, సోనియా గాంధీలు మహాత్ముడికి నివాళులు అర్పించిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో పాల్గొనేందుకు వార్దా బయలుదేరి వెళ్లారు. భారత దేశంలో పేదరికం రూపుమాపాలని, ఆర్ధికంగా, సామాజికంగా భారతీయులు వేగంగా ఎదగాలని గాంధీజీ కలలు కన్నారని ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. -
స్టార్‌స్టార్ సూపర్ స్టార్ - శ్రీదేవి
-
మరుపురాని మహానేత
-
కథానాయకుడు
-
సింగపూర్‌లో ఘనంగా అన్నమయ్య జయంతి ఉత్సవాలు
-
'అంతకంటే ముందే ఆయన 'జాతి రత్న'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ మాజీ రాష్ట్రపతి, భారత రత్న, ఇండియన్ మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాంను గొప్పగా కీర్తించారు. కలాం రాష్ట్రపతి కాకముందే రాష్ట్రరత్న(జాతిరత్న) అని కొనియాడారు. గురువారం కలాం 84 వజయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన జయంతి వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. డీఆర్ డీవో ప్రధాన కార్యాలయంలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలాం జీవితం అందరికి స్ఫూర్తి దాయకం అన్నారు. సానూకూల ధృక్పథం కలాం సొంతమని చెప్పారు. రాష్ట్రపతి కాకముందే ఆయన జాతిరత్నగా గుర్తింపు పొందారని అన్నారు. వీలయినంత త్వరలోనే రామేశ్వరంలో కలాం స్మారక నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.