'అంతకంటే ముందే ఆయన 'జాతి రత్న'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ మాజీ రాష్ట్రపతి, భారత రత్న, ఇండియన్ మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాంను గొప్పగా కీర్తించారు. కలాం రాష్ట్రపతి కాకముందే రాష్ట్రరత్న(జాతిరత్న) అని కొనియాడారు. గురువారం కలాం 84 వజయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన జయంతి వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. డీఆర్ డీవో ప్రధాన కార్యాలయంలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కలాం జీవితం అందరికి స్ఫూర్తి దాయకం అన్నారు. సానూకూల ధృక్పథం కలాం సొంతమని చెప్పారు. రాష్ట్రపతి కాకముందే ఆయన జాతిరత్నగా గుర్తింపు పొందారని అన్నారు. వీలయినంత త్వరలోనే రామేశ్వరంలో కలాం స్మారక నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.