
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
సాక్షి, న్యూఢిల్లీ: భారత జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో ఆయన సమాధి వద్ద భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం 7.16 గంటలకు మొదటగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, 7.33 గంటలకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, 7.36 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ, 8.19 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. మహాత్ముడి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
స్వచ్ఛతహ హీ సేవ మిషన్‌లో భాగంగా పరిశుభ్రత, పునరుద్పాక శక్తికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. రాహుల్, సోనియా గాంధీలు మహాత్ముడికి నివాళులు అర్పించిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో పాల్గొనేందుకు వార్దా బయలుదేరి వెళ్లారు. భారత దేశంలో పేదరికం రూపుమాపాలని, ఆర్ధికంగా, సామాజికంగా భారతీయులు వేగంగా ఎదగాలని గాంధీజీ కలలు కన్నారని ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment