
సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): హీరో చిరంజీవి శుక్రవారం రాజమండ్రిలో పర్యటించారు. అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా స్థానిక అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాలలో నూతన భవనం కోసం చిరంజీవి రూ.2 కోట్లు నిధులను కేటాయించారు. చిరంజీవితో పాటు అల్లు అరవింద్ కుటుంబసభ్యులు, మాజీ ఎంపి మురళీమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment